
న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా కొనసాగుతున్న రైతు ఉద్యమం విజయవంతంగా ముగిసింది. డిమాండ్లపై వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ రైతులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. శుక్రవారం బిపిన్‌రావత్ అంత్యక్రియలు ఉండడంతో.. 11వ తేదీ ఉదయం 9గంటలలోపు రైతులు సింఘా బార్డర్‌ను ఖాళీ చేయనున్నారు. ఈ మేరకు రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.
డిసెంబర్ 13న పంజాబ్ రైతులంతా గోల్డెన్ టెంపుల్ సందర్శించనున్నారు. 15న కిసాన్ సంయుక్త మోర్చా మరోసారి సమావేశం కానుంది. కాగా, గతేడాది నవంబర్ 25న రైతు ఉద్యమం మొదలైంది. రైతు ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం సాగుచట్టాలను రద్దు చేసింది. సాగుచట్టాల రద్దు బిల్లుకు నవంబర్ 29న పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment