
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ సీక్రెట్ అఫైర్స్ పబ్‌పై శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వాహకులు మద్యం విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పబ్‌పై దాడి చేసి రూ. 15 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment