సాక్షి, కాకినాడ: రాష్ట్రంలో రైతు బాంధవులు అంటే అది వైఎస్సార్ కుటుంబమేనని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. ఎస్సీజడ్ అధ్యయన కమిటీ ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. అందుకే అక్కడి రైతులు ఆనందంతో సీఎం జగన్‌కు పాలాభిషేకం చేశారని తెలిపారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ-జెడ్ రైతుల కోసం అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక ఎస్సీజడ్ భూముల్లో ఏరువాక చేసిన చంద్రబాబు.. టీడీపీ అధికారంలోకి వచ్చాక అక్కడి రైతులపై అన్యాయంగా కేసులు పెట్టి వేధించారన్నారు. నేడు చంద్రబుబు అమరావతి రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులకు న్యాయం చేసేది సీఎం జగన్ మాత్రమేనని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment