పవన్‌ ఏమాత్రం సంస్కారం లేని వ్యక్తి: మంత్రి దాడిశెట్టి రాజా | AP: Dadisetti Raja Fires On Pawan Kalyan Comments On Ambati | Sakshi
Sakshi News home page

పవన్‌ ఏమాత్రం సంస్కారం లేని వ్యక్తి: మంత్రి దాడిశెట్టి రాజా

Published Fri, Jan 13 2023 2:13 PM | Last Updated on Fri, Jan 13 2023 3:17 PM

AP: Dadisetti Raja Fires On Pawan Kalyan Comments On Ambati - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎప్పుడో చచ్చిపోయిన చంద్రబాబు పార్టీని బతికించటానికి పవన్ కల్యాణ్‌ తెగ ఆరాటపడుతున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. బలమైన కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూడా పవన్ దూషణలకు దిగాడని మండిపడ్డారు. తమ నాయకుడు చంద్రబాబు చెప్పాడని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. మంత్రి అంబటి రాంబాబు కాపులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే నేత అని, అలాంటి వ్యక్తిని కూడా దూషించడం సరికాదన్నారు. 

కష్టంతో ఎదిగిన గుడివాడ అమర్నాథ్‌ను సైతం తిట్టాడరి, పవన్‌ ఏమాత్రం సంస్కారం లేని వ్యక్తి అని ఆగ్రహవం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు, పవన్ ఒకటేనని మేము ముందు నుంచే చెప్తున్నాం. అందుకే దత్తపుత్రుడు అంటున్నాం. సీఎం జగన్‌ను ఎదుర్కోలేనని పవన్ నిన్న తేల్చి చెప్పాడు. పవన్ చేసే జోకర్ చేష్టలు, బ్రోకర్ చేష్టలన్నీ చూసి కాపులంతా అసహ్యించుకుంటున్నారు. తన సభలకు వచ్చే యువతను రెచ్చగొట్టి పెడదారి పట్టేలా చేస్తున్నారు. ‘నిన్ను నమ్మి వస్తే.. పోలీసులపై తిరగపడమని అనటం ఏంటి?. వారు కేసుల్లో ఇరుక్కుని భవిష్యత్తు నాశనం చేసుకోవాలా?.

నిన్ను చూసి సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. నీ దత్తతండ్రి ఇచ్చే స్క్రిప్టు చదివితే సరిపోతుందా?. సంవత్సరానికి 15 వేల కోట్ల పెట్టుబడులు ఈ మూడేళ్లలో గ్రౌండ్ అయ్యాయి. అలాంటివి నీ కళ్లకు కనపడవా?. రాష్ట్రంలో అలజడులు సృష్టించటానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. నాసిరకం సినిమాలు‌ తీసి అవి ప్లాప్ అయితే.. ప్రజలను తిట్టడం ఏంటి?. కాంతారా లాంటి సినిమాలు హిట్ అవుతుంటే నీ భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు ప్లాప్ అవుతున్నాయో అర్థం చేసుకో. పవన్ ఎంతమందితో వచ్చినా వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.175 స్థానాల్లో గెలిచి తీరుతామని దాడిశెట్టి రాజా ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: ఇంటికో ఉద్యోగమని చెప్పి మోసం చేస్తే పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదు?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement