
కృష్ణ భార్య లక్ష్మికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేస్తున్న మంత్రి రాజా
తుని: కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరానికి చెందిన టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ మాజీ సభ్యుడు కె.కృష్ణకు లివర్ వ్యాధి చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.20 లక్షలు మంజూరు అయింది.
ఇందుకు సంబంధించిన ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణ భార్య లక్ష్మికి అందజేశారు.
కొంతకాలంగా కృష్ణ లివర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని ఏఎంసీ మాజీ చైర్మన్ మురళి మంత్రి రాజా దృష్టికి తీసుకొచ్చారు. విశాఖపట్నం మణిపూర్ ఆస్పత్రిలో కృష్ణకు వైద్య సేవలు అందిస్తున్నారు. తమ ప్రభుత్వం పథకాలతో పాటు వైద్య సేవలను పార్టీలకు అతీతంగా అందిస్తున్నదని మంత్రి రాజా అన్నారు.
చదవండి: Fact Check: బురద రాతలే పునరావృతం
Comments
Please login to add a commentAdd a comment