
సాక్షి, తుని(కాకినాడ జిల్లా): పవన్ కల్యాణ్‌ను ఆ పార్టీ నేతలు మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘గంటకో విధంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్ సభలకు జనం రావడం లేదు. ఈ సభలతో పవన్ కల్యాణ్ నవ్వులపాలవుతున్నారు. పవన్‌ను సీఎం కాదు.. ఎమ్మెల్యే చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు’ అంటూ మంత్రి తేల్చి చెప్పారు.
‘‘తాను మంచి చేశానని భావిస్తేనే సీఎం జగన్ ఓటు వేయమంటున్నారు. అలా చెప్పే ధైర్యం చంద్రబాబు, పవన్‌కు ఉందా?. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ రెండు సభలు ప్లాప్ అయ్యాయి. ఎక్కడి పోటీ చేస్తాడో పవన్‌కే క్లారిటీ లేదు. నవ్వు సీఎం అయిపోవాలనుకుంటే అయిపోవు.. ప్రజలు మద్దతిస్తేనే అవుతావు 2014-19లో టీడీపీ, పవన్, బీజేపీ కలిసి మేనిఫెస్టో రూపొందించారు. మేనిఫెస్టో హామీలు అమలు చేయకపోతే చంద్రబాబును నిలదీశావా పవన్’’ అంటూ దాడిశెట్టి దుయ్యబట్టారు.
చదవండి: ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు
‘‘పవన్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు సైక్రియాటిస్ట్‌కు చూపించాలి. చంద్రబాబు ప్యాకేజీ సరిగా ఇవ్వడేమోనని అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నావు. టీడీపీ ప్రభుత్వంలో ఆలయాలను కూల్చేస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు?. కోట్లమందిని చంద్రబాబు మోసం చేస్తే పవన్ ప్రశ్నించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. టీడీపీ పాలనలోని పరిస్థితిని పవన్ కల్యాణ్ గుర్తు తెచ్చుకోవాలి. తన యాజమాని చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయం. పవన్ తన నోటికి ఏదితోస్తే అది మాట్లాడుతున్నారు’’ అని మంత్రి దాడిశెట్టి నిప్పులు చెరిగారు.