
సాక్షి, హైదరాబాద్: ఐ ఫోన్ 7 అమ్ముతానని ఓఎల్‌ఎక్స్ డమ్మీ ఫోన్ అమ్మిన రౌడీ షీటర్ ను నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన కళ్యాణ్ సుంకర అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాన్నే మార్గంగా ఎంచుకున్నాడు.
ఓఎల్‌ఎక్స్ వైబ్‌సైట్ ఐ ఫోన్ 7ను అమ్మడానికి ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి చాలామంది అతన్ని సంప్రదించారు. ఇది చూసిన ఓ వ్యక్తి దానిని కొనుగోలు చేశాడు. తిరా చూస్తే అది డమ్మీ ఫోన్ అని అతనికి తెలిసింది. విషయం తెలుసుకుని డమ్మీ ఫోన్ ఎందుకు అమ్మారని ఆ వ్యక్తి ప్రశ్నించాడు. నన్ను ప్రశ్నిస్తావా అని కోపంతో ఆ రౌడీ షీటర్ తన ఎయిర్ గన్‌తో బెదిరించాడు. దీంతో బాధితుడు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ రౌడీ షీటర్ నుంచి ఫోర్డ్ ఎండీవర్ కార్, ఎయిర్ గన్‌ని స్వాధీనం చేసుకున్నారు.
గతంలో జనసేన పార్టీ తరపున కళ్యాణ్ సుంకర పలు టీవీ ఛానెల్స్‌లో చర్చావేదికల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేనను పటిష్టం చేసుకోవాలని ఓ పక్క అధినేత పవన్ కళ్యాణ్ యోచిస్తోంటే ఆ పార్టీకి నేతగా ఉన్న కళ్యాణ్ సుంకర అరెస్ట్ కావడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment