Kangana Ranaut warns people to not visit Himachal, You will get heart attack with Beas' sound - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: సాహసాలకు ఇది సమయం కాదు.. అక్కడికి అస్సలు వెళ్లొద్దు: కంగనా వార్నింగ్

Published Mon, Jul 10 2023 4:46 PM | Last Updated on Mon, Jul 10 2023 4:57 PM

Kangana Ranaut Warns Do Not Travel To Himachal You Will Get Heart Attack  - Sakshi

బాలీవుడ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న కంగనా ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే తన సొంత బ్యానర్‌పై టికూ వెడ్స్ షేరూ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ‍అవనీత్ కౌర్ జంటగా నటించారు. అయితే తాజాగా కంగనా రనౌత్ ప్రజలతో పాటు తన ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!)

ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కంగనా తన అభిమానులను, ప్రజలను హెచ్చరించింది. దయచేసి ఈ సమయంలో హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. ఇటీవల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రస్తుతం హిమాచల్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవు.. రాబోయే రోజుల్లో వర్షం ఆగిపోయినా కొండచరియలు విరిగిపడే అవకాశముందని హెచ్చరించింది. కాగా.. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి జిల్లాలో జన్మించింది. 

కంగనా ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ..' ప్రస్తుతం హిమాచల్‌లో పరిస్థితి బాగాలేదు. అయినప్పటికీ అసాధారణమైనది ఏమీ లేదు. వర్షాకాలం హిమాలయాలంటే జోక్ కాదు. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. దయచేసి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవద్దు. వాటికి ఇది మంచి సమయం కాదు. బియాస్ నది ఉప్పొంగి గర్జించే స్థితిలో ఉంది. ఆ నది శబ్దాలకు మీకు గుండెపోటు వస్తుంది.' అని వార్నింగ్ ఇచ్చింది. 

(ఇది చదవండి: 'బేబీ'సినిమా.. హీరో విరాజ్‌ ఫుల్ కాన్ఫిడెన్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement