
సాక్షి, తాడేపల్లిరూరల్/మంగళగిరి/తుని: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ప్రభుత్వ విప్, తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజుల క్రితం ఆర్కే తండ్రి దశరాథరామిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్కే మంగళవారం కరోనా పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ అని తేలడంతో 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తనను ఈ మధ్య కలిసిన వారు పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్కే బుధవారం ఒక ప్రకటనలో కోరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందటానికి తాను విశాఖపట్నానికి వెళ్లినట్లు రాజా చెప్పారు.