కూటమి ప్రభుత్వానికి వంగా గీత చాలెంజ్‌ | Tirumala Laddu Row: Vanga Geetha Challange Chandrababu | Sakshi
Sakshi News home page

ఆ ఆరోపణలు నిరూపించండి.. చంద్రబాబు &కోకు వంగా గీత చురకలు

Published Thu, Sep 26 2024 1:34 PM | Last Updated on Thu, Sep 26 2024 2:43 PM

Tirumala Laddu Row: Vanga Geetha Challange Chandrababu

కాకినాడ, సాక్షి: రాజకీయంగా ఎదుర్కొనలేకే తిరుపతి లడ్డూ ప్రసాదం ద్వారా వైఎస్‌ జగన్‌పై కూటమి ప్రభుత్వం ఆరోపణలు  చేస్తోందని, దమ్ముంటే ఆ ఆరోపణలను నిజమని నిరూపించాలని వైఎస్సార్‌సీపీ నేత వంగా గీత సవాల్‌ విసిరారు.  

పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఇన్ఛార్జ్ గీత గురువారం మధ్యాహ్నాం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ‘‘ సిట్‌ పేరిట చంద్రబాబు తమకు కావాల్సిన మనుషులతో విచారణ జరిపిస్తే ఎలా?. టీటీడీ లడ్డు వివాదంలో నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. సీబీఐ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. చేసిన ఆరోపణల్లో కూటమి ప్రభుత్వం నిజనిజాలు తేల్చాలి అని గీత అన్నారు.

జగన్‌ను రాజకీయంగా తగ్గించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు తిరుమల లడ్డుపై ఆరోపణలు చేశారు. ముందు ఆ ఆరోపణలను నిజాలు అని నిరూపించండి. అప్పుడు జగన్‌ డిక్లరేషన్‌ గురించి మాట్లాడడండి అని రాజకీయ ‍ప్రత్యర్థులకు ఆమె సవాల్‌ విసిరారు. చివర్లో దేవుడితో.. టీటీడీతో ఆటలొద్దని కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబుకి ఆమె హెచ్చరిక జారీ చేశారు. 

దేవుడుతో ఆటలొద్దు.. మీకు దమ్ముంటే లడ్డు వివాదంపై వంగా గీత రియాక్షన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement