స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కాకినాడ ఎంపీ వంగా గీత తెలిపారు. విజయవాడ పీడబ్లూ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసి అఖిల భారత డ్వాక్రా బజార్ 2019ను ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే రెండో అతిపెద్ద డ్వాక్రా బజారుగా ఈ బజార్ నిలిచిపోతుందని అన్నారు. ఢిల్లీలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసే ఎగ్జిబీషన్ బజారు తరువాత ఇదే అతి పెద్దదని పేర్కొన్నారు. 370 స్టాళ్లలో 22 రాష్టాలకు చెందిన 450 స్వయం సహాయక సంఘాలు భాగస్వామ్యం కావడం సంతోషమని తెలిపారు. కేవలం పది రోజుల్లోనే రూ. 3.5 కోట్ల వ్యాపారం జరగడం శుభ పరిణామన్నారు. డ్వాక్రా మహిళలకు చేయూతనిచ్చేలా ప్రతి జిల్లా స్థాయిలోనూ డ్వాక్రా బజార్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
అఖిల భారత డ్వాక్రా బజార్ 2019
Published Sun, Oct 13 2019 3:38 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
Advertisement