
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతకు కరోనా పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం నుంచి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కాకినాడ జీజీహెచ్‌లో పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం నాటి ఫలితాల్లో కోవిడ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. స్వల్ప లక్షణాలే ఉండటంతో వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌కి వెళ్లారు. కాగా ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రతీ కార్యక్రమంలోనూ ఎంపీ గీతా పాల్గొంటున్నారు. కోవిడ్ ఆస్పత్రుల సందర్శనతో పాటు నియోజకవర్గంలోనూ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే వైరస్ సోకినట్లు వైద్యులు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. (ఏపీలో కొత్తగా 9,901 పాజిటివ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment