thuni
-
కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరులో దారుణహత్య
-
ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: యనమల రామకృష్ణుడి మాటలను తుని ప్రజలు విశ్వసించడం లేదని, చివరికి ఆయనకు ఇళ్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ‘‘ఆదివారం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ప్రాథమిక వైద్యశాలలో వైద్యులు లేరంటున్నారు.. తుని పీహెచ్సీలో వైద్యులు లేరని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని మంత్రి సవాల్ విసిరారు. ‘‘సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలతోనే మళ్లీ ఎన్నికలకు వెళ్తాం. 2014-2019 వరకు వరకు తన పరిపాలన చూసి ఓటేయండి అనే ధైర్యం చంద్రబాబుకు ఉందా’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. -
కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
-
Video: ఆ తల్లికి సాయం కోసం.. సీఎం జగన్
సాక్షి, కాకినాడ: జిల్లాలోని తునిలో తన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. జనాల మధ్య చంటిబిడ్డతో ఉన్న ఓ తల్లిని గుర్తించి.. తన కాన్వాయ్‌ను ఆపించి దిగారు. ఆ తల్లి వివరాలు అడిగి తెలుసుకుని.. ఆమె కష్టానికి చలించిపోయారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజకు ఓ కొడుకు ఉన్నాడు. ఆ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయం కోసం ఆమె సీఎం జగన్‌ను కలవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలోనే చంటిబిడ్డను సీఎం కాన్వాయ్‌కు కనిపించేలా ప్రయత్నించింది. అది గమనించిన సీఎం జగన్.. కాన్వాయ్‌ను ఆపించారు. ఆ తల్లీబిడ్డలను పిలిపించుకుని సమస్య తెలుసుకున్నారు. తన బిడ్డ ఆరోగ్య పరిస్ధితిని సీఎం జగన్‌కు వివరించి ఆదుకోవాలని తనూజ కోరడంతో ఆయన సత్వరమే స్పందించారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌కు సమస్యను పరిష్కరించాలని ఆదేశించి.. అప్పటికప్పుడే ఆమెకు సాయం అందేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. చదవండి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ -
‘నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి’
సాక్షి, తూర్పు గోదావరి: కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్థించిందని వైఎస్సార్సీపీ తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. హైకోర్టు తీర్పును కూడా అగౌరవ పరిచే విధంగా కొందరు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని.. ఇది ఖచ్చితంగా కోర్టు తీర్పు ఉల్లంఘనే అని విమర్శించారు. మాజీ మంత్రి యనమల ఒక రకమైన నిస్పృహలో ఉన్నారని, సీఎం జగన్‌పై ఆయన చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు తమ నోటిని అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని రాజా హెచ్చరించారు. చంద్రబాబు నాయుడి తుగ్లక్ పాలన చేయబట్టే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యే లు, ముగ్గురు ఎంపీలతో ప్రజలు సరిపెట్టారని.. వైఎస్ జగన్ పరిపాలనను రాష్ట్ర ప్రజలంతా కొనియాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేత దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం శుభపరిణామం అన్నారు. -
తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు!
సాక్షి, గుంటూరు/ కాకినాడ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, గుంటూరు జిల్లాలోని వేమూరు, పొన్నూరులో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయం అయ్యాయి. -
ప్రభుత్వ వైద్యురాలిపై ఆర్థికమంత్రి కక్షసాధింపు
-
బలైపోయిన బంగారు బొమ్మ
అప్పటి వరకూ తల్లిదండ్రులతో సరదాగా గడిపిన ఆ చిన్నారి అల్పాహారం కోసం వెళ్లి అనంతలోకాల్లో కలిసిపోయింది. అందరూ చూస్తుండగానే ‘అమ్మా’ అని ఆక్రందన చేస్తూ ఇసుక ట్రాక్టర్ చక్రాల కింద నలిగిపోయింది. కాపాడే ప్రయత్నం చేసేలోపే మృత్యు కౌగిట్లోకి వెళ్లిపోయింది. నాలుగో తరగతి చదువుతున్న పదేళ్ల వయసున్న ఈ బాలిక పేరు రాణి. పేరుకు తగ్గట్టుగానే ముగ్దమనోహర రూపం...చలాకీతనంతో అందరినీ ఆకట్టుకుంటూ ’రాణి’స్తున్న ఆ పాపను విధి కాటేయడంతో విషాదం అలముకుంది. స్వచ్ఛమైన మల్లెలాంటి నవ్వు.. కలువల్లాంటి కళ్లు.. బంగారుబొమ్మలాంటి రూపంతో.. ఆ ఇంట వెలసిన దేవతలాంటి ఆ చిన్నారి.. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ.. తల్లిదండ్రులతో ఆనందంగా గడిపింది. ఉదయం టిఫిన్ తెచ్చుకుందామని బయలుదేరింది. అంతలోనే మృత్యుశకటం ఆమె పైకి దూసుకువచ్చింది. ఆ క్షణంలో ఆమె పెట్టిన ఆక్రందన అందరినీ కలచివేసింది. మరుక్షణంలోనే ఆ అపరంజి బొమ్మ విగతజీవిగా మారిపోయింది. తుని : అప్పటివరకూ తల్లిదండ్రులతో సరదాగా గడిపిన ఆ చిన్నారిని ఇసుక ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఇసుకలపేటకు చెందిన చలికే నాగమణి, చిన్న దంపతుల కుమారుడు, కుమార్తె ఎస్తేరురాణి (10) ఉన్నారు. స్థానిక ప్రైవేటు స్కూలులో ఎస్తేరురాణి నాలుగో తరగతి చదువుతోంది. శనివారం ఉదయం టిఫిన్ తెచ్చుకుందామని సమీపంలోని హోటల్‌కు బయలుదేరింది. అదే సమయంలో స్థానికంగా కడుతున్న ఓ ఇంటికి ఇసుక లోడుతో ఓ ట్రాక్టర్ ఎదురుగా వస్తోంది. అసలే అది చాలా ఇరుకైన రోడ్డు. ఎదురుగా అభంశుభం తెలియని చిన్నారి వస్తోందని కూడా డ్రైవర్ చూడలేదు. నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను ముందుకు పోనిచ్చాడు. ప్రమాదం నుంచి తప్పించుకొనే అవకాశం లేకపోవడంతో ఎస్తేరురాణి ఆ ట్రాక్టర్ కింద పడి దుర్మరణం పాలైంది. పట్టణ ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని తుని మండలం డి.పోలవరానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కొరుప్రోలు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్రాక్టరుకు సంబంధించి ఏవిధమైన పత్రాలూ లేవు. డ్రైవర్ నాగేశ్వరరావుకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. చిన్నారి మృతికి కారకుడైన నాగేశ్వరరావును చూసి స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు. ఎస్తేరురాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అమ్మా! మమ్మల్ని వదలిపోయావా? బంగారుబొమ్మలా ఉన్న ఎస్తేరురాణి ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలియడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ప్రమాదంలో కుమార్తె చనిపోయిన విషయం తెలుసుకున్న తల్లి నాగమణి సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ‘‘అమ్మా మమ్మల్ని వదిలిపోయావా?’’ అంటూ కుటుంబ సభ్యులు దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు. ఎస్తేరురాణి మృతితో ఇసుకలపేట శోకసంద్రంగా మారింది. ఏ ఇంటి దగ్గర చూసినా మహిళలు ఆ చిన్నారిని తలచుకొని కన్నీటిపర్యంతమయ్యారు. -
తునిలో అగ్నిప్రమాదం
తుని: తూర్పుగోదావరి జిల్లా తునిలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవంచింది. స్థానిక దుర్గాదాస్ వీధిలోని ఓ అపార్ట్మెంట్లో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాట తప్పి.. మంట పెట్టి..
రెండోమాట ఎన్నికల ప్రయోజనాల కోసం, ఓటర్లను ఆకట్టుకునే ‘వశీకరణ’ మంత్రంగా రిజర్వేషన్లు తయారైనాయి. చంద్రబాబు తమ పార్టీ మేనిఫెస్టోలో కాపులను బీసీ జాబితాలో చేరుస్తానని హామీ ఇచ్చారు. దానిని నెరవేర్చకుండా మాటలతో డొల్లిస్తున్న సందర్భంలోనే ముద్రగడ సారథ్యంలో కాపుల సమీకరణ మహోద్యమ రూపం తీసుకోవలసి వచ్చింది. పైగా కొత్త ప్రభుత్వ హయాంలోనే కాపుల ఉద్ధరణకు రూ. 1,000 కోట్లు కేటాయిస్తానని చెప్పి, రూ. 100 కోట్లకు పరిమితమయ్యారు. ‘వెనుకబడిన తరగతుల (బీసీ) జాబితాలో చేర్చాలని కోరే హక్కు కాపులకు ఉంది. ఈ విషయం తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో బాహాటంగా ప్రకటించింది. అలా మాకు హామీ ఇచ్చింది. రిజర్వేషన్లలో మాకూ వాటా ఉండాలి. కాపులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వెనకబాటుతనంతో ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి గత ఇరవయ్యేళ్లుగా నేను పోరాడుతున్నాను.’ - ముద్రగడ పద్మనాభం (31-1-2016 తుని కాపు ఐక్య గర్జన సభలో) ‘కాపుల ఆందోళన వెనుక ఒక క్రిమినల్ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంది. తన స్వప్రయోజనాల కోసం అది ప్రజలను రెచ్చగొడుతోంది. అది రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకం. రేపు బీసీలను రెచ్చగొట్టి కాపులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పోరాడమని రెచ్చగొడుతుంది.’ - నారా చంద్రబాబునాయుడు (31-1-2016) కాపులను వెనుకబడిన తరగతి (బీసీ) జాబితాలో చేర్చి విద్య, ఉపాధి, ఉద్యోగాల కల్పనలో; ప్రమోషన్లలో రిజర్వేషన్ సౌకర్యానికి అర్హులుగా ప్రకటించాలన్న ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లోనూ రెండు దశాబ్దాల నుంచి దఫదఫాలుగా జరుగుతోంది. ఇప్పుడు తుని కేంద్రంగా, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో మళ్లీ ఆరంభమైంది. అయితే ఇది అనేక అవాంఛనీయ సంఘటనలకు దారితీసింది. కాపులను బీసీ కేటగిరీలో చేరుస్తూ విస్పష్టమైన జీవో తక్షణం విడుదల చేయాలనీ, అంతవరకు ఉద్యమం ఆగదనీ ముద్రగడ ప్రకటించారు. తెలుగుదేశం నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రణాళికలో కాపు వర్గానికి అనేక హామీలు గుప్పించారు. కానీ మరచిపోయారు. దాని ఫలితంగా చోటు చేసుకున్న పరిణామాలకు జగన్, వైఎస్ఆర్సీపీలను బాధ్యులను చేయడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం. ముద్రగడ ప్రారంభించిన ఈ ఉద్యమానికి టీడీపీ, బీజేపీలు మినహా మిగిలిన రాజకీయ పక్షాలలోని ఆ వర్గానికి చెందిన నాయకులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ప్రకటించినవారే. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ముద్రగడ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం ఆశ్చర్యమూ కాదు. అభ్యంతరకరమూ కాదు. ఈ అంశంలో చంద్రబాబు వైఎస్ఆర్సీపీ నేత మీద ఒకటి రెండు అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేయడం మాత్రం పూర్తిగా అప్రజాస్వామికం. ఈ వ్యాఖ్యలలో ప్రధానమైనది- ప్రతిపక్ష నేతను పరోక్షంగా ‘క్రిమినల్’ అని ప్రకటించడం. ఏ కోర్టూ- కింది కోర్టుగానీ, రకరకాల కేసులు (‘దేశం’ నాయకుడు ప్రేరేపించగా నమోదు చేసినవి) నడుపుతున్న సీబీఐ గానీ, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇంతవరకు ప్రతిపక్ష నేతపై ఆర్థిక కారణాలతో శిక్షను ఖరారు చేయలేకపోయాయి. చివరికి ఆ కేసులన్నీ ఏమైనాయో నివేదించేవారే ఇప్పుడు కరువయ్యారు. పైగా జగన్, ఆయన పార్టీ ఉప ఎన్నికలలోను, సాధారణ ఎన్నికలలోను టీడీపీకి బలమైన పోటీ ఇస్తూ గణనీయమైన విజయాలు సాధిస్తూ వచ్చింది. చంద్రబాబు మాత్రం బూటకపు ఐఎంజీ కంపెనీకి భూకేటాయింపులకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలు ఒక కొలిక్కి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే మాటకూ, ఆచరణకూ అందకుండా తప్పించుకుంటున్న నాయకునిగా చంద్రబాబు మిగిలారు. మాట నిలుపుకోని ఫలితం కుల వ్యవస్థ లేకపోతే రిజర్వేషన్ల ప్రసక్తే రాదు. అయినా కులం ఒక వ్యవస్థగా పాతుకుపోవడానికీ, రాజ్యమేలడానికీ కారణం అందరికీ తెలిసిన రహస్యమే. దానిని బహిర్గతం చేయడానికి మాత్రం జంకు. ముద్రగడ విమర్శ అంతా దేని మీద? ఎన్నికల ప్రయోజనాల కోసం, ఓటర్లను ఆకట్టుకునే ‘వశీకరణ’ మంత్రంగా రిజర్వేషన్లు తయారైనాయి. చంద్రబాబు తమ పార్టీ మేనిఫెస్టోలో కాపులను బీసీ జాబితాలో చేరుస్తానని హామీ ఇచ్చారు. దానిని నెరవేర్చకుండా మాటలతో డొల్లిస్తున్న సందర్భంలోనే ముద్రగడ సారథ్యంలో కాపుల సమీకరణ మహోద్యమ రూపం తీసుకోవలసి వచ్చింది. పైగా కొత్త ప్రభుత్వ హయాంలోనే కాపుల ఉద్ధరణకు రూ. 1,000 కోట్లు కేటాయిస్తానని చెప్పి, రూ. 100 కోట్లకు పరిమితమయ్యారు. అంతేకాకుండా, ఆ వర్గంలో చీలిక కోసం ఒకరిని బుజ్జగించి తలాతోకా లేని ఒక కార్పొరేషన్‌కు అధ్యక్షునిగా ప్రకటించారు. మొత్తంగా బీసీ జాబితాలో చేర్చి, రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలన్న డిమాండ్‌ను నెరవేర్చడంలో విఫలమయ్యారు. చంద్రబాబు మరోసారి మాట తప్పినందుకు ఆ వర్గం ఉద్రిక్తతకూ, ఉద్వేగానికీ లోను కాక తప్పలేదు. రుణమాఫీ విషయంలో, రాజధాని పేరుతో బలవంతంగా లేదా బుజ్జగింపులతో, ఇంకా కొన్ని భూములలో పంటలను ధ్వంసం చేసైనా సరే, ప్రజలను ఇబ్బంది పెడుతూ కోర్టులకు ఎక్కించేదాకా ఎలా వదలడం లేదో, కాపుల విషయంలో కూడా అంతే జరుగుతోంది. కాంగ్రెస్ కూడా యూపీఏ -2 సహా కులాల వర్గీకరణ, వారి సమస్యల పరిష్కారం విషయంలో నాన్పుడు ధోరణి వహించడం వల్లనే ఉద్రేకాలు ప్రబలుతూ వచ్చాయి. ఇది నిజం కాకుంటే సంజీవయ్య, విజయభాస్కరరెడ్డిల హయాంలలో కాపుల డిమాండ్లను ఆమోదిస్తూ జీవోలు తెచ్చినప్పటికీ ఇంతకాలం అమలు జరక్కుండా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? మధ్యలో బ్రహ్మానందరెడ్డి కాపుల బీసీ హోదాను ఎందుకు తొలగించినట్టు? బీజేపీ హయాంలో కూడా రిజర్వేషన్ల సమస్య ఒక కొలిక్కి రాకుండా ఎందుకు జాప్యం చేస్తున్నట్టు? అలాగే ఎన్టీఆర్ పాలన తొలిరోజులలో ఉద్యోగాలకు చేసే దరఖాస్తులలో ఏ వర్గమూ తమ కులాన్ని పేర్కొనకుండా ఉండాలన్న ప్రతిపాదన ఏ ఉద్దేశంతో చేసినట్టు? అయినా అది ఎందుకు అమలులోకి రాలేదు? ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, దాటాక బోడి మల్లయ్య వ్యవహారంగా రిజర్వేషన్ల వ్యవహారం మారుతోంది. నేనూ నా కులం భారత జనాభాలో అగ్రవర్ణాలుగా ముద్రపడిన వారి సంఖ్య స్వల్పమనీ, ఉపజాతులూ, ఉప కులాలూ, అట్టడుగు వర్గాలూ, ఆదివాసీలూ, ఎత్నిక్ గ్రూపులూ అధిక సంఖ్యాకులనీ ఒక వాదన. ‘ఇండియాలో పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, అపశ్రుతులు లేని కులం ఏదీ లేదు. పరిశుద్ధమైన కులం అనేది ఒక భ్రమ. కల్పిత గాథ మాత్రమే’ అని ఇటీవలనే జాతీయ శాస్త్ర విజ్ఞాన పరిషత్ నివేదికలు నిగ్గు తేల్చాయి. విభజనతో కూడిన కుల వ్యవస్థకు 1500 సంవత్సరాలకు మించి వయసు లేనేలేదనీ, అంతకు ముందు కుల వ్యవస్థ లేదనీ ఆ నివేదిక చెప్పింది. ఈ పరిణామం జన్యుకణాల చరిత్రను ప్రభావితం చేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేల సంవత్సరాల వంశపారంపర్యపు తబిశీళ్లను పరిశీలించిన తరువాత కొసమెరుపుగా వచ్చిన నిర్ణయమిది. మన దేశంలోని దౌర్భాగ్యపు కుల వ్యవస్థకు గల పునాదులను శాస్త్రీయంగా విశ్లేషించిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, ‘కుల వ్యవస్థ ఉనికి, ఊపిరి అంతా సమాజాన్ని అంతకు ముందు లేని కులాలు, ఉప కులాల కింద విభజించి, నిలువునా చీల్చి అసమానతల దొంతర్లు పేర్చడంలో ఉంది. కింది వర్గాల వారిని అధికార స్థానాలలోకి రాకుండా చేయడం, వారికి విద్య, ఉపాధి అవకాశాలను దూరం చేయడం, ఆస్తిపాస్తులు సమకూర్చుకోకుండా అడ్డంకులు కల్పించడం, స్త్రీలను అణచివేతకు గురిచేయడం మతాచార్యుల అభిమతంగా ఉండేది. హిందూ మతగ్రంథాలన్నీ దాదాపుగా మతాచార్యుల సృష్టే. నిరక్షరాస్యులను అమాయకత్వంలో, పేదరికంలో తొక్కి పట్టి ఉంచడమే మతాచార్యుల సిద్ధాంతమూ, తాత్విక పునాది’ అన్నాడు. వర్గ, వర్ణ (కుల) రహితమైన ఆది హైందవంలోని మంచిని సర్వజనులు సుఖంగా ఉండాలన్న అభ్యుదయకర కోణాలను అనంతర కాలాల్లో మతాచార్యుల వర్గమే చంపుతూ వచ్చిందని కూడా అంబేడ్కర్ విమర్శించారు. నేనూ, నా కులం అన్న భావనే అన్ని రకాల ఆర్థిక పురోగతికి ఆటంకమని కూడా ఆయన అన్నారు. వ్యవసాయ తదితర రంగాలలోనూ సమష్టి కృషికి ప్రతిబంధకంగా ఉండే హానికర పరిస్థితులను కూడా కులతత్వం సృష్టిస్తుంది. ఇలా కుల సంబంధాల మీద ఆధారపడి సాగే గ్రామీణాభివృద్ధి సోషలిస్టు సూత్రాలకే పరమ విరుద్ధం అని ఆయన అన్నాడు. దున్నేవారికే భూమిని పంచాలి. అప్పుడు కాని మన పట్టణాలు, నగరాల త్వరితగతి పురోగతి సాధించాలంటే సమష్టిగా ఉత్పత్తి కార్యకలాపాల నిర్వహణ వల్లనే సాధ్యమని కూడా అంబేడ్కర్ ప్రతిపాదించారని మరువరాదు. మన పట్టణాల, నగరాల త్వరితగతి పురోగతి సమష్టి ఉత్పత్తి కార్యకలాపాల నిర్వహణవల్లనే సాధ్యమని కూడా అంబేడ్కర్ ప్రతిపాదించారు. జాతి మాట - ఒక స్పృహ కాపు నాయకులకు ఇక్కడొక హెచ్చరిక చేయవలసి ఉంటుంది. వీరు తరచూ కులాన్ని ‘జాతి’గా వర్ణించుకుంటున్నారు. అది తప్పు. జాతి శబ్దానికి విస్తృతార్థం ఉంది. ఒక దేశాన్ని ఒకే జాతిగా భావిస్తాం గానీ, కులాన్ని జాతిగా పేర్కొంటే అర్థం చాలా దూరం వెళుతుంది. ‘కుల వ్యవస్థ రద్దునే ఆరోగ్యవంతులు కోరుకుంటున్న తరుణంలో, మళ్లీ జాతినీ, ఉపజాతులనీ వెతుక్కునే ప్రయత్నం సమాజ సమష్టి జీవనానికీ, ప్రయోజనకరమైన ఉమ్మడి వారసత్వాన్ని స్థిరపరచడానికీ విరుద్ధమని అందరం గ్రహించాలి. ఈ అవగాహన లేకనే చంద్రబాబు సహితం గందరగోళంలో పడి, తన అవకాశవాద ఎత్తుగడ ద్వారా జనాన్ని కూడా గందరగోళంలోకి నెడుతున్నారు. జగన్ సలహా మీదనే తాను హామీలిచ్చినట్టు బాబు పరోక్షంగా భావిస్తున్నట్టు ఉంది. ఇంతకూ అసలు క్రిమినల్ ఎవరు? దొరికితే ఆలోచిద్దాం. అసలు ఓటుకు కోట్లు కేసులో దొంగెవరో తేలితే, మాట తప్పే క్రిమినల్ కూడా దొరికిపోతాడు. సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in -
ఇది బాధ్యతారాహిత్యం
సమస్య వచ్చిపడినప్పుడు వ్యవహరించే తీరులోనే పాలకుల సమర్ధత బయటపడుతుంది. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని తునిలో ఆదివారం చోటుచేసుకున్న దురదృష్టకర పరిణామాలు నిరూపించాయి. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను బీసీల్లో చేర్చాలని...ఆ కులాల సంక్షేమానికి ఏడాదికి వేయి కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో అక్కడ జరిగిన ‘కాపు ఐక్య గర్జన’ సదస్సుకు లక్షలాదిమంది తరలివచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి చెందిన నేతలతోసహా వివిధ పార్టీలవారు ఆ సదస్సుకు హాజరయ్యారు. రాస్తారోకో, రైల్ రోకోలకు ముద్రగడ పిలుపునిచ్చిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి నిప్పుపెట్టడం, పోలీసు వాహనాలను దహనం చేయడం, పోలీస్స్టేషన్లపై దాడి వంటివి సంభవించాయి. ఇంతమంది గుమిగూడతారని తెలిసి కూడా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన చంద్రబాబు...రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ ఉదంతాన్ని ఉపయోగించుకోవాలని చూడటం...ప్రత్యర్థులపై బురదజల్లడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పరిణామాలకు దారితీసిన తన బాధ్యతారాహిత్యాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుకోలేదు. తమను బీసీల్లో చేర్చాలన్న కాపుల డిమాండ్ ఈనాటిది కాదు. దానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఇప్పుడు జరిగిన కాపు ఐక్య గర్జనకు బోలెడు నేపథ్యం ఉంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాపు తదితర కులాలను బీసీల్లో చేరుస్తామని టీడీపీ స్పష్టమైన వాగ్దానం చేసింది. అధికారానికొచ్చిన ఆరునెలల్లో అందుకోసం కమిషన్ ఏర్పాటు చేయడంతోపాటు ఆ కులాల సంక్షేమం కోసం కార్పొరేషన్‌ను నెలకొల్పి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. అప్పటికి రాష్ట్రం విడిపోయిందన్న అవగాహన బాబుకుంది. అయినా ఆయన హామీలిచ్చారు. వాటిని నమ్మి కోస్తాంధ్రలో...మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపులు టీడీపీకి అండగా నిలిచారు. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో టీడీపీ... కేవలం 5 లక్షల ఓట్ల ఆధిక్యతతో అధికారాన్ని పొందగలిగిందంటే అది ఆ వర్గం చలవే. అందుకు కృతజ్ఞతగా వారికిచ్చిన హామీలను నిండు హృదయంతో నెరవేర్చవలసి ఉండగా ఆ కర్తవ్యాన్ని బాబు పూర్తిగా విస్మరించారు. రైతులూ, డ్వాక్రా మహిళలు, చేనేత వర్గాలవారి రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ తరహాలోనే కాపులకిచ్చిన హామీకి కూడా ఆయన ఎగనామం పెట్టారు. గద్దెనెక్కాక కాపుల గురించి, వారికిచ్చిన హామీల గురించి ఆయన మాటవరసకైనా ప్రస్తావించలేదు. ఈ క్రమంలో నిరుడు జూలైలో ముద్రగడ తొలిసారి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ‘మాకిచ్చిన హామీల సంగతి ఏమైంద’ని ప్రశ్నించారు. ఈ క్రమంలో మరో నాలుగైదు లేఖలు రాసినా పట్టనట్టున్న బాబు జనవరి 31న తునిలో సదస్సు నిర్వహించబోతున్నట్టు ముద్రగడ ప్రకటించాక కదిలారు. కాపుల కార్పొరేషన్ ఏర్పాటుచేసి దానికి రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. కాపుల కోటా కోసం జస్టిస్ మంజునాథ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటుచేస్తామన్నారు. ప్రజాస్వామ్యం ఎవరి జాగీరూ కాదు. లేఖలు వారిద్దరి ప్రైవేటు వ్యవహారం అసలే కాదు. ప్రజల సమస్యల గురించి తెలిపినప్పుడు ఆ సమస్యపై ప్రభుత్వ వైఖరేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులకు ఉంటుంది. కాపుల్ని బీసీల్లో చేరిస్తే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని బీసీ నేతలు ఆందోళన పడుతుండగా...వారి కోటా జోలికి పోకుండా తమకు అదనంగా కేటాయించాలని కాపులు కోరుతున్నారు. అందులో సాధకబాధకాలేమిటో, తాను తీసుకోదల్చిన చర్యలేమిటో బాబు తేటతెల్లం చేసి ఉండాల్సింది. విపక్షాలతోసహా అన్ని వర్గాలనూ పిలిచి మాట్లాడవలసింది. ఆయన ఆ పని చేయలేదు. కనీసం కమిషన్ కిచ్చిన మార్గదర్శకాలేమిటో కూడా ఇంతవరకూ వెల్లడించలేదు. కాపుల కార్పొరేషన్‌కు ఇప్పటివరకూ ఇవ్వాల్సిన రూ. 2,000 కోట్ల మాటేమిటో చెప్పలేదు. ఈ మాత్రం చేయడానికైనా ఏడాదిన్నరకుపైగా సమయం ఎందుకు తీసుకోవాల్సివచ్చిందో అసలే వివరించలేదు. కనీసం కాపు ఐక్య గర్జన సభనైనా సజావుగా నిర్వహించుకోనివ్వకుండా అనేక అడ్డంకులు కల్పించారని ముద్రగడ అంటున్నారు. ఆ సంగతలా ఉంచి పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యేచోట తగిన పోలీసు బందోబస్తు ఉండాలన్న స్పృహ కూడా లేనట్టు ప్రభుత్వం ప్రవర్తించింది. ఘటన జరిగాక ఎవరెవరిపైనో నెపం వేసేవారు ముందు జాగ్రత్త చర్యలెందుకు తీసుకోలేదో... నిఘా యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడంలో ఎందుకు విఫలమయ్యారో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. నిజానికి కాపుల సమస్య ఒక్క కోటాకు సంబంధించినదో, కార్పొరేషన్‌కు సంబంధించినదో మాత్రమే కాదు. చంద్రబాబు సర్కారు ఇంతవరకూ తీసుకున్న అనేక నిర్ణయాలకు సంబంధించిన దుష్ఫలితాలు వారు అనుభవిస్తున్నారు. రుణ మాఫీ మొదలుకొని గోదావరి జలాల మళ్లింపునకు ఉద్దేశించిన పట్టిసీమ ప్రాజెక్టు వరకూ...రాజధాని భూముల స్వాధీనంవరకూ ప్రభుత్వ నిర్ణయాలవల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ వర్గం ఇబ్బందులు పడుతోంది. భూమిని నమ్ముకుని బతుకుతున్న వర్గం కనుక ఈ నిర్ణయాల ప్రభావం ఆ వర్గంపై ప్రగాఢంగా ఉంది. కాపు ఐక్య గర్జనకు భారీ సంఖ్యలో జనం తరలిరావడానికి ఇలాంటివన్నీ తోడ్పడ్డాయి. కనుక తుని ఉదంతంలో స్వీయ వైఫల్యాలనూ, తప్పుడు నిర్ణయాలనూ సమీక్షించుకోవాల్సిన బాధ్యత బాబు సర్కారుపై ఉంది. అందుకు భిన్నంగా ఎవరిపైనో బురదజల్లాలను కోవడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం అసమర్ధతే అనిపించుకుంటుందని చంద్రబాబు గుర్తించాలి. -
'చంద్రబాబే బాధ్యుడు'
ఉయ్యూరు (కంకిపాడు): తుని ఘటనకు పూర్తి బాధ్యుడు సీఎం చంద్రబాబే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలోని చర్మకారులను సోమవారం ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై నేరం నెట్టే యత్నం చేస్తూ బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని ఆరోపించారు. దమ్ముంటే కుట్ర కేసులు పెట్టాలని సవాల్ చేశారు. కాపు ఐక్య గర్జనను విఫలం చేసేందుకు చంద్రబాబు, అధికార పక్షం సాయశక్తులా కృషి చేయడం వల్లే ఆగ్రహించిన కాపులు విధ్వంసానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. గర్జన వేదికపై టీడీపీ తప్ప అందరు నేతలూ ఉన్నారన్నారు. బాధ్యతను విస్మరించి ప్రతిపక్ష నేతపైనా, పులివెందుల రౌడీలు అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వాగ్దానాన్ని విస్మరించడమే కాకుండా, మాదిగ వ్యతిరేక శక్తులను పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. తుని ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, విధ్వంసానికి కారకులు ఎవరో తేలిపోతుందని స్పష్టంచేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు ఇచ్చిన మాట నెరవేర్చకపోతే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ మాదిగలు సత్తా చాటుతారని, ఆగ్రహాన్ని తట్టుకోలేరని కృష్ణమాదిగ హెచ్చరించారు.