Pendem Dora Babu
-
పార్టీ మారను..సీఎం జగన్ తోనే నా ప్రయాణం
-
‘పార్టీ మారను.. సీఎం జగన్‌తోనే నా ప్రయాణం’
సాక్షి, కాకినాడ జిల్లా: తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మార్పుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ‘‘పార్టీ మారను.. రాజీనామా చేయను.. వైఎస్సార్సీపీ, సీఎం జగన్‌తోనే నా ప్రయాణం’’ అని దొరబాబు స్పష్టం చేశారు. ఆయన జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు,అభిమానులతో పిఠాపురం ఎమ్మెల్యే ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పిఠాపురం టికెట్ ఇస్తారని సీఎం జగన్‌పై నమ్మకం ఉందన్నారు. తాను ఏ పార్టీని కలవలేదని దొరబాబు అన్నారు. ఇదీ చదవండి: టీడీపీ మూడు ముక్కలు.. భగ్గుమన్న వర్గ విభేదాలు -
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘనంగా దసరా వేడుకలు
-
రెండు చోట్లా ఓడిపోయినా సిగ్గు రాలేదు
-
ఎమ్మెల్యే దొరబాబుకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్యే దొరబాబు కరోనా బారినపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి ధైర్యంగా ఉండాలని దొరబాబుకు భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. కాగా వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు నేతలు కరోనా బారినపడి కోలుకున్నారు. -
పిఠాపురం ఎమ్మెల్యేకు పితృ వియోగం
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు పితృ వియోగం కలిగింది. దొరబాబు తండ్రి పెండెం పెద వీర్రాఘవరావు (94) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. వైఎస్సార్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. పెద వీర్రాఘవరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జిల్లాలో వెయ్యి దాటిన కరోనా కేసులు..
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో కరోనా వైరస్ కేసులు వెయ్యి దాటాయి. ఇప్పటి వరకు 98, 340 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా, 1,060 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 663 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, 386 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో 11 మంది మృత్యువాతపడ్డారు. దీంతో అధికారులు 130 చోట్లను కంటైన్మెంట్గా ప్రకటించారు. సామర్లకోట అమ్మణ్ణమ్మ గృహ సముదాయంలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కాకినాడ జగన్నాథపురాన్నిఅధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. మెయిన్‌రోడ్డులోని షాపులను అధికారులు మూసివేశారు. (ఏపీలో మరో 796 కరోనా కేసులు) మరోవైపు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలో లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రకటించారు. ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు వ్యాపార సముదాయాలు తెరవాలని సూచించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 12 గంటల నుంచి ప్రజలు రోడ్డు మీదకు రావొద్దని ఎమ్మెల్యే దొరబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. -
పిఠాపురంలో జనసేన, టీడీపీలకు ఎదురు దెబ్బ
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జనసేన, టీడీపీలకు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల విధానాలు నచ్చకపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి క్యూ కడుతున్నారు. జనసేన పార్టీ నేతలు కురమళ్ల రాంబాబు, సురవరపు సురేష్, టీడీపీ మహిళా నాయకురాలు వర్ధినీడి సుజాత, నాయకులు సింగంపల్లి బాబురావు, తడాల సత్యనారాయణతో పాటు 500 మంది వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ ఇప్పటికీ చంద్రబాబు పార్టనరేనని.. ఐటీ దాడులపై పవన్‌కల్యాణ్ నోరు విప్పకపోవడానికి కారణం అదేనని ఆయన విమర్శించారు. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్‌కల్యాణ్ అమరావతి రైతులను కలిశారని దొరబాబు విమర్శించారు. పవన్ విధి విధానాలు నచ్చకే జనసేన నుంచి ఆ పార్టీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. ఐటీ దాడులపై ఇంత వరుకు చంద్రబాబు నోరు మెదపక పోవడానికి కారణం ఏమిటని..నోరు విప్పితే ఆయన అవినీతి బండారం బయటపడుతుందని భయమా అని అన్నారు. అవినీతి బాగోతంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్ చేసిన అవినీతిపై లోతుగా సీబీఐ,ఈడీలతో దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే పెండెం దొరబాబు కోరారు. -
రైతు బాంధవులు అంటే వైఎస్సార్ కుటుంబమే
సాక్షి, కాకినాడ: రాష్ట్రంలో రైతు బాంధవులు అంటే అది వైఎస్సార్ కుటుంబమేనని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. ఎస్సీజడ్ అధ్యయన కమిటీ ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. అందుకే అక్కడి రైతులు ఆనందంతో సీఎం జగన్‌కు పాలాభిషేకం చేశారని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ-జెడ్ రైతుల కోసం అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక ఎస్సీజడ్ భూముల్లో ఏరువాక చేసిన చంద్రబాబు.. టీడీపీ అధికారంలోకి వచ్చాక అక్కడి రైతులపై అన్యాయంగా కేసులు పెట్టి వేధించారన్నారు. నేడు చంద్రబుబు అమరావతి రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులకు న్యాయం చేసేది సీఎం జగన్ మాత్రమేనని పేర్కొన్నారు. -
‘ఎమ్మెల్యేలుగా గర్వంగా తిరగ్గలుగుతున్నాం’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఆరు నెలల పాలనపై ఆయన స్పందిస్తూ.. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సమస్యలను ఆరు నెలల్లో తీర్చారు. లక్షా నలభై వేల మందికి శాశ్వత ఉద్యోగాలిచ్చారు. నాలుగు లక్షల వాలంటీర్ల ఉద్యోగాలతో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. మత్స్యకార భరోసాతో గంగపుత్రుల కష్టాలు తీరనున్నాయి. వీక్లీ ఆఫ్ అమలుతో పోలీసు కుటుంబాల్లో ఆనందం నింపారని ఎమ్మెల్యే ద్వారంపూడి వెల్లడించారు. మరోవైపు ఇదే అంశంపై పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ.. అరవై ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రిలా సీఎం జగన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. ఆరు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదని కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో మాదిగానే సీఎం జగన్ పాలనలో ప్రకృతి సహకరించిందని పోల్చి చెప్పారు. ఆరు నెలల్లో 80 శాతం హామీలను నెరవేర్చిన వైఎస్ జగన్ పాలన చూసి ప్రతిపక్షాలే ముక్కున వేలేసుకుంటున్నాయని ప్రశంసించారు. జగన్ గారి విధివిధానాల వల్ల ఎమ్మెల్యేలుగా ప్రజల్లో సగర్వంగా తిరగగలుగుతున్నామని వెల్లడించారు. రాజకీయ అవగాహన లేకుండా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే పవన్‌కల్యాణ్ చదువుతున్నారని దొరబాబు విమర్శించారు. -
ప్రజలంతా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు
-
పోలీస్ కేసు వెనక్కి తీసుకోవాలి
తూర్పుగోదావరి, గొల్లప్రోలు: మండలంలోని వైఎస్సార్ సీపీకి చెందిన 43మంది బూత్ కన్వీనర్లపై పోలీసు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో బుధవారం భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. పార్టీబూత్ కన్వీనర్లు 43 మంది పేర్లపై 1007 ఓట్లు తొలగించాలని ఆన్లైన్లో తప్పుడు అభ్యంతరాలు నమోదయ్యాయి. ఆ అభ్యంతరాలకు సంబంధం లేదని రెవెన్యూ అధికారులకు బూత్ కన్వీనర్లు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. అయినా తహసీల్దార్ ఫిర్యాదు చేశారని పిఠాపురం సీఐ సూర్య అప్పారావు, గొల్లప్రోలు ఎస్సై బి.శివకృష్ణ పార్టీ బూత్ కన్వీనర్లను పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో విషయాన్ని తెలుసుకున్న దొరబాబు పార్టీ శ్రేణులతో కలసి తహసీల్దార్ వై.రవికుమార్‌ను కలుసుకుని కావాలని గుర్తు తెలియని వ్యక్తులు పార్టీ బూత్ కన్వీనర్లు పేర్లపై ఓట్లు తొలగింపునకు ఆన్లైన్లో ఫారం–7 దరఖాస్తు చేశారన్నారు. దీనిపై ఇప్పటికే వారం రోజుల కిత్రం ఆర్ఓకు వినతి పత్రం ఇచ్చి, దోషులను గుర్తించాలని కోరానన్నారు. ఇప్పుడు కేసులు పెట్టి పోలీస్‌స్టేషన్‌కు రావాలని బూత్కన్వీనర్లపై బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎక్కడా లేని విధంగా ఒక్క గొల్లప్రోలు మండలంలోనే కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓట్లు తొలగింపుకు ఆన్లైన్ ధరఖాస్తులు వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేశారు. పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరారు. ఉన్నతాధికారుల సూచన మేరకు పోలీసులకు సమాచారమిచ్చామని, వారి విచారణలో నిందితులను గుర్తిస్తారని తహసీల్దార్ తెలిపారు. మెయిన్‌రోడ్డుపై బైఠాయింపు తహసీల్దార్ సమాధానంపై సంతృప్తి చెందిన పార్టీ నాయకులు దొరబాబు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మెయిన్‌రోడ్డుపై బైఠాయించారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు ఆపాలని భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న సీఐ సూర్య అప్పారావు సంఘటన స్థలానికి చేరుకుని దొరబాబుతో మాట్లాడారు. ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని , తహసీల్దార్ ఇచ్చిన పేర్లకు సంబంధించిన వారు రాతపూర్వకంగా సమాధానం ఇస్తే సరిపోతుందన్నారు. దీనిపై దొరబాబు మాట్లాడుతూ తమకు సంబంధం లేని విషయాన్ని పోలీస్‌స్టేషన్ వరకు తీసుకురావల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. తహసీల్దార్‌కు ఇచ్చిన పత్రాలను మీరు తీసుకుని , విచారణ జరుపుకోవాలని కోరారు. అర్ధరాత్రి సమయంలో బూత్ కన్వీనర్ల ఇళ్లకు వెళ్లి పోలీస్‌స్టేషన్‌కు రావాలని భయభ్రాంతులకు గురిచేయడం మంచిది కాదన్నారు. దీంతో పోలీస్‌సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీడీపీ ఓటమి భయంతోనే పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మొగలి బాబ్జీ, పార్టీ పట్టణ, మండల అధ్యక్షుడు పర్ల రాజా, అరిగెల రామయ్యదొర, బూత్‌కన్వీనర్లు దాసం లోవబాబు, కడిమిశెట్టి కుమారభాస్కరరెడ్డి పాల్గొన్నారు. -
వర్మా.. ఇది ధర్మమా..!
తాగునీటి సదుపాయం కోసమంటూ మంచినీళ్ల ప్రాయంలా కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నట్టుగా హడావుడి చేస్తున్న అధికార పార్టీ నేతలు ఆ నీడలో కమీషన్లు దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వైఎస్ హయాంలో నిధులు మంజూరై పనులు జరిగినా తమ ఖాతాలో వేసుకుంటూ ప్రారంభోత్సవాలకు సమాయత్తమవడాన్ని చూసి జనమే నవ్వుకుంటున్నారు. ఇంకోవైపు రక్షిత మంచినీటి పథకాల శుభ్రతంటూ నిధులు పక్కదారి మళ్లిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ శుక్రవారం జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా నీటి పథకాల డొల్లతనాలపై ప్రత్యేక కథనాలు. తూర్పుగోదావరి, పిఠాపురం: 2009 మార్చి 2న అప్పటి కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు పిఠాపురంలో మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా అప్పటి తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరు కాగా అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ దేవరపల్లి రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఆ నుంచి ప్రారంభమైన మంచినీటి పథకం పనులు తరువాత ఎమ్మెల్యేగా వంగా గీతా విశ్వనాథ్ హయాంలో అంటే 2014కి 80 శాతం పూర్తయ్యాయి. అప్పటి ప్రతిపక్ష నేత 2014లో ఎమ్మెల్యేగాఎన్నికైన ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నిధులున్నా ఎందుకు పూర్తి చేయడం లేదంటూ అప్పటి ఎమ్మెల్యేపై విరుచుకు పడిన సంఘటనలున్నాయి. అలాగే తనను గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే పథకం పనులు పూర్తి చేయించి ప్రారంభిస్తానని హామీలు కూడా ఇచ్చారు కానీ ఈ నాలుగున్నరేళ్లు ఆ పథకం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే గత ఎమ్మెల్యే వంగా గీత హయాంలో ఐదేళ్లు, ఇప్పుడు నాలుగున్నరేళ్లు పనులు జరిగాయి. ఎట్టకేలకు ఇప్పుడు పూర్తయ్యాయి. 2009 నుంచి ఇప్పటి వరకు పదేళ్లుగా పనులు సాగడం, అదనపు నిర్మాణాలు చేపట్టడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగి రూ.21.90 కోట్లు నుంచి రూ.35 కోట్ల వరకూ ఖర్చయింది. ఇంత వరకూ బాగానే ఉంది కానీ ఎమ్మెల్యే వర్మ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.35 కోట్లు మంజూరు చేసినట్లు, తమ ప్రభుత్వమే ఈ పథకం నిర్మించినట్లు చెప్పుకోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు 2009లో పనులు ప్రారంభమైతే 2014లో 80 శాతం పూర్తయితే ఇప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రూ.35 కోట్లు మంజూరు చేయడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతమంతా అవినీతా...? గత ప్రభుత్వం హయాంలో అవినీతి చోటుచేసుకుంటే అధికారంలోకి వచ్చిన తమరు ఆ అవినీతిని ఎందుకు బయటపెట్టలేదని, అలాగే 20 శాతం మాత్రమే మిగిలి ఉన్న పనులను గత నాలుగున్నరేళ్లుగా ఎందుకు పూర్తి చేయలేక పోయారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పిఠాపురంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా మంచినీటి వనరులు కల్పించడం కష్టంగా మారిన నేపథ్యంలో అప్పటి ఎమ్మెల్యే పెండెం దొరబాబు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ పథకానికి నిధులు మంజూరు చేశారు. పిఠాపురం పట్టణ దాహార్తిని తీర్చడానికి గత 11 ఏళ్ల క్రితం రూ.20 కోట్లు వెచ్చించి చిత్రాడ చెరువులో నిర్మించిన మంచినీటి పథకం ప్రారంభానికి ముందే కూలిపోతోంది. రూ.21.90 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ మంచి నీటి పథకం గత పదేళ్లుగా కొనసాగుతుండగా ఈ ఏడాది పనులు పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేశారు. ఎమ్మెల్యే వర్మ హయాంలో జరిగిన పనుల్లో ఇంతలోనే నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. లక్షల గ్యాలన్ల నీటిని నిల్వ చేసే స్టోరేజ్ ట్యాంక్ ప్రారంభానికి ముందే అండలు జారి కూలిపోతుండగా నిండా నీరుపెడితే పరిస్థితి ఏమిటని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రారంభించాలన్న హడావిడి తప్ప పక్కా పర్యవేక్షణ కొరవడడంతో నాణ్యాతాలోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అవినీతి వల్ల పనులు జరగలేదన్న ఎమ్మెల్యే వర్మ ఇప్పుడు నాణ్యతా లోపాలపై పెదవి విప్పకపోవడం వెనుక రహస్యం ఏమిటో ఆయనకే తెలియాలని స్థానికులు మండిపడుతున్నారు. ఈ పథకాన్ని రాష్ట్రమంత్రి నారా లోకేష్‌తో శుక్రవారం ప్రారంభించడానికి ఎమ్మెల్యే వర్మ సన్నాహాలు చేస్తున్నారు. -
సంస్థానంలో దోషులు ‘దేశం’ నేతలే..!
తూర్పుగోదావరి, పిఠాపురం: కోట్ల రూపాయల భక్తుల ఆస్తులపై కన్నేసిన టీడీపీ నేతలు సంస్థానంలో దొడ్డిదారిన అడుగుపెట్టి రెండేళ్లలో సుమారు రూ.50 కోట్లు దారి మళ్లించారని వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో అవినీతిపై విచారణ లేకుండా చేయడానికి ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో ఇక్కడ అవినీతి జరుగుతోందన్న ప్రచారం చేయించిన వర్మ తన అనుచరులను ట్రస్టు సభ్యులుగా వేయించి సంస్థానంలో తన హవా కొనసాగించారని ఆయన దుయ్యబట్టారు. ట్రస్టు సభ్యులైన తన అనుచరుల ద్వారా రూ.కోట్ల ఆస్తులను పక్కదారి పట్టించారని ఇటీవల తనకు వాటాలు రాకపోవడంతో పాటు అవినీతి బయటపడుతుందన్న భయంతో దేవాదాయ శాఖలో విలీనం చేసేలా పావులు కదిపారన్నారు. అవినీతికి పాల్పడింది టీడీపీ నేతలే అయినా ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించి, తమకు ఏపాపం తెలియదన్నట్టుగా నాటకాలాడారన్నారు. బోర్డు సభ్యులందరూ చేసిన అవినీతిని కొందరే చేసినట్లుగా చిత్రీకరించి మిగిలిన వారిపై అవినీతి పరులని ముద్ర వేసి వారి అంతు చూస్తానని ప్రకటనలు ఇచ్చి అవినీతిలో తనకు సంబంధం లేదన్నట్టుగా వర్మ డ్రామాలాడారని ఆయన తీవ్రంగా విమర్శించారు. తన అవినీతి కార్యక్రమాలకు అధికారులను బలి చేయడం వర్మకు అలవాటేనని ఇప్పటి వరకు ఎందరో అధికారులు బలి కాగా ఇప్పుడు సంస్థానం ఏఈఓను బలి చేశారన్నారు. అసలు రూ.9 కోట్లు అడ్డంగా దోచేశారని విలేకర్ల సమావేశంలో చెప్పిన వర్మ ఆ అవినీతి పరులపై విచారణ లేకుండా విచారణను పక్కదోవ పట్టించిన అధికారిపై విచారణ జరిపి అవినీతి దేశం నేతలకు కొమ్ముకాస్తున్నారని ఆయన విమర్శించారు. కావాలనే విచారణను వాయిదాలు వేస్తూ అవినీతి పరులు సర్దుకోడానికి సమయం ఇస్తున్నారని అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే న్యాయమూర్తితో విచారణ జరిపించి అవినీతి పరులను వెంటనే అరెస్టు చేయించాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు భక్తుల మనోభావాలు దెబ్బతిన కూడదన్న కారణంగా ఈ విషయాన్ని రాజకీయం చేయకూడదని ఆగామని కానీ అవినీతి పరులపై విచారణ జరిపితే తన బండారం బయటపెడతారన్న భయంతో విచారణను ఎమ్మెల్యే వర్మ పక్కదారి పట్టించడంతో తాము బయటకు రావాల్సి వచ్చిందన్నారు. దేవాదాయ శాఖ అధికారులు వెంటనే అవినీతిపై విచారణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. -
మీరేమైనా రౌడీలా ?
పిఠాపురం : ఎవరైనా వేలెత్తి చూపితే వేలు తీసేస్తాననడానికి మీరేమైనా బజారు రౌడీలా, అడిగిన వారందరి అంతు చూస్తారా ? అయితే మీ అధికార దుర్వినియోగాన్ని బహిరంగంగా ఎండగడతా అంటూ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సవాల్ విసిరారు. కొత్తపల్లిలో హోటల్ మేనేజ్మెంటు కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నామని ఏదైనా చేస్తామని, ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తల వైపు వేలెత్తి చూపితే అవి తీసేస్తానని వ్యాఖ్యానించడంపై పెండెం మంగళవారం ఘాటుగా స్పందించారు. పాలక పక్షం చేసే అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించడం దానిని వేలెత్తి చూపే హక్కు ప్రతిపక్షానికి ఉందని, ఆ హక్కును కాలరాయాలని చూస్తే ఎంతటి వారైనా కాలగర్భంలో కలిసిపోతారని చరిత్ర చెబుతోందన్నారు. టికెట్టు ఇవ్వకపోతే ఇప్పుడు దేవుడంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునే పచ్చిదగా కోరని, మోసగాడని, నమ్మిన వారిని నట్టేట ముంచుతాడని బహిరంగంగా విమర్శించి ఆ పార్టీ జెండాలు నడిరోడ్డుపై తగలబెట్టించిన వర్మ ఈ రోజు గతం మర్చిపోయి మాట్లాడడం ప్రజలు చూస్తున్నారని వారు తగిన బుద్ది చెప్పే రోజు దగ్గర పడిందన్నారు. ఏ పార్టీ పేరుతో ఇప్పుడు పబ్బం గడుపుకుంటున్నావో అదే పార్టీకి ప్రాణాలు దారబోసిన నేతలను కార్యకర్తలను ఎందుకు పక్కన పెడుతున్నావో సమాధానం చెప్పుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉందన్నారు. గతంలో ప్రతి పక్ష నేతగా గత ఎమ్మెల్యే చేసిన ప్రతి పనిని వర్మ వేలెత్తి చూపాడని, అన్ని పనులకు అడ్డు తగిలాడని ఆ ఎమ్మెల్యేలు మీలాగే వేలు తీసేసుంటే ఈ రోజు వర్మకు అసలు వేళ్లే ఉండేవి కాదని ఆయన అన్నారు. ఒక వేలుతో ఎదుటి వారిని చూపిస్తే నాలుగేళ్లు నీవైపు చూపిస్తాయన్న నిజాన్ని మరిచి అధికార దాహంతో మాట్లాడడం మానుకోకపోతే తీవ్రస్థాయిలో ప్రజా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. గతంలో హోటల్ మేనేజ్మెంటు కాలేజీకి ఒక చోట శంకుస్థాపన చేశారని, కొత్తపల్లి హైస్కూలులో మినీ స్టేడియం నిర్మాణానికి నిధులు విడుదల అవ్వడం మట్టి నమూనాలు తీయడం పనులు ప్రారంభం కావడం జరిగిన విషయాన్ని చెప్పడం ప్రతిపక్షం చేసిన తప్పుగా భావించడం ఎంతవరకు సమంజసమో వర్మ సమాధానం చెప్పాలన్నారు. కొత్తపల్లి మండలంలో ఎమ్మెల్యే వర్మ తన అనుచర గణంతో చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలపై కార్యకర్తలు నాయకులతో వచ్చి అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.