
సాక్షి, విజయవాడ : నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను రవాణా చేస్తున్న లారీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం గన్నవరం వద్ద పట్టుకున్నారు. లారీలోని ముగ్గురు నిందితులను పట్టుకొని వారి నుంచి రూ. 18 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉయ్యూరుకు చెందిన కాంతారావు, భూక్యా చంద్రశేఖర్, పూణేకు చెందిన హజీ అత్తర్‌లుగా పోలీసులు గుర్తించారు. కాగా, వీటిని బరంపురం, ఇచ్చాపురం నుంచి విజయవాడకు తరలిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలింది.