Dadisetti Raja
-
మరోసారి తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
-
రేపు ఎన్నికలలో టీడీపీ తోక జాడిస్తే.. వైస్సార్సీపీ పవరేంటో చూస్తారు!
-
దాడిశెట్టి రాజాపై టీడీపీ గుండాల దౌర్జన్యం
-
నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు జగనన్నకు నా కృతజ్ఞతలు..
-
ఈనాడుకు నా ధన్యవాదాలు.. మరి చంద్రబాబు, పవన్ పరిస్థితి ఏంటి..?
-
లేఖ కాదు యనమల.. విచారణకు ఆదేశించాలి?: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: కాకినాడ సెజ్ భూములపై యనమల రామకృష్ణుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే భూ దోపిడీపై చంద్రబాబుతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. అలాగే, 2014లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్ భూములపై తీర్మానం జరిగిందని చెప్పుకొచ్చారు. నాడు మంత్రిగా ఉన్న యనమల.. రైతుల పక్షాన ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు.మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు దాడిశెట్టి రాజా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ..‘తన రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబుకు యనమల లేఖ రాశారు. 2002-03లో కాకినాడ సెజ్ కోసం భూసేకరణ ప్రారంభమైంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే. 2014లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్ భూములపై తీర్మానం జరిగింది. అప్పుడు ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల ఎందుకు సెజ్ రైతుల పక్షాన నిలవలేదు.సెజ్‌కు ముందుగానే తన భూములను ఇచ్చి.. రైతులంతా భూములు ఇచ్చేలా మోటివేట్ చేసిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. సెజ్ రైతులపై యనమలకు చిత్తశుద్ది ఉంటే భూ దోపిడిపై చంద్రబాబుతో విచారణ జరిపించాలి. వేల కోట్లు దోచుకున్న కేవీరావు చౌదరి నుండి సొమ్ములు వెనక్కి తీసుకుని.. సెజ్ రైతులకు ఎకరాకు రూ.40 లక్షలు తిరిగి చెల్లించాలి. సెజ్ రైతులకు వైఎస్ జగన్ భూములు తిరిగి ఇచ్చేశారు. అలాగే, చంద్రబాబుకు కూడా రైతులకు తిరిగి భూములు ఇచ్చే విధంగా భగవంతుడు ఆయనకు మంచి మనసు ప్రసాదించాలి.సెజ్‌లో నేను ఆరు ఎకరాల భూమి కొన్నది వాస్తవమే. రైతులకు మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర చెల్లించి ఆ భూములు కొనుగోలు చేశాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా రైతుల నుండి భూములు కొనుగోలు చేశారు. సరైన పద్దతిలో భూముల కొనుగోలు చేయడంలో తప్పు లేదు కదా? అని ప్రశ్నించారు. -
యనమలపై దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు
-
వైఎస్సార్సీపీలో ఉంటే ఆస్తులు కొనుక్కోకూడదా?: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, బీసీ, కాపులను అణివేసే ధోరణీ జరుగుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటోందని విమర్శించారు. గత వైఎస్ జగన్ హయంలో ధాన్యం ధర రూ.2వేలు ఉంటే.. చంద్రబాబు పాలనలో రూ.1400 లకే రైతులు అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులకు ఫీజు రింబయిర్స్మెంట్ చెల్లించాలని, లేదంటే వైఎస్సార్సీపీ తీవ్రమైన ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.ఈ మేరకు శుక్రవారం దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. కాకినాడ సెజ్‌లో తాను ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. మార్కెట్ మీద హెచ్చు రేటు పెట్టి భూములను రైతుల నుంచి కొనుక్కున్నానని చెప్పారు. 1940 నుంచి తమ కుటుంబం బంగారం వ్యాపారంలో ఉందన్నారు. తన దగ్గర డబ్బులు ఉండటం వల్లే రైతులు అమ్మిన భూములు కొన్నుకున్నట్లు పేర్కొన్నారు.‘చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదేదో తప్పులా అసత్య ప్రచారాలు చేశాయి. ఆ మధ్య చంద్రబాబు భూములు కొనుక్కున్నారు. ఇటీవల పిఠాపురంలో 15 ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఈ పది రోజుల కాలంలో రెండు ఆస్ధులను యనమల రామకృష్ణుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, యనమల కొన్న ఆస్ధులు ప్రజల దగ్గర దోచుకున్నవే అని నేను ఆరోపించగలను.ఒక్క బకెట్ బురద చల్లేస్తే సరిపోతుందా?. వైఎస్సార్సీపీలో ఉన్నాం కాబట్టి మేము ఆస్ధులు కొనుక్కోకూడదా?. యనమల మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో రూ. రెండు లక్షలు లేకపోతే రైతు సంఘాలు ఖర్చులు బరించి గెలిపించాయి. ఇవాళ యనమల దగ్గర వేలాది కోట్ల ఆస్ధులు ఉన్నాయి. ఆ ఆస్ధులన్ని పేదలకు పంచిపెట్టాలి’ అని తెలిపారు -
ఎల్లో మీడియాపై మంత్రి దాడిశెట్టి రాజా సీరియస్
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు మాటలు నీటి మూటలంటూ మండిపడ్డారు మంత్రి దాడిశెట్టి రాజా. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు చెప్పేవి అన్నీ అసత్యాలు.. అబద్దాలేనంటూ ధ్వజమెత్తారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కాదా? గ్రామాల్లోకి వచ్చి కళ్లు పెట్టుకుని చూస్తే తెలుస్తుందంటూ ఎల్లో మీడియాపై మంత్రి నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ పాలనలో తునిలో ప్రతి గ్రామం ప్రశాంతంగా ఉంది. అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని తునిలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. నేను కళ్లు ఎర్ర చేస్తే చాలు మీ అంతు తేలుతుంది. నేను ప్రతిపక్షంలో ఉండగా కళ్లు ఎర్ర చేస్తే మీరు ఇళ్లు, వాకిలి వదిలి ఏవీ నగరంలో దాకున్నారు’’ అంటూ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. -
సభలో జనం లేక పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు దాడిశెట్టి రాజా కామెంట్స్
-
యనమల బ్రదర్స్ కు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్
-
తేటగుంటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
యనమల, ఏబీఎన్ రాధాకృష్ణపై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్
సాక్షి, కాకినాడ జిల్లా: యనమల అనే ముసలి నక్క ఆంధ్రజ్యోతిలో తనపై అసత్య కథనాలు రాయిస్తున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తునిలో గృహ సారధులు, వార్డు కన్వీనర్లతో మంత్రి దాడిశెట్టి శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చిన వార్తనే మళ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాధాకృష్ణ.. యనమల రామకృష్ణుడికి చెంచానో.. యనమలకు రాధాకృష్ణ చెంచానో అర్థం కావడం లేదన్నారు. ‘‘కోటనందూరులో నాకు, నా కుటుంబసభ్యులకు ఎకరం భూమి ఉన్నా.. అది యనమలకు, రాధాకృష్ణకు రాసిస్తానని’’ మంత్రి సవాల్ విసిరారు. దేశంలో ఉన్న ప్రముఖ నగరాల్లో యనమలకు ఆస్తులు ఉన్నాయని మంత్రి దాడిశెట్టి అన్నారు. చదవండి: బాబు కొత్త అవతారం.. ఫ్రీగా వరాలిస్తున్న చంద్రం బాబా.. -
టీడీపీ నేతకు లివర్ వ్యాధి.. సీఎం రిలీఫ్ ఫండ్ రూ.20 లక్షలు మంజూరు
తుని: కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరానికి చెందిన టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ మాజీ సభ్యుడు కె.కృష్ణకు లివర్ వ్యాధి చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.20 లక్షలు మంజూరు అయింది. ఇందుకు సంబంధించిన ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణ భార్య లక్ష్మికి అందజేశారు. కొంతకాలంగా కృష్ణ లివర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని ఏఎంసీ మాజీ చైర్మన్ మురళి మంత్రి రాజా దృష్టికి తీసుకొచ్చారు. విశాఖపట్నం మణిపూర్ ఆస్పత్రిలో కృష్ణకు వైద్య సేవలు అందిస్తున్నారు. తమ ప్రభుత్వం పథకాలతో పాటు వైద్య సేవలను పార్టీలకు అతీతంగా అందిస్తున్నదని మంత్రి రాజా అన్నారు. చదవండి: Fact Check: బురద రాతలే పునరావృతం -
గంటకో నిర్ణయం.. పూటకో మాట.. పవన్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్
సాక్షి, తుని(కాకినాడ జిల్లా): పవన్ కల్యాణ్‌ను ఆ పార్టీ నేతలు మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘గంటకో విధంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్ సభలకు జనం రావడం లేదు. ఈ సభలతో పవన్ కల్యాణ్ నవ్వులపాలవుతున్నారు. పవన్‌ను సీఎం కాదు.. ఎమ్మెల్యే చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు’ అంటూ మంత్రి తేల్చి చెప్పారు. ‘‘తాను మంచి చేశానని భావిస్తేనే సీఎం జగన్ ఓటు వేయమంటున్నారు. అలా చెప్పే ధైర్యం చంద్రబాబు, పవన్‌కు ఉందా?. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ రెండు సభలు ప్లాప్ అయ్యాయి. ఎక్కడి పోటీ చేస్తాడో పవన్‌కే క్లారిటీ లేదు. నవ్వు సీఎం అయిపోవాలనుకుంటే అయిపోవు.. ప్రజలు మద్దతిస్తేనే అవుతావు 2014-19లో టీడీపీ, పవన్, బీజేపీ కలిసి మేనిఫెస్టో రూపొందించారు. మేనిఫెస్టో హామీలు అమలు చేయకపోతే చంద్రబాబును నిలదీశావా పవన్’’ అంటూ దాడిశెట్టి దుయ్యబట్టారు. చదవండి: ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు ‘‘పవన్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు సైక్రియాటిస్ట్‌కు చూపించాలి. చంద్రబాబు ప్యాకేజీ సరిగా ఇవ్వడేమోనని అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నావు. టీడీపీ ప్రభుత్వంలో ఆలయాలను కూల్చేస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు?. కోట్లమందిని చంద్రబాబు మోసం చేస్తే పవన్ ప్రశ్నించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. టీడీపీ పాలనలోని పరిస్థితిని పవన్ కల్యాణ్ గుర్తు తెచ్చుకోవాలి. తన యాజమాని చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయం. పవన్ తన నోటికి ఏదితోస్తే అది మాట్లాడుతున్నారు’’ అని మంత్రి దాడిశెట్టి నిప్పులు చెరిగారు. -
ఎన్టీఆర్ కు చంద్రబాబు, రజనీకాంత్ క్షమాపణ చెప్పాలి
-
‘చంద్రబాబు జీవితమంతా కబ్జాలు, అబద్దాల బాగోతమే’
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రులు సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు పదవీ వ్యామోహంతో పిచ్చి పట్టిందన్నారు. చంద్రబాబుది అంతా కబ్జాలు, అబద్దాల బాగోతమే అంటూ విమర్శలు చేశారు. కాగా, మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. సెప్టెంబర్ నుంచి విశాఖ నుండే పరిపాలన కొనసాగుతుందన్నారు. చంద్రబాబు మళ్లీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. చంద్రబాబుది అంతా కబ్జాలు, అబద్దాల బాగోతమే. హామీలు నెరవేర్చలేదు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపించారు. సంస్కారం లేకుండా చంద్రబాబు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడు. రామ్మోహన్నాయుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు పదవీ వ్యామోహంతో పిచ్చి పట్టింది. చంద్రబాబు 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేని దద్దమ్మ. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయాలి. 2024 ఎన్నికల్లో మళ్లీ విజయం వైఎస్ఆర్సీపీదే అని అన్నారు. -
ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: యనమల రామకృష్ణుడి మాటలను తుని ప్రజలు విశ్వసించడం లేదని, చివరికి ఆయనకు ఇళ్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ‘‘ఆదివారం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ప్రాథమిక వైద్యశాలలో వైద్యులు లేరంటున్నారు.. తుని పీహెచ్సీలో వైద్యులు లేరని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని మంత్రి సవాల్ విసిరారు. ‘‘సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలతోనే మళ్లీ ఎన్నికలకు వెళ్తాం. 2014-2019 వరకు వరకు తన పరిపాలన చూసి ఓటేయండి అనే ధైర్యం చంద్రబాబుకు ఉందా’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. -
చంద్రబాబు ఆస్కార్ కోసమే పవన్ రాజకీయ డాన్స్
సాక్షి, అమరావతి: మూడు నెలల తరువాత బయటకు వచ్చిన పవన్‌కళ్యాణ్ తన యజమాని చంద్రబాబు చెప్పినట్టుగా నటించి మంగళవారం సాయంత్రానికి ప్యాకేజీ తీసుకోడానికి సిద్ధపడుతున్నారని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) చెప్పారు. చంద్రబాబు ఇచ్చే అవార్డే పవన్‌కు ఆస్కార్‌వంటిదని, దానికోసంనాటునాటు పాటకంటే బాగా రాజకీయ డాన్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి రాజా సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు రాసిన జనసేన రాజ్యాంగంలోని మాటలనే ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ వల్లిస్తారని ఎద్దేవా చేశారు. బీసీలు, కాపులు కలిపి చంద్రబాబుకు రాజ్యాధికారం కల్పించాలన్నట్టుగా, బాబు పల్లకీ మోయాలని, లేదంటే బానిసలే అన్నట్టుగా దత్తపుత్రుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 18 లోక్‌సభ స్థానాల్లో ఒక్కటి కూడా బీసీలకు ఎందుకివ్వలేదని నిలదీశారు. వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చాలనే 2019లో ప్రతి అసెంబ్లీ, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక అజెండా పెట్టుకున్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబే అని తన పుస్తకంలో రాసిన హరిరామ జోగయ్య... ఇప్పుడు చంద్రబాబు గూటిలో దూరేందుకు సిద్ధంగా ఉన్నాననడం సిగ్గుచేటన్నారు. జోగయ్య పెట్టిన కాపు సేవా సమితి పేరును కమ్మ సేవా సమితి అని మార్చుకుంటే సరిగ్గా సరిపోతుందన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ కాపులు రోడ్డెక్కితే రకరకాల కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అయినా పవన్ మళ్లీ కాపులను గంపగుత్తగా చంద్రబాబు కాళ్ల దగ్గర పడేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీడీï³, జనసేన ఎన్ని కుట్రలు చేసినా 2024లో ప్రజలు వైఎస్సార్సీపీని గెలిపించడం ఖాయమన్నారు. -
పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, కృష్ణ: మూడు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ బయటికొచ్చి హడావిడి చేస్తూ.. బీసీలు, కాపులు కలిసి రాజ్యాధికారం చేపట్టాలని మాట్లాడుతున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. తుని రైలు దహనం కేసు ఘటనలో విజయవాడ రైల్వే కోర్టుకు మంత్రి దాడిశెట్టి రాజా, సినీనటుడు జీవా, ఇతర కాపు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారం అంటే చంద్రబాబు పల్లకీ మోయడమేనా అంటూ మండిపడ్డారు. కొత్తగా చంద్రబాబుతో కలిసి ఉన్నట్లు పవన్ మాట్లాడుతున్నాడని, వాళ్లిద్దరూ 2014 నుంచి కలిసే ఉన్నారని వ్యంగాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకు, తనకు కాపులు ఓటేయకపోతే బీసీలు బానిసలైపోతారనేలా పవన్ మాట్లాడుతూ.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నారు. ఈనెల 14న పవన్ యాక్టింగ్‌ను బట్టి అతని ప్యాకేజ్ ఉంటుందన్న ఆయన.. అదే రోజు నాటు నాటు పాటకు మించి పవన్ డాన్సు ఉంటుందని వ్యంగ్రాస్త్రాలు సంధించారు. కాపులతో పాటు ఎస్సీ,ఎస్టీల పై కేసులు ఎందుకు పెట్టావని చంద్రబాబుని అడిగావా పవన్ అంటూ ఫైర్ అయ్యారు. 2024లో 175 కి 175 స్థానాలు గెలిచి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్
సాక్షి, కాకినాడ: ఫ్రస్ట్రేషన్లో టీడీపీ అధినేత చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. చంద్రబాబును పిచ్చాస్పత్రికి పంపించాలని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. చంద్రబాబుకు గతంలోనే ప్రజలు బుద్దిచెప్పారని కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాగా, మంత్రి దాడిశెట్టి రాజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మనస్సుల్లో సీఎం వైఎస్ జగన్ నిలిచిపోయారు. ప్రజలకు ఏరోజూ వాస్తవాలు చెప్పే అలవాటు చంద్రబాబుకు లేదు. తూర్పుగోదావరి జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు. 2024 ఎన్నిల్లోనూ టీడీపీకి ప్రజలు తగిన బుద్ధిచెబుతారు. చంద్రబాబును మెంటల్ ఆసుపత్రికి పంపించాలి. నారా లోకేష్‌ది తెలంగాణ డీఎన్ఏ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ప్రస్ట్రేషన్‌లో చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: మంత్రి దాడిశెట్టి రాజా
-
యనమల వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు.. మంత్రి దాడిశెట్టి రాజా కౌంటర్
సాక్షి, తుని (కాకినాడ జిల్లా): యనమల రామకృష్ణుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘ఏపీ విద్యా విధానాలను కేంద్ర బడ్జెట్లోనూ ప్రస్తావించారు. అనేక విషయాల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించింది. నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చాం. విద్య, వైద్య రంగాలకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నాం’’ అని మంత్రి అన్నారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో టాయిలెట్లు కూడా సరిగాలేవు. నాడు-నేడు కింద రూపురేఖలు మార్చిన స్కూళ్లు గురించి తెలుసుకో. యనమల స్వగ్రామంలోనూ నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది’’ అని దాడిశెట్టి రాజా హితవు పలికారు. ‘‘యనమల వస్తే నియోజకవర్గంలో స్కూళ్లకు తీసుకెళ్తా. ఆయన అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారు. హైస్కూల్ వస్తే మన పొలాల్లో పనిచేసేందుకు ఎవరూ ఉండరన్నావు. యనమల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది’’ అని మంత్రి రాజా అన్నారు. చదవండి: నారా లోకేష్ ఫ్లాప్ షో.. యువగళం ‘గండాలు’ -
పవన్ ఏమాత్రం సంస్కారం లేని వ్యక్తి: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, తాడేపల్లి: ఎప్పుడో చచ్చిపోయిన చంద్రబాబు పార్టీని బతికించటానికి పవన్ కల్యాణ్ తెగ ఆరాటపడుతున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. బలమైన కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూడా పవన్ దూషణలకు దిగాడని మండిపడ్డారు. తమ నాయకుడు చంద్రబాబు చెప్పాడని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. మంత్రి అంబటి రాంబాబు కాపులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే నేత అని, అలాంటి వ్యక్తిని కూడా దూషించడం సరికాదన్నారు. కష్టంతో ఎదిగిన గుడివాడ అమర్నాథ్ను సైతం తిట్టాడరి, పవన్ ఏమాత్రం సంస్కారం లేని వ్యక్తి అని ఆగ్రహవం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు, పవన్ ఒకటేనని మేము ముందు నుంచే చెప్తున్నాం. అందుకే దత్తపుత్రుడు అంటున్నాం. సీఎం జగన్‌ను ఎదుర్కోలేనని పవన్ నిన్న తేల్చి చెప్పాడు. పవన్ చేసే జోకర్ చేష్టలు, బ్రోకర్ చేష్టలన్నీ చూసి కాపులంతా అసహ్యించుకుంటున్నారు. తన సభలకు వచ్చే యువతను రెచ్చగొట్టి పెడదారి పట్టేలా చేస్తున్నారు. ‘నిన్ను నమ్మి వస్తే.. పోలీసులపై తిరగపడమని అనటం ఏంటి?. వారు కేసుల్లో ఇరుక్కుని భవిష్యత్తు నాశనం చేసుకోవాలా?. నిన్ను చూసి సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. నీ దత్తతండ్రి ఇచ్చే స్క్రిప్టు చదివితే సరిపోతుందా?. సంవత్సరానికి 15 వేల కోట్ల పెట్టుబడులు ఈ మూడేళ్లలో గ్రౌండ్ అయ్యాయి. అలాంటివి నీ కళ్లకు కనపడవా?. రాష్ట్రంలో అలజడులు సృష్టించటానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. నాసిరకం సినిమాలు తీసి అవి ప్లాప్ అయితే.. ప్రజలను తిట్టడం ఏంటి?. కాంతారా లాంటి సినిమాలు హిట్ అవుతుంటే నీ భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు ప్లాప్ అవుతున్నాయో అర్థం చేసుకో. పవన్ ఎంతమందితో వచ్చినా వైఎస్సార్సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.175 స్థానాల్లో గెలిచి తీరుతామని దాడిశెట్టి రాజా ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఇంటికో ఉద్యోగమని చెప్పి మోసం చేస్తే పవన్ ఎందుకు ప్రశ్నించలేదు? -
రాష్ట్రంలో వారిద్దరికంటే మించిన తుగ్లక్‌లు ఎవరూ లేరు: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: టీడీపీ హయాంలో చంద్రబాబు, యనమల రామకృష్ణుడు కలిసి ఎన్నో చీకటి జీవోలు తెచ్చి ప్రజల గొంతు నొక్కారని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. యనమలకు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రాణాలు పోతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా?. చంద్రబాబు పబ్లిసిటి పిచ్చికి ఈ రోజుకి 40 మంది ప్రాణాలు పోయాయి. ఇరుకు సందుల్లో మీ వాహనాలు పోనిచ్చి ప్రజలు తొక్కిసలాటకు గురి కావడాన్ని ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. సీఎం జగన్ పాదయాత్ర ఒక చరిత్ర. ఈ రాష్ట్ర భవిష్యత్‌ను మార్చిన పాదయాత్ర అది. ప్రతి ఆవారా చేస్తే అది పాదయాత్ర అవ్వదు. కొవ్వు కరిగించుకునే యాత్ర అవుతుంది. టిడిపి కార్యక్రమాల పేరు చెప్పి నెలకు రూ.15 లక్షలు పేద ప్రజల సొమ్ము కాజేసిన ఘనత యనమలది. యనమల.. చంద్రబాబు కంటే తుగ్లక్‌లు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఉండరు అంటూ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. చదవండి: (చంద్రబాబు కుప్పం పర్యటనలో ఓవరాక్షన్‌పై ఎమ్మెల్సీ భరత్ ఫైర్) -
‘చేసిందేమీ లేకపోయినా కొత్త డ్రామా తెరలేపాడు’
కాకినాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. పనిగట్టుకుని పోలవరంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నది చంద్రబాబేనని విమర్శించారు దాడిశెట్టి రాజా. పోలవరం మీద చంద్రబాబు కొత డ్రామాకు తెరతీశారని, ఆయన హయాంలో పేదలకు చేసేందేమీ లేదనే విషయం గుర్తించుకుంటే మంచిదన్నారు. మేనిఫెస్టోను దాచేసి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. -
Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే
సాక్షి, కాకినాడ: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. అధికారంలో ఉన్నన్నాళ్లూ అక్రమాలను ప్రశ్నించిన గొంతుకలను కక్షలు, కార్పణ్యాలతో నొక్కేశారు. ఇలా ఆ పార్టీ నేతల అధికార దాహానికి బలైపోయిన కుటుంబాలు కోకొల్లలు. టీడీపీ ఏలుబడిలో వైకల్యాల జ్ఞాపకాలు, నెత్తుటి మరకలు చాలా కుటుంబాలను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. నాడు అరాచక పాలన సాగించిన నేతలు అధికారం ఇక కల అని తేలిపోవడంతో నేడు ఉనికి కోసం పాటుపడుతున్నారు. ప్రతి అంశానికీ రాజకీయ రంగు పులుముతున్నారు. తమ దాష్టీకాలు ఎక్కడ బయటపడతాయోనని ఈ రకమైన వ్యూహం అనుసరిస్తున్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నిన్న గాక మొన్న తుని నడిబొడ్డున ఆ పార్టీ నాయకుడు పోల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగితే వాస్తవాలతో సంబంధం లేకుండా అధికార పార్టీపై బురదజల్లుడుకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసి తుని ప్రజల తిరస్కారానికి గురైన యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడు ఈ హత్యపై రాజకీయ దుమారానికి పాల్పడ్డారు. ప్రభుత్వం, మంత్రి దాడిశెట్టి రాజా ఇందుకు బాధ్యులంటూ దారుణ విమర్శలకు తెగబడ్డారు. ఇదెక్కడి చోద్యం శేషగిరిరావుపై హత్యాయత్నం కేసుపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. రాజకీయ కోణంలో కాకుండా వాస్తవ దృక్పథాన్ని ప్రదర్శించింది. ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసింది. వారం తిరక్కుండానే ఈ కేసులో ప్రధాన నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించింది. ఈ సంఘటనకు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. శేషగిరిరావు వేధింపులు, బెదిరింపులే కారణమని నిర్ధారించారు. విశాఖ జిల్లా ఆరిలోవ పెద్దగదిలిలోని తన గురువు అభిరామ్ ఆదేశాలతో శిష్యుడు చంద్రశేఖర్ ఈ హత్యాయత్నానికి పాల్పడ్డట్టు బహిర్గతమైంది. వాస్తవం ఇలా ఉంటే తెలుగు తమ్ముళ్లు రాజకీయాలు ఆపాదించి ప్రభుత్వం, మంత్రి దాడిశెట్టి రాజాపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. తీరా పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగుచూడటంతో టీడీపీ నేతల ఆరోపణలు ఏపాటివో తేలిపోయింది. 2019లో తునిలో కాతా సత్యనారాయణ హత్యోదంతానికి ఇలానే అప్పటి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాయే కారణమంటూ ఫిర్యాదు చేసి రాజకీయ లబ్ధిపొందాలనుకున్న టీడీపీ నేతలు భంగపడ్డారు. భూ తగాదాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చడంతో ఆ పార్టీ నేతలు చివరకు అభాసుపాలయ్యారు. ఇప్పటికీ మరువలేని ఘాతుకాలు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు తునిలో సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. రామకృష్ణుడు మంత్రిగా ఉన్న సమయంలో తెలుగు తమ్ముళ్లు సాగించిన దాడులకు లెక్కే లేదు. కొన్ని హత్యోదంతాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఆస్తి తగాదాలు, సరిహద్దు వివాదాలు, కోర్టు లిటిగేషన్లు, ప్రేమ వ్యవహారాలు, భూకబ్జాలు.. ఇలా వివాదం ఏదైనా నాటి పాలకులే తీర్పులిచ్చేవారు. మాట వినకుంటే దౌర్జన్యమేనని తుని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చదవండి: (Kurnool, Nandyal: టీడీపీలో రగులుతున్న అసమ్మతి మంటలు) రాజకీయ కక్షతోనే తాతయ్యను చంపేశారు గతం నుంచి రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం మాది. ఏ సమస్య వచ్చినా మా ఇంటి వద్దకు వచ్చేవారు. ఒక భూ వివాదంలో అప్పట్లో తాతయ్య మేడపురెడ్డి చంద్రయ్యనాయుడు గ్రామ పెద్దగా తగవు పరిష్కరించాలని చూసినా రాజకీయాల కారణంగా సాధ్యం కాలేదు. కోర్టులో ఆ భూ సమస్యపై నేరం రుజువైన వర్గంతో కలిసి అప్పట్లో అధికారంలో ఉన్న నేతలు తాతయ్య రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకపోయారు. 1996లో తుని కోర్టు సమీపాన మా తాతయ్యను దారుణంగా హత్య చేశారు. మా నాన్న శివగిరి, అమ్మ వెంకట రమణమ్మ సర్పంచ్‌గా పని చేశారు. అమ్మ వెంకట రమణమ్మ ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యురాలు. టీడీపీలో నాటి నేతల దౌర్జన్యాలు చూస్తూ ఉండలేక మా కుటుంబం ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేసింది. – మేడపురెడ్డి భానుచంద్ర, ఎన్ఎన్ పట్నం, రౌతులపూడి నాన్నను చంపేసి, నన్ను అవిటివాడిని చేశారు మా నాన్న అన్నంరెడ్డి తాతయ్యనాయుడు టీడీపీ నాయకుడు. తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పని చేశారు. 1998లో తుని నుంచి కేఓ మల్లవరం బస్సులో వస్తుండగా టీడీపీ నాయకులు కిరాతకంగా కత్తులతో నరికి చంపేశారు. ఈ కేసులో 10 మందికి జీవితఖైదు పడింది. ఆ తరువాత 2004లో కక్ష కట్టి టీడీపీ నేతలు నాపై దాడి చేసి కాలు నరికేశారు. నిందితులకు ఐదేళ్ల జైలుశిక్ష పడినప్పటికీ అప్పీల్‌కు వెళ్లడంతో శిక్ష వాయిదా పడింది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో వికలాంగ పింఛను ఇస్తే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో కక్ష కట్టి దాన్ని కూడా రద్దు చేశారు. కోర్టుకు వెళితే జన్మభూమి కమిటీ ముందు హాజరవ్వాలన్నారు. హాజరైతే చీడికమ్మతల్లి డిబ్బీని చోరీ చేసినట్టు తప్పుడు కేసుతో వేధించారు. ఇలా మా కుటుంబ సేవలను ఉపయోగించుకుని కూడా నన్ను అవిటివాడిని చేశారు. – అన్నంరెడ్డి శ్రీనివాసరావు, కేఓ మల్లవరం, తుని మండలం ►16 ఏళ్ల క్రితం తెలుగు తమ్ముళ్లు శృంగవృక్షంలో సొంత సామాజిక వర్గానికి చెందిన దూలం రత్నంపై పెట్రోలు పోసి నిప్పటించారు. రత్నంతో పాటు పక్కనే నిద్రలో ఉన్న బాలిక సజీవ దహనమైన సంఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ►కాంగ్రెస్ మద్దతుదారుడు గోపాలపట్నం మాజీ సర్పంచ్ అచ్చా గోవిందరావు కుమారుడు వెంకట కృష్ణ హత్యోదంతం వెనుక అక్కడి టీడీపీ నేత హస్తం ఉందన్న విషయం పెనుదుమారమే లేపింది. అధికారంలో ఉండటంతో వారి ఆగడాలకు భయపడి బాధిత కుటుంబం మిన్నకుండిపోయింది. ►గోర్సపాలెంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమ వ్యవహారంలో అంతమయ్యాడు. కాకినాడలో హత్య చేయించి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ వ్యవహారంలో బాధిత వర్గాన్ని టీడీపీ నేతలు బెదిరించారనే అభియోగాలున్నాయి. చివరకు యనమల స్వగ్రామం ఏవీ నగరంలో టీడీపీ నేతలే బలవంతంగా రాజీ చేశారు. ►తుని ఆచారి స్టూడియో అధినేత ఆస్తుల వ్యవహారంలో టీడీపీ నేతలు తలదూర్చి అంతమొందించారు. చివరకు కొత్తపల్లిలో ఉన్న భూములను దౌర్జన్యంగా స్వా«దీనం చేసుకుని గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. ►పాలమాన్పేటలో మత్స్యకారుల ఇళ్లపై సామూహిక దాడి అప్పట్లో యనమల సోదరుల ప్రేరేపణతోనే జరిగిందనే ఆరోపణలున్నాయి. తమకు ఎదురు తిరుగుతున్నాడని మత్స్యకార నాయకుడు అప్పలరాజును అక్రమంగా కేసుల్లో ఇరికించారు. టీడీపీ దాడుల్లో ఒక వృద్ధుడు అనుమానాస్పదంగా మృతి చెందితే ఇతనిపై కేసు బనాయించారు. నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డికి అప్పలరాజు కుమార్తె మోసా అనిత విషయాన్ని వివరిస్తూ కన్నీటిపర్యంతమైంది. -
ఎద్దు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియట్లేదు
-
యువత ఆవేశాన్ని సొమ్ము చేసుకుంటున్న పవన్
సాక్షి ప్రతినిధి కాకినాడ: యువత ఆవేశాన్ని ప్యాకేజీలతో సొమ్ము చేసుకుంటూ రాష్ట్రంలో అశాంతికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. కాపులను మూడోసారి మోసం చేసి చంద్రబాబుకు గంపగుత్తగా అమ్మేందుకు సిద్ధంగా ఉన్న పవన్ నిజస్వరూపాన్ని కాపు అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు గుర్తించాలని, ఆయనకు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు. మంత్రి సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ మాటలు విని ఒక్క కాపు కులస్తుడైనా చంద్రబాబుకు సహకరిస్తే రంగా ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. రంగా హత్యలో ప్రధాన ముద్దాయి చంద్రబాబేనని, కాదని బాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. రంగా హత్య జరిగినప్పుడు అనేక మంది కాపులపై కేసులు పెట్టి, సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. నాడు ముద్రగడ పద్మనాభంను పలకరించడానికి దాసరి, చిరంజీవి వస్తే చంద్రబాబు ఆదేశాలతో ఎయిర్‌పోర్టులో ఆపేశారని తెలిపారు. అందుకు భిన్నంగా నేడు పవన్ కల్యాణ్‌ను పూర్తి భద్రతతో నేరుగా హోటల్లో దింపారని చెప్పారు. అదే చంద్రబాబుకు, వైఎస్ జగన్‌కు తేడా అని అన్నారు. ఆకలి కేకలతో కోనసీమ మహిళలు రోడ్డెక్కితే చంద్రబాబు కేసులు పెట్టి వేధించిన విషయం మరచిపోవద్దన్నారు. వారిపై అన్యాయంగా చంద్రబాబు పెట్టిన కేసులను జగన్ సీఎం అయ్యాక మానవతా దృక్పథంతో ఎత్తేశారని తెలిపారు. గవర్నర్ వద్దకు వెళ్లి పవన్ ఏమి చెబుతారని నిలదీశారు. ‘సీఎం జగన్ సంక్షేమ పాలనతో చంద్రబాబుకు దిక్కు లేకుండా పోయింది. నీవే బాబు చేతిలో పావుగా మారి రాష్ట్రంలో అశాంతికి కారణమవుతావని, బ్రోకర్లకు అమరావతి రాజధాని కావాలని చెబుతావా..’ అని నిలదీశారు. విశాఖ గర్జనలో కోట్లాది ప్రజల ఆకాంక్ష ప్రస్ఫుటమైందని అన్నారు. లక్షలాది ప్రజలు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చి వికేంద్రీకరణకు మద్దతిచ్చారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ కూడా అమరావతిలో శాసన రాజధాని ఉండాలని కోరుకుంటున్నారని తెలుసుకోవాలన్నారు. -
ఎంతో మందిని హింసించిన చరిత్ర మీది
తుని: అధికారంలో ఉన్న సమయంలో ఎంతో మంది నాయకులు, మహిళలను హింసించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తాము ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. శుక్రవారం కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో అదృçష్టంగా వచ్చిన పదవిని ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్న నీచ చరిత్ర యనమలదని చెప్పారు. ఆయన, ఆయన తమ్ముడు ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారని అన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో డిస్కంలకు రూ.80 వేల కోట్లు బకాయిలు పెట్టిన ఘన చరిత్ర యనమలదని చెప్పారు. తుని నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని యనమలకు సవాల్ విసిరారు. యనమల సొంత గ్రామంలో పాఠశాల, రోడ్లు నిర్మించలేక పోయారని, ఆ అవకాశం తనకు దక్కిందని చెప్పారు. యనమల గ్రాఫ్ పడిపోతోందని, వచ్చే ఎన్నికల్లోనూ తాను 30 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని రాజా అన్నారు. టీడీపీ హయాంలో వైఎస్సార్సీపీకి చెందిన 2,800 మంది పింఛన్లు తొలగించగా, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న తాను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించానన్నారు. ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి రాజా చెప్పారు. తుని నియోజకవర్గంలో 109 నీటి రిజర్వాయర్లు కట్టిస్తున్నామని, త్వరలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇస్తామని అన్నారు. యనమల ఏరియా ఆసుపత్రిని ఆదాయ వనరుగా మార్చుకుని, రోజుకు లక్ష రూపాయలు దండుకున్నారని ఆయన వివరించారు. -
‘అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా?’
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాగర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ ఉత్తరాంధ్ర యాత్ర. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్లపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. బాగున్న రోడ్లకు గుంతలు పెట్టి డ్రామా చేస్తున్నారు. రాష్ట్రంలో రోడ్లను బాగు చేసేందుకు చర్యలు చేపట్టాము. రోడ్లు వేయడం అనేది నిరంతర ప్రక్రియ. వర్షాకాలం తగ్గిన వెంటనే రోడ్లు వేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రోడ్ల మరమ్మతుల కోసం సీఎం వైఎస్ జగన్ రూ. 1500 కోట్లు కేటాయించారు. 2023 కల్లా రాష్ట్రంలో రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేశారు. -
వికేంద్రీకరణకే జై
సాక్షి ప్రతినిధి, కాకినాడ/ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్ర భవిష్యత్తు బంగారు బాట పట్టాలంటే మూడు రాజధానులతో కూడిన వికేంద్రీకరణతోనే సాధ్యమవుతుందని పలువురు మేధావులు జైకొట్టారు. స్వాతంత్య్రానంతరం నాలుగుసార్లు రాజధాని మార్పుతో జరిగిన నష్టాన్ని గుర్తించి యువత పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అధికారం అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనకు సంఘటితంగా మద్దతు తెలపాలని వక్తలంతా అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఉద్యమ స్ఫూర్తితో యువత, విద్యావంతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వికేంద్రీకరణపై కాకినాడలో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎంఏ, ప్రొఫెసర్లు, వైద్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థి, వ్యాపార, వాణిజ్య, జర్నలిస్టు, రవాణా, ప్రజా సంఘాలు, వైఎస్సార్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులతోపాటు 52 అసోసియేషన్ల నుంచి పెద్దఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రాజనీతి శాస్త్రజ్ఞుడు ప్రొ. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అభివృద్ధిని కాంక్షించే ప్రపంచమంతా వికేంద్రీకరణ వైపు అడుగులేస్తున్న వైపే మనం కూడా అడుగులు వేయాలన్నారు. చాలా దేశాల్లో పరిపాలన అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ఉండటాన్ని మనం ఆకళింపుచేసుకోవాలన్నారు. ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధి బాదం సుందరరావు మాట్లాడుతూ.. వికేంద్రీకరణతో అధికారులు అటూఇటూ తిరగాల్సి రావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందనేది ఒట్టి మాటన్నారు. తానే రాజు.. తానెక్కడ ఉంటే అక్కడే రాజధాని ఉండాలనుకోవడం సరికాదని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చిరంజీవినీకుమారి అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధిలో సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. బాబు ఒక్కటైనా శాశ్వత కట్టడం కట్టారా? కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక్కటైనా శాశ్వత భవనం నిర్మించారా అని ప్రశ్నించారు. 23 గ్రామాల ప్రజలు అమరావతే రాజధాని అంటూ పాదయాత్ర చేసి.. మిగిలిన రాష్ట్రమంతా కలిసి వికేంద్రీకరణ కోసం పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు చిట్లా కిరణ్, వాడ్రేవు రవి, ఎస్‌సీహెచ్‌ఎస్ రామకృష్ణ, ఈషా ఫౌండేషన్ కృష్ణప్రియ మాట్లాడుతూ.. వ్యవస్థలు కేంద్రీకృతమైతే జరిగే నష్టాన్ని గుర్తించి సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో ప్రతిపాదిస్తున్న వికేంద్రీకరణకే ఓటేయాలన్నారు. ఇక వికేంద్రీకరణ కోసం మేధావులు మౌనం వీడి ప్రజల తరఫున గళం వినిపించాలని యునైటెడ్ ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్ అధ్యక్షుడు బయ్యా రాజేంద్రకుమార్, మైనార్టీ ప్రతినిధి సయ్యద్ సాలార్ పిలుపునిచ్చారు. టీడీపీ, ఎల్లో మీడియా కుట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణు, దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ది చెందకూడదని చంద్రబాబు, ఎల్లోమీడియా కుట్ర పన్నుతున్నాయన్నారు. మేధావులంతా కలిసి ఐక్య కార్యచరణకు సిద్ధంకావాలన్నారు. చంద్రబాబు చెప్పినట్లు రూ.5 లక్షల కోట్లు ఖర్చుచేసినా అమరావతి నిర్మాణం సాధ్యంకాదన్నారు. ఇక ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వంగా గీత స్పందిస్తూ.. భవిష్యత్తులో రాష్ట్రం ఐక్యంగా ఉండాలంటే వికేంద్రీకరణ అనివార్యమన్నారు. సీఎం తలపెట్టిన మూడు రాజధానుల కోసం ప్రతిఒక్కరూ ముందుకు రావాలని మాజీమంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు అన్నారు. మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే పెండెం దొరబాబు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, షర్మిలారెడ్డి వివిధ రంగాల ప్రతినిధులూ పాల్గొన్నారు. వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర ప్రగతి మరోవైపు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో జరిగిన చర్చావేదికలో కూడా 26 జిల్లాలూ సమాన ప్రగతి సాధించాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరని ఉత్తరాంధ్ర మేధావుల ఫోరం అభిప్రాయపడింది. వికేంద్రీకరణ జరగకపోతే భవిష్యత్తులో కళింగాంధ్ర, సీమాంధ్ర ఉద్యమాలు తప్పదని వక్తలు హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం దూరదృష్టితో, మేధావుల సూచనలతో మూడు రాజధానుల నిర్ణయానికి వచ్చిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రొ.బిడ్డిక అడ్డయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ సమాన అభివృద్ధి సాధించాలన్నారు. ఏయూ విశ్రాంత ప్రొఫెసర్ కె. తిమ్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆలోచనలకు అందరి మద్దతు అవసరమన్నారు. ఇక ఉత్తరాంధ్ర వెనుకబాటుకు శాశ్వత పరిష్కారం విశాఖపట్నం పరిపాలనా రాజధానేనని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం సభ్యుడు అట్టాడ అప్పలనాయుడు, న్యాయవాది బైరి దామోదరరావు అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలను గౌరవించి మూడు రాజధానులకు మద్దతివ్వాలని ఏయూ విశ్రాంత ప్రొఫెసర్ కెంబూరు చంద్రమౌళి, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు అన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని అరసవల్లికి రావటం నిజంగా హాస్యాస్పదమని.. ఉద్యమాలకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా అని.. వీర గుణ్ణమ్మ స్ఫూర్తితో జిల్లాలో ఉద్యమం సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరై మాట్లాడారు. -
సంబరంలా వైఎస్సార్ చేయూత
సాక్షి నెట్వర్క్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత పథకం కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా సంబరంగా జరుగుతున్నాయి. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంత్రులు ఈ పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలకు మహిళలు వెల్లువలా తరలి వచ్చారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడులో జరిగిన సభలో డిప్యూటీ సీఎం, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి.వి.సత్యవతితో కలిసి 4,885 మందికి రూ.9.15 కోట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల మహిళలకు సొంత సోదరునిలా మేలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. కాకినాడ జిల్లా ఎస్.అన్నవరం వద్ద జరిగిన కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీతతో కలిసి మంత్రి దాడిశెట్టి రాజా రూ.9.89 కోట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల గుండెల్లో సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ సుస్థిరంగా ఉండిపోతారని మంత్రి రాజా చెప్పారు. అభివృద్ధి అంటే చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, ఎల్లో మీడియా బాగు పడడం కాదని, రాష్ట్రంలో ప్రజలందరూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడమని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన వైఎస్సార్ చేయూత సంబరాల సభలో వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ 13,989 మంది లబ్ధిదారులకు రూ.25.28 కోట్లు అందజేశారు. సీఎం జగన్ మూడు రాజధానులతో రాష్ట్రమంతా సమాంతర అభివృద్ధిని కాంక్షిస్తుంటే.. చంద్రబాబు మాత్రం అమరావతే రాజధాని అంటూ తన కులం, కుటుంబీకులు, బంధువుల లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని మంత్రి రమేష్ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడులో జరిగిన సభలో మంత్రి ఆర్కే రోజా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన 11,530 మందికి రూ.21.69 కోట్లు పంపిణీ చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచేది లేదని, జగనన్న తగ్గేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి రోజాను ఘనంగా సత్కరించారు. -
చంద్రబాబుకి కుప్పంలోనే దిక్కులేదు
తొండంగి: దీర్ఘకాలంగా ఓట్లేసి గెలిపించి రాష్ట్రస్థాయి పదవులను అనుభవించేందుకు అవకాశం ఇచ్చిన కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకోని చంద్రబాబుకు అక్కడే దిక్కులేదని, రాబోయే రోజుల్లో టీడీపీకి అడ్రస్ కూడా ఉండదని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్లపురం పంచా యతీలోని కొత్తచోడిపల్లిపేటలో గురువారం జరిగిన మత్స్యకారుల ఆత్మీయసదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కుప్పం ప్రజల్ని వాడు కుని వదిలేశారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను సమానంగా చూస్తూనే కుప్పం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయడంతో అక్కడ ఇప్పుడు చంద్రబాబుకే దిక్కులేదని చెప్పారు. రాష్ట్రంలో 87 శాతం మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మత్స్యకారులకు మత్స్యకార భరోసా ద్వారా రూ.పదివేలు, స్మార్ట్‌కార్డుల ద్వారా డీజిల్ లీటరుకు రూ.9 తక్షణ రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. కోన ప్రాంత మత్స్యకారులకు ఎటువంటి కష్టం రాకుండా తాను అండగా ఉంటానన్నారు. మినీ పోర్టు, బల్క్‌డ్రగ్ పార్క్‌లతో కోన ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధి కారణంగా హేచరీలకు, మత్స్యకారుల జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది కలగనీయబోమని సీఎం ఇప్పటికే హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది మత్స్యకారులు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పారు. ఈ సదస్సులో జెడ్పీ వైస్ చైర్మన్ మేరుగు పద్మలతాహరి, తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొయ్యా మురళి, మత్స్యకార విభాగం తుని నియోజకవర్గ కన్వీనర్ మేరుగు ఆనందహరి, వైస్ ఎంపీపీ నాగం గంగబాబు, యు.కొత్తపల్లి మండలం ఎంపీపీ కారే శ్రీనివాసరావు, ఏలేరు రిజర్వాయర్ చైర్మన్ తోలాడ శైలాపార్వతి, పార్టీ నాయకులు గాబు రాజు, గంగిరి అడివియ్య, బద్ది నూకరాజు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలను రోడ్డుకు ఈడిస్తే.. లోకేశ్ నాలుక చీరేస్తాం
కోటనందూరు: గౌరవంగా ఇంట్లో ఉండే మహిళలను రోడ్డుకు ఈడిస్తే లోకేశ్ నాలుక చీరేస్తామని మంత్రి దాడిశెట్టి రాజా హెచ్చరించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో మంగళవారం వైఎస్సార్ చేయూత మూడోవిడత చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలందరూ సీఎం జగన్‌ను అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా భావిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలంతా ఎవరి ఇంట్లో వారు సంతోషంగా ఉండాలని సీఎం కోరుకుంటున్నారన్నారు. అలాంటి ఈ రాష్ట్రంలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఐటీడీపీ బృందం అవాకులు, చెవాకులు మాట్లాడుతోందని చెప్పారు. సోషల్ మీడియాలో సైతం రకరకాల తప్పుడు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. వారి తాబేదార్లయిన ఎల్లో మీడియాలో రోజూ కథనాలు వండి వారుస్తున్నారని చెప్పారు. విషప్రచారం చేయడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఉండే ఆడవాళ్లను రోడ్డుమీదకు లాగి రాజకీయం చేసే సంస్కృతి మన రాష్ట్రంలో ఇప్పటివరకు లేదన్నారు. ఇటువంటి పద్ధతిని రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టొద్దని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు ఇంట్లో కూడా మహిళలున్నారని, కావాలనుకుంటే వారిమీద తాము కూడా అవాకులు, చెవాకులు మాట్లాడగలమని, తప్పుడు ప్రచారం చేయగలమని, కానీ.. అది తమ సంస్కృతి కాదని చెప్పారు. చంద్రబాబు తన కుమారుడికి సభ్యత, సంస్కారం నేరి్పంచి అదుపులో ఉంచుకోవాలని సూచించారు. సీఎం సతీమణి వైఎస్ భారతమ్మ మీదే కాకుండా రాష్ట్రంలో ఏ అక్కచెల్లెమ్మ జోలికొచి్చనా నీ కొడుకు నాలుక చీరేస్తామని ఆయన చంద్రబాబును హెచ్చరించారు. -
పాదయాత్ర పేరుతో వంకర రాజకీయం
కోటనందూరు: అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో మాజీ సీఎం చంద్రబాబు వంకర రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బిళ్లనందూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేయడానికే రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులతో చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ముసుగులో పాదయాత్ర చేయించే బదులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ యాత్ర చేయొచ్చు కదా..? అని ప్రశ్నించారు. తండ్రీకొడుకులు పాదయాత్ర చేస్తే ప్రజలు చెప్పులతో కొట్టే పరిస్థితి ఉంది కాబ ట్టి దొడ్డిదారిలో ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు. చంద్రబాబు పాదయాత్రగా విశాఖ వచ్చి అక్కడ పరిపాలన రాజధాని వద్దని చెప్పగలరా? అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని అనేది ఒక పెద్ద స్కామ్ అని మంత్రి ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజల్లో తిరిగే ధైర్యం లేదు కాబట్టే రైతులను రెచ్చగొట్టి పాదయాత్ర చేయిస్తున్నారన్నారు. చంద్రబాబు చేయించే యాత్ర అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాదని, అది కేవలం ఒక కులం అభివృద్ధి కోసం చేసే పాదయాత్ర మాత్రమేనని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు ఉంటే అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు. -
బల్క్‌డ్రగ్ పార్కుపై దుష్టచతుష్టయం కుట్ర
తుని: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి సాధించిన బల్క్ డ్రగ్ పార్కును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు, దుష్టచతుష్టయం కుట్ర పన్నుతున్నాయని, అందులో భాగంగానే రకరకాల లేఖలు రాస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు అండ్ కో.. పని చేస్తోందని దుయ్యబట్టారు. ఆయన శనివారం తునిలో విలేకరులతో మాట్లాడారు. పెరుమాళ్లపురం–కోదాడ మధ్య బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు విషయంలో సీఎం జగన్మోహన్రెడ్డి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారని చెప్పారు. మత్స్యకారులకు, హేచరీలకు ఇబ్బంది లేకుండా ఉన్నతస్థాయిలో పరిశీలన, పరీక్షలు చేశారని, కలుషిత నీటిని శుద్ధి చేసి 53 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో వదిలే ఏర్పాట్లు చేశారని వివరించారు. కోనసీమలో అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు అందరూ సీఎంను అభినందిస్తున్నారని చెప్పారు. విపక్షాలు, దుష్టచతుష్టయం మాత్రం కాలుష్యమంటూ దీనిని అడ్డుకొంటున్నారని అన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో టీడీపీ ప్రభుత్వం దివీస్ మందుల పరిశ్రమకు అనుమతులు ఇచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా... అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును ప్రశ్నించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ మార్కెట్, మట్కా, పేకాట, వైట్‌కాలర్ మోసగాళ్లు ఏ మేర ప్రజలను మోసం చేశారో.. దుష్టచతుష్టయమైన చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి అంతకు మించి ప్రజల సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఒకరు కిరసనాయిల్, మరొకరు పచ్చళ్లు, ఇంకొకరు హెయిర్ ఆయిల్ వ్యాపారం పేరుతో లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకున్నారన్నారు. దుష్టచతుష్టయం బారి నుంచి కేసీఆర్ తెలంగాణను రక్షించుకున్నారని, ఇప్పుడు మన రాష్ట్రంపై హైదరాబాద్‌లో ఉండి బురద జల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మాత్రమే సీఎంగా ఉండాలన్నది వీరి కుటిల నీతి అని అన్నారు. కరోనా తర్వాత దేశంలో అత్యధిక జీడీపీ సాధించిన రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందని మంత్రి గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, అయితే అదంతా తానే చేశానని చంద్రబాబు అనడం.. దానిని ఎల్లో మీడియా వండి వార్చడం పరిపాటిగా మారిందన్నారు. ప్రజల ముందుకు వచ్చి యాత్ర చేస్తే గుణపాఠం చెబుతారని చెప్పారు. అమరావతి 26 గ్రామాలకే సంపదను కట్టబెట్టి, మిగిలిన రాష్ట్రంలోని ప్రజలను బిచ్చగాళ్లను చేయాలని చూశారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. -
గడప గడపకు మంత్రి దాడిశెట్టి రాజా
-
పవన్ తనకు తాను పెద్ద పుడింగి అనుకుంటున్నాడు
-
ఇలాంటోళ్లు ఎందరొచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు: మంత్రి దాడిశెట్టి రాజా
-
నాదెండ్ల, నారా, పవన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి రాజా
సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని అన్నారు. ఈ మేరకు మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ని నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు జగన్‌ని వెన్నుపోటు పొడవాలని నారా, పవన్, నాదెండ్ల మనోహర్‌లు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా జగన్‌ని ఏమీ చేయలేరని అన్నారు. 'చిరంజీవి, జగన్ ఎంత ప్రేమ, ఆప్యాయతతో ఉంటారో నాకు తెలుసు. వైఎస్సార్సీపీ నుండి మేము అడుగుతున్నాం. చంద్రబాబు చెబితే తప్ప ఎన్ని సీట్లలో పోటీ చేస్తావో కూడా చెప్పలేవు. అన్ని సీట్లలో పోటీ చేసే దమ్ము లేదు. రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచారు. 40కి పైగా పథకాలని ఆపాలని ఇప్పుడు పవన్ కోరుకుంటున్నారంటూ' మంత్రి దాడిశెట్టి రాజా చెప్పుకొచ్చారు. చదవండి: (డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. రేవంత్‌కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి) పవన్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు అయితే పవన్ తనకు తాను పెద్ద పుడింగి అనుకుంటున్నాడని మండిపడ్డారు. ఆయనే పెద్ద పుడింగి అయితే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌ని ఎందుకు కలుస్తాడని ప్రశించారు. పవన్ కల్యాణ్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో మాట్లాడి నిజాలు నిగ్గుతేల్చు కాపులకు ఆరాధ్య దైవం అయిన వంగవీటి రంగా హత్య కేసుతో టీడీపీకి సంబంధం లేదని పవన్ నిరూపించాలని కోరారు. ఆ కేసు గురించి కేంద్రంతో మాట్లాడి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. కాపు నేతల్ని, మహిళలను పోలీసులతో కొట్టించినపుడు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. కాపులకు ఇంత అన్యాయం చేసిన చంద్రబాబుని ముందు ప్రశ్నించాలని' పవన్ కల్యాణ్‌కు మంత్రి దాడిశెట్టి రాజా సూచించారు. -
‘పవన్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయింది’
సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ, పవన్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయ్యిందని దుయ్యబట్టారు. బీజేపీతో సంసారం.. చంద్రబాబుతో శృంగారం. ఇదీ పవన్ పార్టీ పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. ‘‘జనసేన కాదు.. అది ‘నారా-నాదెండ్ల’ సేన. రాజకీయం అంటే సొంత కల్యాణం కాదు.. లోక కల్యాణం. పవన్‌కు ఉన్నది బాబు.. కావాల్సింది ప్యాకేజీ.’’ అంటూ నిప్పులు చెరిగారు. చదవండి: ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: మాజీ ఎంపీ ఉండవల్లి ‘‘మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ ఉండగా పవన్‌కు వేరే ఆఫీసు ఎందుకు?. రాజకీయ కరువు బాధితుడు పవన్‌కు స్పెషల్ ప్యాకేజీలు అందాయి. టీడీపీ హయాంలో దుష్టచతుష్టయం, పవన్ కడుపు నిండింది. జనం కడుపు ఎండింది. 2019లో అన్ని చోట్లా గుండు గీశారు కాబట్టే జుట్టు పెంచుతున్నాడు. ప్రతి నమస్కారంతో పాటు ప్రతి ఒక్కరికి మంచి చేసే సంస్కారం జగన్‌కే సొంతం’’ అన్నారు. -
రాజకీయం అంటే సొంత కల్యాణం కాదు.. లోకకల్యాణం
-
'జనాన్ని జనసేన వైపు చూడమంటాడు.. ఈయనేమో టీడీపీని చూస్తాడు'
సాక్షి, కాకినాడ: చంద్రబాబుకు కష్టం వచ్చినపుడు కొమ్ము కాసేందుకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడని రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. జనాన్ని జనసేన వైపు చూడమంటాడు.. ఈయనేమో టీడీపీ వైపు చూస్తాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు కాకినాడలో మంత్రి రాజా మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న ఏపీలో అలజడులు సృష్టించేందుకే పవన్, చంద్రబాబు, లోకేష్‌లు ఏపీకి వస్తున్నారు. ఎమ్మెల్యే కూడా కాలేని పవన్ సీఎం జగన్‌పై చాలా ఛాలెంజ్‌లు చేశారు. కాపులు ఎవరూ కూడా పవన్‌ని నమ్మే స్థితిలో లేరు. పవన్‌కి ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లే అని కాపులకు తెలుసు. తుని ఘటనలో కాపులను అనేక చిత్ర హింసలను గురిచేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి మళ్లీ కాపులను తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లా సీఎం జగన్‌కు కుల మతాలతో రాజకీయాలు చేసే అలవాటు లేదు. జనసేన పార్టీని ఎందుకు నమ్మాలో చెప్పలేని దిక్కుమాలిన స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారంటూ మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (వామ్మో 'బాబు' ఆణిముత్యాలు వింటే షాక్ అవ్వాల్సిందే..) -
వరదల్లో క్షుద్ర రాజకీయాలా?
సాక్షి, అమరావతి: ‘పిచ్చిమాటలు, చేష్టలు, విమర్శలతో పవన్‌కల్యాణ్ జోకర్‌ను తలపిస్తున్నారు. జనసేన కాదది జోకర్‌సేన. ఆపార్టీకి ఒక సిద్ధాంతంగానీ రూపురేఖలుగానీ లేవు..’ అంటూ రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా (రామలింగేశ్వరరావు) విమర్శించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి వరద బాధితులకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయ, సహకారాలు అందిస్తుంటే.. మండపేట, భీమవరం వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మాత్రం క్షుద్ర రాజకీయాలు చేయడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాజకీయం చేస్తే.. శని, ఆదివారాల్లో వారికి కాల్షీట్లు అమ్ముకున్న పవన్‌కల్యాణ్ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పార్ట్నర్ అయిన పవన్‌కల్యాణ్ అప్పట్లో రహదారులు గురించి నోరుమెదపలేదని గుర్తుచేశారు. ఒక రహదారిని నిర్మిస్తే దాని కాలపరిమితి ఎనిమిదేళ్లు ఉంటుందన్నారు. టీడీపీ సర్కార్ హయాంలో రహదారుల కోసం అప్పుతెచ్చిన నిధులను చంద్రబాబు దారిమళ్లిస్తే.. ప్రశ్నించకుండా నోట్లో వేలు పెట్టుకున్నావా? అని పవన్‌కల్యాణ్‌ను నిలదీశారు. అప్పట్లో గుంతలమయంగా మారిన రోడ్లను హ్యాష్‌టాగ్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ సర్కార్ హయాంలో శిథిలమైన రహదారులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా భారీవర్షాలు కురవడంతో మరింత దెబ్బతిన్నాయన్నారు. వాటిని అభివృద్ధి చేయడం కోసం రూ.2,205 కోట్లతో మొదటిదశలో చేపట్టిన పనులు 60 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఇవేవీ కనిపించలేదా? అని పవన్‌కల్యాణ్‌ను నిలదీశారు. వర్షాలు తగ్గగానే ఆగస్టులోగా మిగతా 40 శాతం పనులు పూర్తిచేస్తామన్నారు. రోడ్ల మీద నడిచే ప్రతి ఆవారాగాడు.. పవన్‌కల్యాణ్, లోకేశ్ వంటి వారు మహానుభావులు కాలేరని ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలా జనంతో మమేకమవుతూ, భవిష్యత్‌పై వారికి భరోసా కల్పించేలా సాంత్వన చేకూరిస్తేనే మహానుభావులు అవుతారని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు చొక్కా పట్టుకుంటేనేగానీ కిందకు దిగిరారని పవన్‌కల్యాణ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 2019 ఎన్నికల్లో భీమవరంలోగానీ, గాజువాకలోగానీ ప్రజలు నీ జుట్టు పట్టుకున్నారా? చొక్కా పట్టుకున్నారా? స్పష్టత ఇస్తే బాగుంటుందని సూచించారు. కామపిశాచికి ఆప్యాయతలు తెలియవు పాదయాత్రలో వృద్ధులు, చిన్నపిల్లలకు సాంత్వన చేకూరుస్తూ.. భవితపై భరోసా ఇస్తూ సీఎం వైఎస్ జగన్ వారిపై ఆప్యాయత, అనురాగం చూపారని మంత్రి దాడిశెట్టి రాజా గుర్తుచేశారు. కానీ.. కామపిశాచి పవన్‌కల్యాణ్‌కు ఆ ఆప్యాయతలు, అనురాగాలు తెలియవంటూ మండిపడ్డారు. ‘నువ్వో కామíపిశాచివి. నీ ఆలోచనలన్నీ కామంతోనే ఉంటాయి. నీలాంటి నీచుల కంట పడకుండా రాష్ట్రంలో ఆడపిల్లలున్న తల్లిదండ్రులు జాగ్రత్త పడుతున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు. పవన్‌కల్యాణ్.. తన బాస్ చంద్రబాబును సీఎంను చేయాలనే తాపత్రయంతో పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో కులాలు, మతాల గురించి పవన్‌కల్యాణ్‌లా మాట్లాడేవారు మరొకరు ఉండరన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను 2024 ఎన్నికలోనూ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పవన్‌కల్యాణ్‌ను, ఆయనకు ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబును మరోసారి తరిమికొట్టడానికి ప్రజలు తహతహలాడుతున్నారని మంత్రి చెప్పారు. -
ముమ్మరంగా రహదారుల పనులు
తుని: రాష్ట్రంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, పారదర్శక విధానాలతో రహదారుల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతుంటే ఓ వర్గం మీడియా పని గట్టుకొని పాత ఫొటోలు చూపించి దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. శనివారం కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో ఆయన ఆర్అండ్బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రహదారులు దెబ్బ తిన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► ఓ వర్గం మీడియా పని గట్టుకొని పాత ఫొటోలు చూపించి దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబు చర్యలతో పాడైన ఒక్కో వ్యవస్థను కచ్చితమైన ప్రణాళికతో సరిదిద్దుతున్నాం. ► రాష్ట్రంలో సీఎం జగన్ పాలనకు మెచ్చి.. కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితన్ గడ్కరీ ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని జాతీయ రహదారుల ప్రాజెక్టులను మన రాష్ట్రానికి మంజూరు చేశారు. ► 8,268 కిలోమీటర్ల మేర రాష్ట్ర హైవేలు, జిల్లా రహదారుల అభివృద్ధికి సంబంధించి 1,167 మేజర్ పనులు చేపట్టేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2,205 కోట్ల రుణం తీసుకున్నాం. ఇందులో 438 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నాం. ► పూర్తి చేసిన 2,756 కిలోమీటర్లు పనులకు రూ.700 కోట్ల మేర కాంట్రాక్టర్లకు చెల్లించాం. గత ప్రభుత్వ హయాంలో మంజూరై ఆగి పోయిన 233 పనులు చేపట్టేందుకు ఎన్ఐడిఏ పథకం కింద నాబార్డు రూ.1,558 కోట్లు రుణం ఇచ్చింది. వీటిలో 182 పనులు పూర్తి కాగా, 51 పనులు ఈ నెలఖారుకు పూర్తవుతాయి. ► 2021–22లో గుంతలు పూడ్చడానికి రూ.86 కోట్లు మంజూరు చేశాం. èఒకప్పుడు రహదారులు ఏలా ఉండేవి? ప్రస్తుతం అభివృద్ధి చేసిన రోడ్లు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు నాడు–నేడు ఫొటో ప్రదర్శన రాష్ట్రంలోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేశాం. -
నీకు సిగ్గుందా దత్త పుత్రుడా: మంత్రి దాడిశెట్టి రాజా
-
ప్రజలన్నా..వ్యవస్థలన్నా..చంద్రబాబుకు భయం లేదు
-
‘అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు, పవన్’
సాక్షి, విజయవాడ: కోనసీమ ఘటనపై లోతుగా విచారణ జరిపిస్తామని.. నిందితులెవరైనా వదిలేది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, కుట్రలు పన్నడం చంద్రబాబుకు అలవాటేనని.. పక్కా ప్లాన్ ప్రకారమే విధ్వంసం సృష్టించారన్నారు. పచ్చని కోనసీమలో చంద్రబాబు, పవన్ అలజడి సృష్టించారని దుయ్యబట్టారు. చదవండి: అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'! అంబేడ్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేయలేదా?. అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన దీక్షలు చేయలేదా? అని మంత్రి ప్రశ్నించారు. ‘‘ఆనాడు తుని ఘటనకు చంద్రబాబే కారణం. ఇప్పుడు ఈ ఘటనకు కూడా ఆయనే కారణం. ప్రజలన్నా.. వ్యవస్థలన్నా.. చంద్రబాబుకు భయం లేదు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేని చంద్రబాబే గొడవలు సృష్టించారన్నారు. నిరసన కారులు జై జనసేన అంటూ నినాదాలు చేశారు. అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు, పవన్ హస్తం ఉందని’’ మంత్రి దాడిశెట్టి మండిపడ్డారు. -
మీరెంతమంది కలిసొచ్చినా.. సీఎం జగన్ సింగిల్‌గానే: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: చంద్రబాబుతో కలిసిపోవడానికి జనసేన అధినేత తహతహలాడుతున్నాడంటూ పవన్ కల్యాణ్‌పై రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. తుని నియోజకవర్గంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 'ఇదంతా ఓ పథకం ప్రకారమే జరుగుతోంది. ముందు పవన్‌తో అనిపించి తర్వాత చంద్రబాబు పొత్తులపై రాగం అందుకున్నాడు. గతంలో టీడీపీతో పొత్తు ఉండదని చెప్పి పవన్ మర్చిపోయాడేమో..?. ఇప్పుడు చంద్రబాబు పిలుపు కోసం చూస్తున్నా అంటున్న పవన్‌కి సిగ్గుందా?. రాజకీయాల్లో పవన్‌కి సిద్ధాంతం అంటూ లేదు. పవన్, చంద్రబాబు కలిసి రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. ఇన్ని రాజకీయ పార్టీలతో పొత్తుల డ్రామాలు ఆడే ఏకైక పార్టీ జనసేన. మీరు ఎంతమంది కలిసినా జగన్ సింగిల్‌గానే ఉంటారు. ప్రజలు ఆయన వెంటే ఉన్నారు' అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. చదవండి: (అసాని తుపాన్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా మారిన వాతావరణం) -
జగన్ మానియాను చూసి పవన్‌కు మతిపోయింది
తుని: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనరంజక పాలనతో ప్రజల్లో అపరిమిత అభిమానాన్ని పొందారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో జనసేన కార్యకర్తలే జై జగన్ అంటూ ఇచ్చిన నినాదాలు ఇందుకు నిదర్శనమన్నారు. జగన్ మానియాను చూసి పవన్‌కు మతిపోయిందన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా ఉంటే పవన్ మాత్రం వారంతా కష్టపడుతున్నట్టుగా మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు కష్టాలు లేవని, పవన్‌కి, చంద్రబాబుకి మాత్రమే ఉన్నాయని అన్నారు. కష్టాల్లో ఉన్న చంద్రబాబు కన్నీళ్లు తుడవటానికి పవన్ బయటకు వస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలో అరాచకాలు, కష్టాలు పడ్డ రైతుల కన్నీళ్లు పవన్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దే«శంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారని, రైతు భరోసా ద్వారా నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తున్నారని, పవన్ ఈ విషయాన్ని గమనించలేదా అని అన్నారు. పవన్, చంద్రబాబుల్లో ఒకరిది అమ్మే సిద్ధాంతం, ఇంకొకరిది కొనే సిద్ధాంతమని చెప్పారు. ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క పార్టీ పెట్టి తనను నమ్ముకున్న వాళ్లను అమ్మడమే సిద్ధాంతంగా పెట్టుకున్న పవన్ మంచి రేటు కోసం తాపత్రయ పడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. చంద్రబాబును ప్రశ్నిస్తే అడ్వాన్స్ తిరిగి ఇవ్వమంటారోనని నోరు మెదపని పవన్‌కు సీఎం జగన్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. 2024లో మరోసారి పవన్ పార్టీని అద్దెకివ్వడానికి చంద్రబాబుతో మాట్లాడుకున్నారని చెప్పారు. ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ అయితే పీపుల్స్ స్టార్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. ఎంతమంది మల్లులు ఎన్ని విల్లులు విసిరినా ఇక్కడ ఉంది పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు కాదని, ఎన్నో పద్మ వ్యూహాలను ఛేదించిన జగన్మోహనుడని తెలిపారు. జగన్ పాలన చూసిన ప్రజలు సీఎంగా జగనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అనే విషయాన్ని మల్లులు, ఈ విల్లులు గుర్తుంచుకోవాలని తెలిపారు. -
జక్కంపూడి స్ఫూర్తితో ముందడుగు: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: దివంగత మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహనరావు రాజకీయ లక్షణాలను స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయంగా ఎదిగానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి సొంత నియోజకవర్గం తుని వెళ్తున్న ఆయనకు వేమగిరి నుంచి కంబాలచెరువు సెంటర్ వరకూ భారీగా మోటా ర్ సైకిళ్లు, కార్లతో ఘన స్వాగతం పలికారు. మంత్రి తొలుత బొమ్మూరులోని ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులురెడ్డి ఇంటికి చేరుకున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శ్రీనివాసులురెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఇటీవల మృతి చెందిన గొందేశి పూర్ణచంద్రారెడ్డి చిత్రపటానికి దాడిశెట్టి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ ఐఎల్టీడీ ఫ్లై ఓవర్, రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడ మంత్రి దాడిశెట్టి రాజాను రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఆ మహనీయునికి దాడిశెట్టి రాజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతల సహకారంతో ముందుకు తర్వాత స్టేడియం రోడ్డు మీదుగా ర్యాలీ తాడితోట, కంబాల చెరువు సెంటర్‌కు చేరుకుంది. అక్కడ దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి మంత్రి దాడిశెట్టి రాజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్అండ్బీ మంత్రిగా రామ్మోహనరావు విశేష సేవలందించారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఎంపీ వంగా గీత, సోదరులు జక్కంపూడి రాజా, గణేష్, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో ఉమ్మడి జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాకినాడ ఎంపీ వంగా గీత, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైఎస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, మాజీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మానే దొరబాబు, నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు కాటం రజనీకాంత్, అడపా అనిల్, ముద్దాల అను, కోడికోట, ఆరిఫ్, జేకే అరుణ్, కేఆర్జే రాజేష్, గన్నవరపు సంజయ్, కనకాల రాజా తదితరులు పాల్గొన్నారు. మంత్రి ర్యాలీకి వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యం వహించారు. -
రోడ్ల పునరుద్ధరణ పనులు వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) చెప్పారు. నాబార్డు నిధులతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో తన కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కృష్ణా జిల్లాలో ఏటిమొగ–ఎదురుమొండి ఐల్యాండ్‌ను అనుసంధానించే వంతెన, జగ్గయ్యపేట–సత్తెనపల్లి మధ్య మరో వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపే ఫైళ్లపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాబార్డు నిధులు రూ.1,158 కోట్లతో తొలి దశ పనులు చేపట్టామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతోనే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. 2019 ఎన్నికల ముందు రోడ్ల పునరుద్ధరణ కోసం కేంద్రం నుంచి తెచ్చిన రూ.3 వేల కోట్లను ఎన్నికల తాయిలాల కోసం టీడీపీ ప్రభుత్వం మళ్లించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్లకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతోందన్నారు. నిర్ణీత కాలంలో రోడ్ల పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. -
దాడిశెట్టి రాజా అనే నేను..
-
మంత్రివర్గంలో స్థానం పొందిన దాడిశెట్టి రాజా ప్రొఫైల్..
పేరు: దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) జిల్లా: కాకినాడ నియోజకవర్గం: తుని స్వస్థలం: ఎస్.అన్నవరం తల్లిదండ్రులు: సత్యనారాయణమ్మ, శంకర్రావు పుట్టిన తేదీ: జూలై 19, 1975, విద్యార్హతలు: బీఏ సతీమణి: లక్ష్మీచైతన్య సంతానం: కుమారుడు శంకర్మల్లిక్, కుమార్తె ఆశ్రిత రాజకీయ నేపథ్యం: 2008లో ప్రజారాజ్యం పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 2010లో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ తుని నియోజకవర్గం కో ఆర్డీనేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014, 2019 ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా పనిచేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అవకాశం దక్కించుకున్నారు. చదవండి: (సామాజిక మహా విప్లవం) -
యనమల పాత్రపై అనుమానాలు
తుని రూరల్: తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి సొసైటీలో 61 మంది తొండంగి రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించి రూ.11 కోట్లను రుణాలుగా మంజూరు చేయడం వెనుక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. బుధవారం ఎస్.అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో చనిపోయిన 9 మంది సహా 61 మంది రైతుల పేర్లతో నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి, పోర్జరీ సంతకాలతో 2016–17లో ఈ సొసైటీలో రూ.11 కోట్లు కాజేశారన్నారు. ఈ కుంభకోణం వెనుక అప్పటి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు పాత్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనిపై మాజీ మంత్రి యనమల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూస్తున్నట్టు తెలిపారు. ఓ గ్రామంలోనే ఇంతపెద్ద మొత్తంలో అక్రమాలు జరిగితే ఇతర గ్రామాల్లో ఎంతమేరకు అక్రమ రుణాలు పొందారో నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరనున్నట్టు చెప్పారు. -
ఎమ్మెల్యేలు ఆర్కే, దాడిశెట్టి రాజాలకు పాజిటివ్
సాక్షి, తాడేపల్లిరూరల్/మంగళగిరి/తుని: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ప్రభుత్వ విప్, తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజుల క్రితం ఆర్కే తండ్రి దశరాథరామిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్కే మంగళవారం కరోనా పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ అని తేలడంతో 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. తనను ఈ మధ్య కలిసిన వారు పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్కే బుధవారం ఒక ప్రకటనలో కోరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందటానికి తాను విశాఖపట్నానికి వెళ్లినట్లు రాజా చెప్పారు. చదవండి: 43 లక్షలు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు -
చంద్రబాబు ప్రజల ప్రయోజనాలు పట్టవు
-
రామోజీరావుకు పత్రికా విలువలు తెలియవు
-
రామోజీరావుకు పత్రికా విలువలు తెలియవు
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఈనాడు దినపత్రికలో వచ్చిన అసత్య కథనాలను ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా తీవ్రంగా ఖండించారు. ఆయన బుధవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రామోజీరావుకు పత్రికా విలువలు లేవు, కనీసం మానవతా విలువలు అయినా ఉన్నాయా? అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు. ‘ఈనాడు పత్రికలో ప్రభుత్వం మీద తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. 23 సీట్లు గెలుచుకుని...అసంతృప్తితో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి.. మరో పదిమంది పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్న టీడీపీపై వార్త రాయాలి. అలాగే చంద్రబాబు నాయుడు చేసిన విద్యుత్ కుంభకోణం, భూదోపిడీ, అవినీతి భాగోతాలపై ఈనాడు మొదటి పేజీలో కథనాలు రాయాలి. (బాబు ఎందుకు ఓడిపోయాడో అతనికే తెలియదు) 151 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టిన ఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బ్రహ్మండమైన సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. ఆనందంగా ఉన్న మేము ఎందుకు అసంతృప్తి గా ఉంటాం. రైతు భరోసా, ఫించన్లు పెంపు వంటి పలు సంక్షేమ పధకాలు అమలు చేస్తుంటే మేమేందుకు అసంతృప్తిగా ఉన్నామో రామోజీ చెప్పాలి. సంక్షేమ పధకాలతో రాష్ట్రంలో పేద ప్రజలందరు ఆనందంగా ఉన్నారు. దుర్మార్గుడైన చంద్రబాబును సమర్ధిస్తూ ... ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో రామరాజ్యంపై అసత్య కథనాలు రాయడం సరికాదు. రామోజీరావు ఇప్పటికైనా మానవతా విలువలు పాటించాలి’ అని సూచించారు. -
దిక్కుతోచని స్థితిలో టీడీపీ: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన అనుకూల మీడియాతో చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను విమర్శించే స్థాయికి చంద్రబాబు దిగజారారని నిప్పులు చెరిగారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తి చేశారని, మిగిలిన 10 శాతాన్ని కూడా ఎప్పుడు పూర్తి చేస్తామో కూడా వెల్లడించామన్నారు. (సమగ్ర భూ సర్వేలో ఆలస్యం వద్దు: సీఎం జగన్) సంక్షేమ పాలన అందించి, సీఎం జగన్ ప్రజల మన్ననలు పొందడంతో టీడీపీ నేడు దిక్కుతోచని పరిస్థితిలో పడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని టీడీపీకి అర్థమైందన్నారు. ఆక్వా రంగంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. తుని నియోజకవర్గం ఆక్వాజోన్‌లో చంద్రబాబు తన బినామీ కంపెనీ అయిన దివిస్ పరిశ్రమను తీసుకొచ్చే యత్నం చేశారని ఆయన ఆరోపించారు. కరోనా సమయంలో కూడా ఆక్వారంగాన్ని మద్దతు ధరతో సీఎం జగన్ ఆదుకున్నారని దాడిశెట్టి రాజా గుర్తుచేశారు. (డబ్బా కొట్టి, పత్తా లేకుండా పోయారు!) -
చంద్రబాబుకు కన్నా మంచి స్నేహితుడు..
సాక్షి, తూర్పుగోదావరి: మహమ్మారి కరోనా(కోవిడ్-19)ను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. కరోనాపై పోరులో ప్రభుత్వం సమర్థవంతగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా.. టీడీపీ నేతలు ముక్కును నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దున్న ఈనిందంటే దూడని కట్టండని గావు కేక పెట్టినట్టుగా ప్రతిపక్షాల తీరు ఉందని ధ్వజమెత్తారు. కరోనా కిట్ల కొనుగోలు అంశంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్లు పెట్టడమేమిటని ప్రశ్నించారు. బుధవారమిక్కడ మాట్లాడిన దాడిశెట్టి రాజా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.(ఒక్కో టెస్టింగ్ కిట్ రూ.795; ఆ నోళ్లకు తాళం!) ‘‘తనకు డౌట్ వచ్చి ట్వీట్ పెట్టానని కన్నా చెప్పినప్పుడు టీడీపీ ఎల్లో గ్యాంగ్ ఎందుకు మౌనంగా ఉంది. చంద్రబాబు నాయడు రంగాను హత్య చేశాడు... నన్ను కూడా హత్య చేస్తాడని చెప్పిన మాటలు కన్నాకు ఇప్పుడు గుర్తులేవా. చంద్రబాబు దగ్గర చందాలు తీసుకుని కన్న విమర్శలు చేస్తున్నారు. సంస్కారం లేని చంద్రబాబు కన్నాకు మంచి మిత్రుడు అయిపోయాడు. ఆకాశం మీద ఉమ్మివేస్తే ఏం జరుగుతుందో... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అదే జరుగుతుంది’’ అని కన్నా తీరును ఎండగట్టారు. చంద్రబాబు అసలు మనిషేనా.. ఆయనకు కొంచమైనా మానవత్వం ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ళ టీడీపీ పాలనలో నీరు- చెట్టు నుంచి పోలవరం ప్రాజెక్టు దాకా రూ.6 లక్ణల కోట్లు దోచేసి... పార్టీ శవాలపై పేలాలు ఏరుకుందని దుయ్యబట్టారు.(ఆయన దారుణ వ్యక్తిత్వం మరోసారి రుజువైంది: సజ్జల) -
‘చంద్రబాబూ రూ.3 లక్షల కోట్లు పంచండి’
సాక్షి, తూర్పుగోదావరి: ప్రతిపక్షనేత చంద్రబాబుపై ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తనను తాను జూమ్ యాప్ సీఎంగా ప్రమోట్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాకినాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబూ మీరు లూటీ చేసిన రూ.3 లక్షల కోట్లు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు పంచండి. కరోనా సమయంలో పొరుగు రాష్ట్రంలో దాక్కున్న ఆయన తన మాజీ మంత్రులు, తాబేదార్లతో అవ్వాకులు చవాకులు మాట్లాడించడం సరైన పద్దతి కాదు’అని హితవు పలికారు. (చదవండి: ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి : సీఎం జగన్) ‘కేంద్రం మూడు లక్షల రాపిడ్ టెస్ట్ కిట్లు కొంటే.. మన రాష్ట్రం లక్ష కిట్లు కొనుగోలు చేసింది. దీన్ని బట్టే కరోనా నివారణ కోసం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పని చేస్తుందో ప్రజలకు అర్ధమవుతోంది. కరోనా నివారణ చర్యల కోసం ప్రాణాలకు తెగించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ప్రజల మధ్యలో ఉండి వారి బాగోగులు చూసుకుంటున్నారు. కానీ ఇనాళ్లు రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకుతిన్న టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు ఎక్కడ దాకున్నారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా’అని రాజా పేర్కొన్నారు. (కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా?) -
చిల్లర రాజకీయాలు చేయకు ‘బాబూ’
సాక్షి, తుని: రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉంటే సహాయం చేయకపోగా చంద్రబాబు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా తునిలో ఎంపీ గీతతో కలిసి రాజా విలేకర్లతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు తన అనుంగులైన యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడులతో కలిసి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. విశాఖ మెడిటెక్ జోన్ గురించి మాట్లాడడానికి వారికి అర్హత లేదన్నారు. కాకినాడ సెజ్‌ను యనమల సోదరులు సొంత అవసరాలకు వాడుకున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో వెంటిలేటర్లు, కరోనా పరీక్ష కిట్లు, కాకినాడ సెజ్‌లో పీపీఈలు తయారు చేయించి సీఎం జగన్మోహన్రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. మా సలహాలు తీసుకొండని చంద్రబాబు అంటున్నారని, వెన్నుపోటూ, ప్రజలను మోసగించడం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోని నెట్టడం దేనిని తీసుకోవాలో చెప్పాలని రాజా ప్రశ్నించారు. నిజంగా ప్రజల కోసమైతే అమరావతి వచ్చి సేవలందించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలీకృతమయ్యాయని ఎంపీ గీత అన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం సహకరించాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ కొయ్యా మురళి, ఏలూరి బాలు పాల్గొన్నారు. చదవండి: నిర్లక్ష్యమే ముంచుతోంది..! -
‘బాబుకు దమ్ముంటే లోకేష్‌ను సర్పంచ్‌గా పోటీ చేయించాలి’
సాక్షి, తూర్పుగోదావరి : వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు.. ప్రభుత్వాని ఇబ్బంది పెట్టి, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. బాబు తన పతనానికి తానే గొయ్యి తవ్వుకుంటున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి విషయాన్నివ్యవస్థలో తన మనుషుల ద్వారా అడ్డుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. బాబుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థలో తన మనుషులను ముందుగానే సిద్ధం చేసుకున్నారని తెలిపారు. ఈ రోజు ఇరవై అయిదు లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందకుండా చంద్రబాబు అడ్డుకోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు తన మనుషులను ఉపయోగించుకుంటూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాడని దుయ్యబట్టారు.(‘వైఎస్సార్ విగ్రహం ధ్వంసం; శ్రీరామ్ అంగీకరించారు’) చంద్రబాబుకు దమ్ముంటే ఖాళీగా ఉన్న తన కొడుకు లోకేష్‌ను రాష్ట్రంలో ఎక్కడనుంచి అయినా సర్పంచ్‌గా పోటీ చేయించాలని ఛాలెంజ్ చేశారు. ప్రజల తీర్పు ఏలా ఉంటుందో మరోసారి బాబుకు క్లియర్‌గా అర్థం అవుతుందని అన్నారు. టీడీపీ ఇప్పటికే 100 అడుగుల లోతులో సమాధి అయిపోయిందని, దాన్ని తవ్వి తీయడం సాధ్యమయ్యే పని కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు కరోనా వైరస్ కాదని, ఎన్నికల కమీషనర్‌కు నారా వారి వైరస్ పట్టిందని విమర్శించారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నని చెప్పి.. గుంటూరు,చిత్తూరు కలెక్టర్లను మారుస్తున్నాని ఎన్నికల కమీషనర్ రాజకీయ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. (ఎన్నికలు వాయిదా: సుప్రీంను ఆశ్రయించిన సర్కార్ ) రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల ఒక్క మరణమైన సంభవించిందా.. అని ఎన్నికల కమిషనర్‌ను ప్రశ్నించారు. ఎన్నికల వాయిదాకు కరోనా అనేది ఒక సాకు మాత్రమేనని, ఎన్నికల కమీషనర్ చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నాడని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎన్నికల వాయిదా వల్ల కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన రూ.5 వేల కోట్లు ఎలా సర్ధుబాబు చేస్తారని ఎన్నికల కమీషనర్‌ను ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయి తీసుకుంటున్నారని మండిపడ్డారు. (సామాజిక వర్గాలను అడ్డు పెట్టుకొని పెత్తనం ఏంటి?) -
బాబు తన బినామీలను కాపాడూకునే ఉద్దేశం
-
ఆయన అంటెండర్‌గా కూడా పనికిరాడు..!
సాక్షి, కాకినాడ: లోకేష్.. చంద్రబాబు కుమారుడు కాకపోతే శాసనమండలిలో అంటెండర్ ఉద్యోగానికి కూడా పనికిరాడని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. శుక్రవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. మండలి జరుగుతున్నప్పుడు లోకేష్ ఒక పప్పులా వ్యవహరించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక యువ నాయకుడు ఎలా వ్యవహరించాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకోవాలని లోకేష్‌కు దాడిశెట్టి రాజా హితవు పలికారు. యనమల టెర్రరిజం గురించి ప్రజలకు తెలుసు.. యనమల రామకృష్ణుడు టెర్రరిస్టు కన్నా దారుణంగా వ్యవహరించారని.. యనమల టెర్రరిజం గురించి తుని నియోజకవర్గంలో ప్రతిఒక్కరికి తెలుసునన్నారు. కాపు ఉద్యమ సమయంలో అప్పటి జిల్లా ఎస్పీ, ఎఎస్పీని వెంటేసుకుని జిల్లాను ఏవిధంగా భయబ్రాంతులకు గురిచేశారో జిల్లా అంతా తెలుసునన్నారు. గత ఎన్నికల్లో యనమల, ఆయన సోదరుడిని జిల్లా ప్రజలు తరిమికొట్టిన విషయాన్ని వారు గుర్తించుకోవాలన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దేశ ద్రోహి యనమల అని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రలోభాల గేట్లు తెరిస్తే.. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలు పన్నులు కడుతున్నారు తప్ప.. చంద్రబాబు బినామీలు కోసం కాదన్నారు. చంద్రబాబు బినామీల కోసం.. తమ కష్టాలను త్యాగం చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. అమరావతిని రాజధానిగా అంగీకరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని స్పష్టం చేశారు. తాము ప్రలోభాల గేట్లు తెరిస్తే..నీ పక్కన కొడుకు, బావమరిది తప్ప మరెవ్వరు ఉండరన్న సంగతి చంద్రబాబు గుర్తించుకోవాలని దాడిశెట్టి రాజా నిప్పులు చెరిగారు. -
పగటి వేషగాళ్లలా.. కృత్రిమ ఉద్యమాలు
సాక్షి, కాకినాడ: సంక్రాంతి పగటి వేషగాళ్లలా బినామీలతో రాజధానిలో కృత్రిమ ఉద్యమాలు సృష్టించొద్దని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో మూడు రాజధానులకు మద్దతుగా వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి మాట్లాడుతూ.. రాజధానిపై రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్ళి మాట్లాడే దమ్ము చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు ఉందా అని ప్రశ్నించారు. అమరావతిపై చంద్రబాబు తాపత్రయం అంతా తన బినామీల ఆస్తులను కాపాడుకోవడం కోసమేనని ప్రజలకు అర్థమైందన్నారు. రాజధానిపై ఎందుకు రిఫరెండం పెట్టాలని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, విప్ల మీద చంద్రబాబు గూండాలు దాడి చేసినా.. కుల, మత ఘర్షణలు తెచ్చినా మాట్లాడకుండా మౌనంగా ఉండాలా అని ధ్వజమెత్తారు. టీడీపీ దుర్మార్గాలను అరికడుతున్నారు కాబట్టే.. పోలీసులపై చంద్రబాబు నెపం నెట్టుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలకు కామెడీ చూపిస్తున్నారు... ఎన్నికలకు ముందు కేఏ పాల్ కామెడీ చేసేవారని.. ఇప్పుడు ‘పవన్ నాయుడు పాల్’ రాష్ట్ర ప్రజలకు కామెడీ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ మాటల్లో చిత్తశుద్ధి లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా..పవన్ ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలన్నారు. ఇవాళ చంద్రబాబుకు ఇబ్బంది వస్తే పవన్ కల్యాణ్ వెంటనే వచ్చి వాలిపోతున్నారన్నారు. ‘గత నాలుగు వారాలుగా రెండు పత్రికలు, ఐదు టీవీ ఛానెళ్లు రాష్ట్ర ప్రజలకు నిజం చెప్పడం మానేశాయి. ఆ పత్రికలకు హెడ్ ఆఫీస్ హైదరాబాద్‌లో.. బ్రాంచ్ ఆఫీసులు జిల్లా వారీగా ఉండొచ్చు.. ఆ పత్రికలు, టీవీ ఛానెళ్ల యాజమానులకు కూడా అమరావతిలో బినామీ ఆస్తులు ఉన్నాయోమోనని అనుమానంగా ఉంది. వాటిపై కూడా దర్యాప్తు చేయాలని’ ముఖ్యమంత్రిని దాడిశెట్టి రాజా కోరారు. మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: మూడు రాజధానులు కావాల్సిందే..) -
‘చంద్రబాబు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు’
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఏపీ రాజకీయాలను డ్రామాలు, సినిమాలుగా మార్చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 100 రోజుల పరిపాలనలో ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఆ మాటలు మాట్లాడే అర్హత నీకుందా అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు. బుధవారం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఛలో ఆత్మకూరు కాదు.. ఛలో నరసరావుపేట, ఛలో యరపతినేని మైనింగ్ అనాలి. దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉన్నాయి నీ మాటలు. ప్రభుత్వం సాగర్‌కి నీళ్లు ఇస్తే.. రైతులు పొలాలు వేసుకుంటుంటే.. పచ్చని పల్నాడులో చిచ్చు రేపుతోంది నువ్వు చంద్రబాబు. ప్రజల చేత తిరస్కరించబడ్డ నేతలు ఇప్పుడు బాబు పక్కన చేరి ఏదేదో మాట్లాడుతున్నారు. మీ ఐదేళ్ల పరిపాలనలో మీరు చేసిన హత్యలు, అరాచకాల జాబితా మా దగ్గర ఉంది. అక్రమ కట్టడంలో ఉండి అక్రమ మాటలు మాట్లాడుతున్నారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాట నీ నోటి వెంట పలకడానికి అర్హుడవా? : జోగి రమేష్ ప్రజాస్వామ్యం అనే మాట నీ నోటి వెంట పలకడానికి అర్హుడవా అంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. పల్నాడులో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయడానికి చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ చంద్రబాబు 12 గంటల దీక్ష చేస్తారట. ఆయన ఏమి చేస్తాడనేది జనం పట్టించుకోవడం లేదు. టీడీపీ అధికారంలోకి రాగానే 30 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. వేల మందిని నిర్భందించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ 100 రోజుల పరిపాలనలో ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది కలగలేదు. మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఈ డ్రామాలు. ఈ క్షణం మీ ఇంటి దగ్గరికి వస్తాం... నీ ఇష్టం... గురజాల, సత్తెనపల్లి... ఎక్కడికైనా నీతోనే వస్తాం. మా సవాల్‌ను స్వీకరించండి. మీడియా సాక్షిగా మీరెక్కడికి చెప్తే అక్కడికి వెళదాం. యరపతినేని వందల కోట్ల ప్రజాధనాన్ని గనుల పేరుతో లూటీ చేశారు. గాలిని పోగేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే ఏదో జరిగిపోతుందని హడావుడి చేస్తున్నారు. ఆత్మకూరులో ఏముంది ? ఆత్మకూరు.. పల్నాడు ప్రశాంతంగా ఉన్నాయి. నువ్వే శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నావు’’ అంటూ మండిపడ్డారు. పెయిడ్ ఆర్టిస్టులతో కొత్త డ్రామాలకు తెర: దాడిశెట్టి రాజా తూర్పు గోదావరి : ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆత్మకూరు పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని, పెయిడ్ ఆర్టిస్టులతో కొత్త డ్రామాలకు తెర తీశారని ప్రభుత్వ చీఫ్ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తునిలో జరిగిన కాపు గర్జన రైలు దగ్ధం కేసుల్లో వైఎస్సార్ సీపీకి చెందిన 140 మందిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కాపు గర్జన కేసుల్లో ఎస్సీలు, బీసీలు, మైనారిటీలపై కూడా చంద్రబాబు కేసులు బనాయించారని తెలిపారు. నేర చరిత్ర కలిగిన చంద్రబాబునాయుడు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అసమర్ధ పాలన చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో 23 సీట్లు ఇచ్చి బుద్ది చెప్పారన్నారు. ఇదే పంధాలో కొనసాగేతే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 5 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదన్నారు. -
బడ్జెట్ పట్ల ఏపీ ప్రజలు సంతోషంగా ఉన్నారు
-
లోకేష్‌కి ట్వీట్ చేయడం కూడా రాదు’
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో బ్రిటిష్ జనరల్ డయ్యర్ కన్న దారుణంగా వ్యవహరించారని అన్నారు. బహీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించి అమాయకులను పొట్టనపెట్టుకున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మంగళవారం దాడిశెట్టి రాజా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనను చూసి ఓర్వలేకనే ఆయనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో అనేక రకాల అవినీతికి పాల్పడి.. ఇప్పుడు ఎదుటి వారిపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేని లోకేష్.. ఇంట్లో కూర్చోని ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. ఆయనకు సోషల్ మీడియాలో సరిగ్గా పోస్టులు కూడా చేయడం రాదని ఎద్దేవా చేశారు. ఆయన తీరు చూస్తుంటే ఎవరికో జీతం ఇచ్చి మెసేజ్‌లు పెడుతున్నట్లు అర్థమవుతోందని సందేహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో రూ.300 కోట్లు ఖర్చు పెట్టినా.. మంగళగిరి ప్రజలు ఏవిధంగా బుద్ది చెప్పారో ప్రజలంతా చూశారని రాజా గుర్తుచేశారు. -
‘కాకిలెక్కలతో బురిడీ కొట్టించారు’
సాక్షి, కాకినాడ : మాజీమంత్రి యనమల రామకృష్ణుడుపై ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శల వర్షం కురిపించారు. గడిచిన మూడేళ్లలో టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన సీఐఐ సదస్సుల ద్వారా లక్షకోట్ల పెట్టుబడులు వచ్చాయా అని ప్రశ్నించారు. కనీసం వెయ్యిమంది నిరుద్యోగులకైనా ఉపాధి కల్పించారా అని అన్నారు. రూ.19.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామంటూ కాకిలెక్కలతో బురిడీ కొట్టించి టీడీపీ నేతలు ప్రజల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెలరోజుల పాలనాకాలంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడాన్ని యనమల జీర్ణించుకోలేక విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల టీడీపీ పాలనతో ప్రజలు కష్టాలు, నష్టాలు తట్టుకోలేకే వైఎస్ జగన్‌కు పట్టం కట్టారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్ ప్రజారంజక పాలన చూసి వారికి భయం పట్టుకుందని అందుకే పసలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. యనమల విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. -
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: దాడిశెట్టి
సాక్షి, కాకినాడ : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనంతో ప్రతిపక్ష పార్టీలు అడ్రసు లేకుండా గల్లంతు అయ్యాయని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ..‘ జగన్మోహన్రెడ్డి పరిపాలన చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పరిపాలనను మరిపించేలా పాలన ఉంది. టీడీపీ నేతలు, కార్యకర్తలే జగన్ చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారని చెబుతున్నారు. చంద్రబాబులా జగన్‌కు ప్రజలను మోసం చేయడం తెలియదు....రాదు. చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే తన సమయాన్ని వినియోగించుకున్నారు. అదే జగన్ మంచి పాలనపై దృష్టి పెట్టి ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీఏసీ సభ్యుడుగా వైఎస్ జగన్ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ విప్‌గా మరో బాధ్యత ఇచ్చారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను నిలబెట్టుకుంటాను.’ అని అన్నారు. -
రాజా వర్సెస్ కృష్ణుడు
తూర్పు గోదావరి జిల్లాకు తూర్పు ముఖ ద్వారం లాంటి తునిలో తొలుత రాజరిక వ్యవస్థ ప్రాబల్యం చూపినా క్రమేపీ రాజకీయం సామాన్యుడి చేతుల్లోకి వచ్చింది. నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మజిలీలు కనిపిస్తాయి. తుని పేరు తలుచుకోగానే గుర్తుకొచ్చేది తలుపులమ్మలోవ. పూర్వం తలుపులమ్మలోవకి వెళ్లడం అంటే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత గొప్పగా భావించేవారు. ఈ లోయలో ఒక జలపాతం ఉంది. గతంలో అందులో నీళ్లు కొబ్బరి నీళ్లలా తియ్యగా ఉండేవంటారు. ఎన్నికల ప్రచారం నుంచి రాష్ట్ర స్థాయిలో పలు పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. తుని ఓటర్లు ఎప్పుడూ విలక్షణమైన తీర్పు ఇస్తారు. – కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, కాకినాడ కాంగ్రెస్, టీడీపీ కోటలో వైఎస్సార్సీపీ పాగా తుని నియోజకవర్గానికి తొలిసారి జరిగిన ఎన్నికల్లో రాజా వి.వి.కె. బహుదూర్ (బుల్లిబాబు) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972లో రాజా వి.వి.కె. బహుదూర్ (బుల్లిబాబు) కుమార్తె ఎం ఎన్. విజయలక్ష్మిదేవి విజయం సాధించి తుని తొలి మహిళా శాసన సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1978లో రెండోసారి గెలిచిన విజయలక్ష్మిదేవి 1981లో టి.అంజయ్య క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి 1982 వరకు తునిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే శాసన సభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. రాజా వి.వి.కె. బహుదూర్ (బుల్లిబాబు) కుటుంబానికి చెందిన వారే ఇక్కడి నుంచి ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించారు. అనంతరం టీడీపీ అవిర్భావంతో బీసీ వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు రాజ కుటుంబాన్ని ఓడించి శాసన సభ్యుడిగా గెలుపొందారు. అప్పటి నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో వరుసగా ఆరు సార్లు విజయం సాధించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2009లో జరిగిన ఎన్నికల్లో యనమల రామకృష్ణుడిపై రాజా ఆశోక్‌బాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆరు పర్యాయాలు గెలిచిన యనమల రికార్డుకు తెర పడింది. 2014 ఎన్నికల్లో యనమల తన సోదరుడు కృష్ణుడ్ని రంగంలోకి దించినా ఫలితం దక్కలేదు. కృష్ణుడిపై వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన దాడిశెట్టి రాజా విజయం సాధించారు. నియోజకవర్గ ఓటర్లు దాడిశెట్టి రాజావైపే మరోసారి మొగ్గు చూపుతున్నారు. యనమల కుటుంబం అరాచకాలు.. మంత్రి యనమల రామకృష్ణుడు పలుసార్లు ప్రాతినిథ్యం వహించిన తునిలో అరాచకం రాజ్యమేలుతోంది. మంత్రి యనమల అధికారం అండతో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాని అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారు. మంత్రి సోదరుడైన కృష్ణుడు ఆగడాలకైతే అడ్డూ అదుపూ లేదు. యనమల కుటుంబం, అనుచరుల అక్రమాలకు అంతు పొంతూ లేకుండా పోయింది. దాదాపు 57 నెలల కాలంలో అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఖాళీ స్థలాలు కబ్జా చేశారు. పోలీసు స్టేషన్, సంస్థానం స్థలాలను సైతం ఆక్రమించేశారు. ఇసుక, గ్రావెల్‌ను అక్రమంగా తవ్వేసి మింగేశారు. మరుగుదొడ్ల నిర్మాణాల ముసుగులో నిధులు స్వాహా చేశారు. ఇళ్లు, కార్పొరేషన్ రుణాలు, ఆక్వా అనుమతులు మంజూరు చేసేందుకు ముడుపులు గుంజారు. రూ.వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారు. అంతటితో ఆగలేదు... అమాయకులపై అక్రమ కేసులు పెట్టించారు. ప్రజలు స్వేచ్ఛగా గళం విప్పే అవకాశం ఇవ్వలేదు. యనమల రామకృష్ణుడు సీనియర్ మంత్రి హోదాలో ఉన్నా నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగు, సాగునీటి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈసారి త్రిముఖ పోరు ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తిరిగి పోటీ చేయనున్నారు. టీడీపీ తరఫున యనమల కృష్ణుడు మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే కృష్ణుడు పోటీ చేస్తున్నట్టు బహిరంగ సభల్లో కూడా ప్రకటించారు. ఆఖరి నిమిషంలో మార్పులు జరిగితే యనమల రామకృష్ణుడు పెద్ద కుమార్తె దివ్యను బరిలోకి దింపే అవకాశం ఉంది. జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్వివి.కృష్ణంరాజు (రాజా అశోక్‌బాబు) పోటీ చేయనున్నారు. ప్రజల తరపున దాడిశెట్టి రాజా పోరాటం తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నిరంతరం ప్రజలు తరపున పోరాడుతూనే ఉన్నారు. మంత్రి యనమల ఒత్తిళ్లతో ఎన్ని కేసులు నమోదైనా వెరవలేదు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో రైలు దగ్ధం ఘటనకు సంబంధించి బనాయించిన అక్రమ కేసులపై ప్రజలు, కార్యకర్తల తరపున పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు అన్ని సామాజిక వర్గాలతో సఖ్యతతో వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. దివంగత వైఎస్సార్ తమ నియోజకవర్గానికెంతో చేశారని, పేద ప్రజల పాలిట దైవంగా నిలిచారని తుని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. తుని ప్రజల ప్రధాన సమస్యలు... 2012 నవంబరు 4న తాండవ నది ఉప్పొంగి ప్రవహించడంతో తుని, పాయకరావుపేట పట్టణాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. తుని మండలం కుమ్మరిలోవ, పట్టణంలోని రెల్లిపేట, రాజీవ్ గృహకల్ప, అమ్మాజీపేట, సీతారామపురం, కొండవారిపేట, తారకరామానగర్, ఇసుకల పేట, మేదరిపేట, బాలాజీ సెంటర్, రైల్వే కాలనీ, తదితర ప్రాంతాలు నీటమునగడంతో అపార నష్టం వాటిల్లింది. పలువురు జీవనోపాధి కోల్పోయారు. తాండవనది పరీవాహక ప్రాంతంలో వరదనీటి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రతిపాదించిన రక్షణ గోడ నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. 2013లో వస్తున్నా మీకోసం పాదయాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కరకట్ట నిర్మిస్తామని ప్రజల సాక్షిగా ఇచ్చిన హామీని చంద్రబాబు గాలికి వదిలేశారు. కరకట్ట కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు. తుని మండలంలోని మెట్ట గ్రామాలకు గోదావరి జలాలు అందకపోవడంతో ఏటా పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. కోటనందూరు మండలం జగన్నాధపురం–భీమవరపుకోట రోడ్డులో ఉన్న వెంకటాచలం చెరువుపై 2012 నీలం తుపాను సమయంలో గండి పడింది. ఈ చెరువు కింద 600 ఎకరాల ఆయకట్టు ఉంది. గండి కారణంగా చెరువులో నీరు నిల్వ లేకపోవడంతో ఏటా ఖరీఫ్‌లో సాగునీటికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కోటనందూరు మండలం అల్లిపూడిలో రూ.25 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ మంచినీటి పధకం పనులు నేటికీ కొనసాగుతున్నాయి. 90 శాతం పనులు పూర్తయినా పైపులైను శిధిలం కావడంతో నీటి సరఫరాకు నోచుకోవడం లేదు. జనాభా : 2,97,450 ఓటర్లు - 2,03,043 పురుషులు- 1,01,354 మహిళలు- 1,01,673 ఇతరులు- 16 -
మంత్రి యనమల వేధింపులు
తుని (తూర్పుగోదావరి): ప్రజల తరఫున పోరాటం చేస్తే తనపై అన్యాయంగా కేసులు పెట్టించిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు ఇప్పుడు ఆ కేసును బయటకు తీయించి వేధింపులకు గురిచేస్తున్నారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. బుధవారం సాయంత్రం తుని రూరల్ ఎస్ఐ సుధాకర్ 2015లో జరిగిన ఓ కేసుకు సంబంధించిన సీఆర్పీసీ 41 నోటీసును ఎమ్మెల్యే రాజాకు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అందజేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణకు సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే రాజా విలేకరులతో మాట్లాడారు. తుని మండలం డి.పోలవరానికి చెందిన రైతులు 17–07–2015న ఇసుక అక్రమంగా తవ్వుతున్నారని ఫోన్ చేస్తే గన్‌మెన్‌తో కలిసి వెళితే.. టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. ఇడెక్కడి న్యాయమని ప్రశ్నించినందుకు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని తెలిపారు. మూడేళ్ల తర్వాత ఆ కేసును తిరగదోడి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశామని, ప్రతి ఘటనలోనూ యనమల సోదరుల ఒత్తిడితో కేసులు బనాయించారన్నారు. పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని, ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టేందుకు పాత కేసులను బయటకు తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు పెట్టినా భరిస్తానన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని రాజా తెలిపారు. -
‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’
సాక్షి, తూర్పుగోదావరి : నాలుగేళ్లలో తుని పట్టణానికి ప్రభుత్వం చేసిందేమి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుని అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కనీసం రూ. 5కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ కోట నందురు మండలం జూనియర్ కాలేజీ లేదన్నారు. నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని చూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. చినుకు పడితే తుని పట్టణం వరదలో మునిగిపోయేలా ఉందన్నారు. టీడీపీ నాయకులు అభివృద్దిని పక్కకు పెట్టి అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. -
ప్రజల్ని దోచుకోవడంలోనే అభివృద్ధి
కోటనందూరు/తుని రూరల్: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంతా గోడలకు రంగులు, బొమ్మలు వేయడంలోనే ఉందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కనిపించడంలేదని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. రూ.15 లక్షల వ్యయంతో గోడలకు రంగులు వేస్తూ ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని విమరించారు. ఇప్పటికే ఉన్న రహదారులపై మళ్లీ సిమెంట్ రోడ్లను కమిషన్ల కోసం నిర్మిస్తున్నారన్నారు. ఆ నిధులతో పేదల నివాసాలు, మురికివాడల్లో కాలువలు, రహదారులు నిర్మించడంలో వివక్ష ఏమిటని ప్రశ్నించారు. శనివారం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా స్థానిక గొల్ల అప్పారావు సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభకు, నియోజకవర్గంలో సాగుతున్న టీడీపీ నాయకుల అరాచక పాలనకు వ్యతిరేకంగా భారీగా తరలివచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ఎమ్మెల్యే రాజా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన ఏ హామీ సంపూర్ణంగా నెరవేరలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. రైతు, డ్వాక్రా రుణాలు, 108 అంబులెన్సు, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలు జరక్కపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా నిర్ధిష్టమైన ప్రణాళికతో మీ ముందుకు వస్తున్న జగన్‌ను వచ్చే ఎన్నికల్లో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. బహిరంగ సభ వేదిక వద్ద స్వాతంత్రం కోసం పోరాడిని అల్లూరి సీతారామరాజు, మరోపక్క రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, మరోపక్క పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేసిన ఎన్.టి.రామారావు విగ్రహాలను ఏర్పాటు చేసిన ఈ పట్టణంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యహరిస్తూ అభివృద్ధిని కుంటుపర్చారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. చంద్రబాబునాయుడు మోసపూరితమైన హామీలతో రాష్ట్రంలో వ్యవస్థలన్నింటిని భ్రష్టు్టపట్టించారని మాజీ మంత్రి పార్థసారథి అన్నారు. ప్రజలకు రాజన్న పాలన అందాలంటే ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డికి వచ్చే ఎన్నికల్లో మద్దతు పలకాలన్నారు. రెండు నెలలుగా జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు విశేష స్పందన లభిస్తోందని కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. అన్నదమ్ముల్లా కలసి ఉన్న తుని, పాయకరావుపేట పట్టణాలు ఏమాత్రం అభివృద్ధి సాధించలేదని మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. 2009, 2013 ఉప ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా నెగ్గించి సేవ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ టీడీపీ నేతలు అనేక కుట్రలు పన్ని అణగదొక్కారన్నారు. చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం నుంచే రాష్ట్రంలో ఎన్నో అనర్ధాలు జరుగుతూ ప్రజలు మృత్యువాత పడుతున్నారని పార్టీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ అన్నారు. రాష్ట్రంలో హీరోగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు తునిలో జీరోగా ఉన్నారని ఆమె అన్నారు. ఆయన తమ్ముడు చిన్నికృష్ణుడు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. టీడీపీ నేతల వేధింపులకు దీటుగా నిలబడి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పార్టీ నేతలందరికీ అండగా నిలుస్తున్నారన్నారు. బాధ్యతరహితమైన జన్మభూమి కమిటీల కారణంగానే వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా యనమల మూడోసారి ఓడిపోతారని కొయ్య శ్రీనుబాబు అన్నారు. అరాచక పాలనను అంతమెందించి జగనన్నను గెలిపించాలని రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ పిలుపునిచ్చారు. -
ప్రజలు ఛీత్కరించినా దొడ్డిదారిన పదవి
యనమలపై ఎమ్మెల్యే దాడిశెట్టి ధ్వజం కాకినాడ : ప్రజలు రెండుసార్లు ఛీత్కరించినా దొడ్డి దారిన మంత్రి పదవి పొందిన చరిత్ర మంత్రి యనమల రామకృష్ణుడుదని తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన కాకినాడలో విలేకర్లతో మాట్లాడుతూ యనమల ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో రెండుసార్లు రాష్ట్రం దివాలా తీసిందన్నారు. ప్రజామోదం లేకపోయినా మంత్రిపదవిలో సాగుతున్న యనమలకు తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ప్రజామోదంతో తమ పార్టీ అధ్యక్షుడు వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం కావడం తథ్యమన్నారు. యనమల తన హయాంలో పాలనపై సమీక్షించుకోవాలని దాడిశెట్టి రాజా హితవు పలికారు. జిల్లాలో పోలీసు యంత్రాంగం తీరు అత్యంత ఘోరంగా ఉందని విమర్శించారు. ఖాకీలు పచ్చచొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కారణమైన ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశ పూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఇందుకు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
అధికారం నిలుపుకొనేందుకే ఫిరాయింపులు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి, దాడిశెట్టి, విశ్వేశ్వరరెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకునేం దుకే టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై శుక్రవారం ఎమ్మె ల్యేలు దాడిశెట్టి రాజా, విశ్వేశ్వరరెడ్డిలతో కలిసి అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కల్పనపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పిన్నెళ్లి విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ(వైఎస్సార్సీపీ) గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభ పెట్టి, అనధికారంగా చేర్చుకోవడం దారుణమన్నారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు అదే పద్ధతిలో ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశా లను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం అసెంబ్లీ సమావేశాలను కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా) ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. తెలంగాణలో అనైతికమన్న పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు సిగ్గువిడిచి ఏపీలో ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. -
20వేల మంది రోడ్డున పడుతున్నా...