వివిధ రాష్ట్రాలకు బకాయిపడిన జీఎస్టీ పరిహారాన్ని రెండు విడతల్లో పూర్తిగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తమ రాష్ట్రాలకు జీఎస్టీ వాటా, ఐజీఎస్టీ కింద చెల్లించాల్సిన పరిహారాలు ఇంతవరకూ రాలేదని పలువురు ఎంపీలు సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ వివరణ ఇచ్చారు.