
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేసిన ధర్నా వల్లే కేంద్రం దిగొచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేసిం దని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ (పీయూసీ), ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలసి జీవన్‌రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీ రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను అద్భుత చట్టాలు అంటూ ఇన్నాళ్లూ కీర్తించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్విం ద్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తరహాలోనే ధాన్యం కొనుగోలు విషయంలోనూ బీజేపీతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment