
సాక్షి, తుని: రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉంటే సహాయం చేయకపోగా చంద్రబాబు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా తునిలో ఎంపీ గీతతో కలిసి రాజా విలేకర్లతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు తన అనుంగులైన యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడులతో కలిసి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. విశాఖ మెడిటెక్ జోన్ గురించి మాట్లాడడానికి వారికి అర్హత లేదన్నారు. కాకినాడ సెజ్‌ను యనమల సోదరులు సొంత అవసరాలకు వాడుకున్నారని ధ్వజమెత్తారు.
విశాఖలో వెంటిలేటర్లు, కరోనా పరీక్ష కిట్లు, కాకినాడ సెజ్‌లో పీపీఈలు తయారు చేయించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. మా సలహాలు తీసుకొండని చంద్రబాబు అంటున్నారని, వెన్నుపోటూ, ప్రజలను మోసగించడం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోని నెట్టడం దేనిని తీసుకోవాలో చెప్పాలని రాజా ప్రశ్నించారు. నిజంగా ప్రజల కోసమైతే అమరావతి వచ్చి సేవలందించాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలీకృతమయ్యాయని ఎంపీ గీత అన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం సహకరించాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ కొయ్యా మురళి, ఏలూరి బాలు పాల్గొన్నారు. చదవండి: నిర్లక్ష్యమే ముంచుతోంది..!
Comments
Please login to add a commentAdd a comment