డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌ | Oxytocin Drugs Gang Arrested | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌

Published Tue, Jul 10 2018 8:16 PM | Last Updated on Tue, Jul 10 2018 8:18 PM

Oxytocin Drugs Gang Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రమాదకర ఆక్సిటోసిన్‌ లిక్విడ్‌ను అక్రమంగా తయారు చేస్తున్న ముఠా సభ్యులను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం నిషేదించిన ఆక్సిటోషన్‌ను మల్లెపల్లికి చెందిన సురేశ్‌కుమార్‌ బన్సాల్‌ అనే వ్యక్తి అక్రమంగా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నగరంలోని డైరీలకు ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్స్‌ను అమ్ముతుంటారు. ఈ ఇంజెక్షన్‌ను గెదలకు ఇవ్వడం వల్ల పాల శాతం పెరుగుతుందని రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు.  ఇంజెక్షన్‌ చేసిన గెద పాలు తాగడం వల్ల చిన్న పిల్లల్లో హార్మోన్‌ ఎఫెక్ట్‌, మహిళలకు క్యాన్సర్‌ సోకడంతో పాటు గెదల జీవిత కాలం తగ్గిపోతుంది.

ఈ ముఠా నుంచి 1500 ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్‌ బాటిల్స్‌, మనుషులకు వాడే మూడు ఇంజక్షన్స్‌, మూడు సీలింగ్‌ మిసైన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 90వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. సురేష్‌ కుమార్‌, షైక్‌ అబ్దుల్‌ ఖలీద్‌లపై పీడీ యాక్ట్‌ నమోదు చేయనున్నట్లు టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ రాధాకృష్ణారావు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement