
సాక్షి, ఖమ్మం : ఖమ్మంలోని సాయి గణేశ్ నగర్‌లో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఇద్దరు విటులు, ఆటో డ్రైవర్ సహా మొత్తం ఐదుమందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివి.. ఓ ఇంట్లో వ్యభిచారం జరగుతుందనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు వ్యభిచార గృహ నిర్వాహకులైన భార్యభర్తలను కూడా అరెస్టు చేశారు.
దంపతులతో సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment