![Pithapuram MLA Pendem Dorababu Clarity on Party Change - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/12/Pithapuram-MLA.jpg.webp?itok=_5KCu1zs)
సాక్షి, కాకినాడ జిల్లా: తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మార్పుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ‘‘పార్టీ మారను.. రాజీనామా చేయను.. వైఎస్సార్‌సీపీ, సీఎం జగన్‌తోనే నా ప్రయాణం’’ అని దొరబాబు స్పష్టం చేశారు.
ఆయన జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు,అభిమానులతో పిఠాపురం ఎమ్మెల్యే ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పిఠాపురం టికెట్ ఇస్తారని సీఎం జగన్‌పై నమ్మకం ఉందన్నారు. తాను ఏ పార్టీని కలవలేదని దొరబాబు అన్నారు.
ఇదీ చదవండి: టీడీపీ మూడు ముక్కలు.. భగ్గుమన్న వర్గ విభేదాలు
Comments
Please login to add a commentAdd a comment