
గెటప్ మార్చిన గద్దర్
ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ దశాబ్దాలు గడుస్తున్నా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని, ఆ దిశగా ప్రభుత్వాలు సరైన కృషి చేయడంలేదనీ, ప్రజల్లో కూడా మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన నుంచే మార్పు జరగాలని భావించి ప్యాంట్, ఇన్‌షర్ట్ వేసుకుని, టై కట్టుకున్నానని, ఇక నుంచి అందరూ మారాలన్నారు.