exbition
-
సాలార్జంగ్ మ్యూజియంలో ఆద్య కళల ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
ఎగ్జిబిషన్ సొసైటీ అక్రమాలు : ఈటెలపై ఫిర్యాదు
-
అఖిల భారత డ్వాక్రా బజార్ 2019
-
‘దేశంలోనే రెండో అతిపెద్ద డ్వాక్రా బజారు’
సాక్షి, విజయవాడ : స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కాకినాడ ఎంపీ వంగా గీత తెలిపారు. విజయవాడ పీడబ్లూ గ్రౌండ్లో ఏర్పాటు చేసి అఖిల భారత డ్వాక్రా బజార్ 2019ను ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే రెండో అతిపెద్ద డ్వాక్రా బజారుగా ఈ బజార్ నిలిచిపోతుందని అన్నారు. ఢిల్లీలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసే ఎగ్జిబీషన్ బజారు తరువాత ఇదే అతి పెద్దదని పేర్కొన్నారు. 370 స్టాళ్లలో 22 రాష్టాలకు చెందిన 450 స్వయం సహాయక సంఘాలు భాగస్వామ్యం కావడం సంతోషమని తెలిపారు. కేవలం పది రోజుల్లోనే రూ. 3.5 కోట్ల వ్యాపారం జరగడం శుభ పరిణామన్నారు. డ్వాక్రా మహిళలకు చేయూతనిచ్చేలా ప్రతి జిల్లా స్థాయిలోనూ డ్వాక్రా బజార్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అదే గ్రౌండ్లో మరోవైపు అపోలో టెలీ మెడిసిన్ నెట్ వర్కింగ్ ఫౌండేషషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యంపై ప్రజలందరూ శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఆనందకరమని, పీడబ్ల్యూ గ్రౌండ్లో అఖిల భారత డ్వాక్రా బజార్‌కు వచ్చేవారు సైతం ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
వినోదంలో విషాదం
ఎగ్జిబిషన్ నిర్వాహకులు భద్రతాప్రమాణాలు పాటించకపోవడంతో ఒక నిండు ప్రాణం బలైంది. ముక్కుపచ్చలారని చిన్నారి తిరిగిరాని లోకాలకు చేరింది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హఠాత్పరిణామంతో సందర్శకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అనంతపురం సెంట్రల్: నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో రోబో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో నగర వాసులే కాకుండా జిల్లా నలుమూలల నుంచి కూడా ఎంతోమంది తమ పిల్లలతో కలిసి ఎగ్జిబిషన్‌కు వచ్చారు. రోబో యానిమల్స్‌ను తిలకిస్తూ.. వాటి వద్ద సంతోషంగా సెల్ఫీలు దిగారు. అటు నుంచి లోనికి వెళ్లి వివిధ రకాల స్టాల్స్‌ను పరిశీలించారు. బ్రేక్‌డ్యాన్స్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, క్రాస్ వీల్, ట్రైన్, జీపు, స్కూటర్ రైడింగ్ తదితర వాటిలో తిరుగుతూ ఆనందంగా గడిపారు. ఇంకొందరు జాయింట్‌వీల్ ఎక్కారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో జాయింట్వీల్లోంచి రెండు బాక్సులు ఊడి 50 అడుగుల ఎత్తులోంచి కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన రాజు కుమార్తె అమృత(8), అనంతపురం మండలం కొడిమికి చెందిన రాఘవేంద్ర కుమార్తె జ్యోతి, శ్రీరాములు కుమార్తె రాధమ్మ, గుత్తికి చెందిన రాజు భార్య జర్షితి మేరీ, బత్తలపల్లి మండలం పోట్లమర్రికి చెందిన కృష్ణమూర్తి భార్య గంగాదేవి, అనంతపురం మండలం రుద్రంపేటకు చెందిన కృష్ణ కుమారుడు వాసుతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. వీరిలో అమృత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దైవదర్శనం నుంచి తిరిగి వస్తూ.. ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన రాజు, అనంతపురం మండలం రుద్రంపేటకు చెందిన కృష్ణ ఇరువురూ తమ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. దర్శనం పూర్తయ్యాక ఆదివారం అనంతపురం వచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన రోబో యానిమల్స్ ఎగ్జిబిషన్‌కు వెళ్లారు. జాయింట్‌వీల్‌లో తిరుగుతున్నపుడు ప్రమాదం జరగడంతో రాజు కుమార్తె అమృత (8) ప్రాణం విడిచింది. అమృత తల్లి ఆస్పత్రిలో సొమ్మసిల్లి పడిపోయింది. నిర్వాహకులపై ఆగ్రహం జాయింట్‌వీల్ విరిగి చిన్నారి మృతి చెంది.. మరో ఆరుగురు గాయపడినప్పటికీ ఎగ్జిబిషన్ నిర్వాహకులు పట్టించుకోలేదు. యథావిధిగా ఎగ్జిబిషన్ కొనసాగిస్తుండటంపై స్థానికులు ఆగ్రహించారు. జాయింట్‌వీల్ ఆపరేటర్ రఘు మద్యం మత్తులో ఉండటం గమనించి.. అతడిని చితకబాదారు. అతడి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాయింట్‌వీల్ ఆపరేటర్ రఘును త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ఎగ్జిబిషన్లో జరిగిన ప్రమాదం గురించి తెలియగానే డీఎస్పీ వెంకట్రావ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి సర్వజనాస్పత్రికి చేరుకుని గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొందరిని మెరుగైన వైద్యం కోసం సవేరా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల సమక్షంలో వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. -
దేవుడు పోషించేవాడే కాదు సరిదిద్దేవాడు కూడా!
సువార్త ఎగ్జిబిషన్లో ఇసుకేస్తే రాలనంత జనంలో తన ఐదేళ్ల కొడుకు తప్పిపోతాడన్న భయంతో తండ్రి కొడుకు చేయి గట్టిగా పట్టుకున్నాడు. వాడేమో అక్కడి ఆకర్షణలకు లోనై తండ్రి చేయి విడిపించుకునే నిరంతర ప్రయత్నంలో ఉన్నాడు. కొడుకు ధ్యాసంతా ఎగ్జిబిషన్ మీద, తండ్రి ధ్యాసంతా కొడుకు మీద! ఆరు లక్షల మందికి పైగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్య విముక్తులై వాగ్దాన దేశానికి వెళ్తున్న అరణ్య మార్గంలో ఎన్నో మార్లు తిరుగుబాటు చేసి దేవుని చేయి విడిపించుకునే ప్రయత్నం చేశారు. కొన్నాళ్లకు దేవుడు కూడా విసిగిపోయి ‘ఇక నేను మీతో రాను’ అని వారి నాయకుడైన మోషేకు తెలిపాడు (నిర్గమ 33:3). నీవు మాతో రాకపోతే మేము ముందుకు సాగేది లేదంటూ మోషే దేవుని ప్రాథేయపడి ప్రార్థన చేశాడు (నిర్గమ 33:15). ఫరోకు భయపడి మోషే తల్లిదండ్రులు అతను పుట్టగానే కన్నతల్లిదండ్రుల ప్రేమకు దూరమై ఆయా పరిస్థితుల్లో పెరిగి పెద్దవాడైనా, క్రమంగా నిజం తెలుసుకొని పరలోకపు తండ్రియైన దేవుని ప్రేమను అతను అపారంగా చవిచూశాడు. తన దేవుడైన పరలోకపు తండ్రితో ప్రగాఢమైన అనుబంధాన్నేర్పర్చుకున్న మోషే దేవుడు లేకపోతే క్షణకాలం కూడా భరించలేనంత అత్యున్నతమైన ఆత్మీయ స్థితికి ఎదిగాడు. అందుకే కోరినంత అత్యున్నతమైన ఆత్మీయ స్థితికి ఎదిగాడు. అందుకే కోరి మరీ దేవుని సన్నిధిని సాధించుకున్నాడు. దేవుని సన్నిధిలో పోషణ, భద్రత మాత్రమే కాదు దిద్దుబాటు కూడా ఉంటుందని ఎదిగినవాడుగా మోషే తన ప్రజల కోసం ప్రార్థించి సాధించిన ఘనవిజయం దేవుని నిరంతర సన్నిధి. దేవుడు కావాలా, దేవుడు చేసే అద్భుతాలు కావాలా అనడిగితే మోషే తడుముకోకుండా దేవుడే కావాలంటాడు. ఇశ్రాయేలీయుల ప్రస్థానమంతా అడుగడుగునా దేవుని అద్భుతాలలోనే సాగినా, వాటిని తాను ప్రత్యక్షంగా చూసినా దేవుని సన్నిధి ఇచ్చిన ఆనందం, తృప్తి మోషేకు అవేమీ ఇవ్వలేదు. ఎందుకంటే అద్భుతాలు తాత్కాలికం కాని దేవుని సన్నిధి శాశ్వతం. రకరకాల ఒత్తిళ్లు, పోటీతత్వం, ఘర్షణలు, ఓటములు, ప్రచ్ఛన్న పోరాటాలు భాగంగా మారిన ఆధునిక జీవనశైలితో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో సందిగ్ధావస్థలో సరైన మార్గం కోసం, పరిష్కారం కోసం చూసే వారే. అలాంటప్పుడు దేవుడు దారి చూపించేవాడు మాత్రమే కాదు, మీతోపాటు ఉండి, ఆశీర్వాదపథంలో చేయి పట్టుకొని విజయపథం వైపునకు నడిపిస్తానని దేవుడంటే అదెంత భాగ్యం! మోషే ప్రార్థన అదే. మాకు దారి చూపించడం కాదు, మాతో ఉండమంటూ ఆయన దేవుని బతిమాలాడు. అలా దేవుడు మానవాళికి గమ్యం, మార్గం మాత్రమే కాదు. యేసుక్రీస్తు రూపంలో మనతో నడిచే బాటసారి కూడా అయ్యాడు. అందుకే యేసు ‘నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం’ అని సాధికారికంగా ప్రకటించాడు (యోహాను 14:6). జీవితంలో ఎంతో ప్రయాసపడి ఎంతెంతో సాధించి, సంపాదించి చివరికి అది దేవుని సన్నిధిలేని బతుకైతే, విందుభోజనం పారేసి విస్తరాకు నమిలినట్టే కదా! నగరం నడిబొడ్డున కరెంటు తీగమీద కూర్చున్న ఒక పిచ్చుక ‘ఈ ప్రజలు ఎందుకిలా పరిగెత్తడం, ఎందుకీ హడావుడి, హైరానా?’ అనడిగిందట. ‘మనల్ని పోషిస్తున్న పరలోకపు తండ్రి తమను కూడా పోషించగల సమర్థుడని వారికి తెలియదు, అందుకే’ అని జవాబిచ్చిందట మరో పిచ్చుక. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్