Lok sabha elections 2024: సామాన్యుడిలా క్యూలో నిలబడి ఓటేసిన సినీ స్టార్స్‌ | Lok Sabha Elections 2024: Tollywood Actors And Other Celebrities Casting Their Vote, Details Inside | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: ఓటేసిన సీనీ ప్రముఖులు

Published Mon, May 13 2024 7:39 AM | Last Updated on Mon, May 13 2024 5:14 PM

Lok sabha elections 2024: Tollywood And Other Film Actors Casting Vote In Lok Sabha Election

లోక్‌ సభ నియోజకవర్గాలలో పాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే ఏపీలో 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సీనీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. 

టాలీవుడ్‌ హీరో ఎన్టీఆర్‌ ఉదయం 7 గంటలకే భార్య ప్రణతి, తల్లితో కలిసి ఓటింగ్‌లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్  పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అలాగే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌కు ఉదయం 7.30 గంటలకే వచ్చిన బన్నీ.. అందరితో పాటు క్యూలో నిలబడి తన వంతు రాగానే ఓటు వేశాడు. అనంతరం మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 

 మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్య సురేఖ, కూతురితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ క్లబ్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. 

 

 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' సినిమాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తికేయతో కలిసి హైదరాబాద్ లోని షేక్ పేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

 

  • ఓటేసిన మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌.

 ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీ పోలింగ్‌ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. 

 

 

 హైదరాబాద్ లోని ఎఫ్ఎన్ సీసీలో ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వయసు సమస్యల కారణంగా మరో వ్యక్తి సాయంతో పోలింగ్ బూత్ లోకి వచ్చారు.

టాలీవుడ్ నటులు మోహన్ బాబు, అతడి కొడుకు మంచు విష్ణు.. తిరుపతి జిల్లాలోని ఏ. రంగంపేటలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement