పవన్ గెలుపుపై సందేహాలు..
చంద్రబాబు సహకరిస్తారా.. వర్మ సాయం చేస్తారా ?
చంద్రబాబుతో రాజకీయ సావాసం అంటే చీకట్లో వెళ్తూ దెయ్యాన్ని తోడుతెచ్చుకున్నట్లే.. ఈ విషయం గతంలో బీజేపీకి.. కమ్యునిస్టులకు.. కాంగ్రెసుకు.. అందరికీ అవగతమైంది. పవన్ కల్యాణ్‌కు కూడా కాసింత అర్థం అయినట్లు అప్పుడప్పుడు ప్రవర్తిస్తూనే.. తనకు తోడుగా ఆ దెయ్యమైనా ఉంది.. పూర్తి ఒంటరిని కాదు కదా అనుకుంటూ దాంతోనే సావాసం, ప్రయాణం అనివార్యమైంది.
గతంలో టీడీపీని గెలిపిస్తే నన్ను నా తల్లిని తిట్టారు.. టీడీపీ వాళ్ళను వదిలిపెట్టను అన్నారు. కానీ, మళ్ళీ టీడీపీతో అంటకాగుతున్నారు. ఇక ఇప్పుడు పిఠాపురంలో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు ఎన్నికలు అంటే అసలు భయం పట్టుకుని తనను తానూ ఓ యోధుడిగా భావించుకుని రాజకీయాలు చేస్తున్నారు. పవన్ గతంలో భీమవరం.. గాజువాక.. రెండుచోట్లా ఓడిపోవడంతో షాక్ తిన్నారు. దీంతో ఇప్పుడు పిఠాపురంలో ఎలాగైనా గెలిపించాలని అర్థిస్తున్నారు. సీఎం అవ్వాలనుకుంటే నన్నెవడ్రా ఆపేది అనే డైలాగ్స్ దగ్గర్నుంచి ప్లీజ్.. నన్ను గెలిపించండి.. అర్థిస్తున్నాను అనేవరకు పవన్ వచ్చారు.
ఇదిలా ఉండగా టీడీపీ ఇంచార్జ్ వర్మ కూడా ఇప్పుడు పవన్‌కు పెద్ద నాయకుడైపోయారు. ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన పవన్ గెలుపు ఇప్పుడు వర్మ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. వర్మ చేతిలో పాతికవేలకుపైగా ఓట్లున్నాయనేది ఒక అంచనా.. గతంలో ఆయనకు అన్ని ఓట్లు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళా అవి ఆయనకు వస్తాయా రావా అనేది వేరే ప్రశ్న. కానీ, ఇప్పుడు పవన్ గెలవాలంటే వర్మ ఒక్కరే మనస్ఫూర్తిగా పని చేయాలి. అలా ఆయన చేస్తేనే వంగా గీత మీద పవన్ గెలిచేందుకు కొంతమేరకు అవకాశాలు ఉంటాయి.
కానీ, తన వేలితో తన కన్ను పొడుచుకునేందుకు వర్మ ఏమైనా అమాయకుడా? పవన్ కానీ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడే పోటీ చేస్తారు. అంటే అప్పుడు కూడా వర్మకు పోటీ చేసే అవకాశం ఉండదు. ఆ విధంగా పవన్‌ను గెలిపించడం ద్వారా వర్మ తన కెరీర్‌ను ముగించుకునేందుకు సిద్ధపడతారా?. అందుకే వర్మ కూడా ఇప్పుడు పవన్‌ను గెలిపించేందుకు నిజాయితీగా పని చేస్తారని నమ్మడానికి లేదని జనసైనికులు అంటున్నారు. వర్మ కూడా చంద్రబాబు శిష్యుడే.. కాబట్టి చంద్రబాబు సూచనల మేరకు పవన్ గెలుపు కన్నా ఆయన కూటమికే పని చేస్తారన్న అనుమానాలున్నాయి.
పవన్ గెలిస్తే అటు లోకేష్‌కు కూడా పోటీగా వచ్చే ప్రమాదం ఉందని చంద్రబాబు భావిస్తారని, అందుకే పవన్ కోసమే పని చేస్తున్నట్లు కనిపించాలి కానీ చివరికి ఓటమిని కానుకగా ఇవ్వాలని లోలోన వర్మకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ గెలుపు అంత వీజీ కాదని సైనికులు అంటున్నారు. గెలిపిస్తాను అని చెబుతూనే వర్మ చివరి నిమిషంలో తనవాళ్లను పక్కకు తప్పించి పవన్‌ను ఓటమి సముద్రంలో ముంచేసే ప్రమాదముందని అంటున్నారు. అందుకే పవన్ ఇప్పుడు పిఠాపురంలో పిల్లిమొగ్గలు వేయక తప్పడం లేదు.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment