calloff
-
కేంద్రం లిఖిత పూర్వక హామీ.. ఆందోళన విరమించిన రైతు సంఘాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా కొనసాగుతున్న రైతు ఉద్యమం విజయవంతంగా ముగిసింది. డిమాండ్లపై వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ రైతులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. శుక్రవారం బిపిన్‌రావత్ అంత్యక్రియలు ఉండడంతో.. 11వ తేదీ ఉదయం 9గంటలలోపు రైతులు సింఘా బార్డర్‌ను ఖాళీ చేయనున్నారు. ఈ మేరకు రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. డిసెంబర్ 13న పంజాబ్ రైతులంతా గోల్డెన్ టెంపుల్ సందర్శించనున్నారు. 15న కిసాన్ సంయుక్త మోర్చా మరోసారి సమావేశం కానుంది. కాగా, గతేడాది నవంబర్ 25న రైతు ఉద్యమం మొదలైంది. రైతు ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం సాగుచట్టాలను రద్దు చేసింది. సాగుచట్టాల రద్దు బిల్లుకు నవంబర్ 29న పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. -
పశు వైద్య విద్యార్థుల సమ్మె విరమణ
గన్నవరం : ఏపీపీఎస్సీ ద్వారా పశు వైద్యుల పోస్టులు భర్తీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు 25 రోజులుగా చేస్తున్న సమ్మెను శనివారం విరమించారు. విద్యార్థుల ఆందోళనకు దిగివచ్చిన ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా పాత పద్ధతిలో డిపార్ట్మెంట్ సెలక్షన్ ద్వారా నియామకాలు జరిపేందుకు హామీ ఇచ్చింది. కళాశాల అసోసియేట్ ఇన్చార్జి డీన్ డాక్టర్ జి. శ్రీనివాసరావును కలిసిన విద్యార్థులు సమ్మె విరమణ నోటీసును అందజేశారు. తమ డిమాండ్ పరిష్కరానికి కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు, ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి సంఘ నాయకులు జి. సుబాష్‌చంద్రబోస్, ఎన్. శివరామకృష్ణ, సాయిసతీష్రాజు, ఫణికుమార్, గోపినాథ్, సుమంత్‌రెడ్డి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.·