
యనమల రామకృష్ణుడి మాటలను తుని ప్రజలు విశ్వసించడం లేదని, చివరికి ఆయనకు ఇళ్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు.
సాక్షి, కాకినాడ: యనమల రామకృష్ణుడి మాటలను తుని ప్రజలు విశ్వసించడం లేదని, చివరికి ఆయనకు ఇళ్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ‘‘ఆదివారం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ప్రాథమిక వైద్యశాలలో వైద్యులు లేరంటున్నారు.. తుని పీహెచ్‌సీలో వైద్యులు లేరని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని మంత్రి సవాల్ విసిరారు.
‘‘సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలతోనే మళ్లీ ఎన్నికలకు వెళ్తాం. 2014-2019 వరకు వరకు తన పరిపాలన చూసి ఓటేయండి అనే ధైర్యం చంద్రబాబుకు ఉందా’’ అంటూ మంత్రి ప్రశ్నించారు.