![Minister Dadisetti Raja Takes On Chandrababu Naidu - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/3/Minister%20Dadisetti%20Raja.jpg.webp?itok=in2UAInw)
కాకినాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. పనిగట్టుకుని పోలవరంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నది చంద్రబాబేనని విమర్శించారు దాడిశెట్టి రాజా.
పోలవరం మీద చంద్రబాబు కొత డ్రామాకు తెరతీశారని, ఆయన హయాంలో పేదలకు చేసేందేమీ లేదనే విషయం గుర్తించుకుంటే మంచిదన్నారు. మేనిఫెస్టోను దాచేసి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment