
సాక్షి, తూర్పుగోదావరి: ప్రతిపక్షనేత చంద్రబాబుపై ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తనను తాను జూమ్ యాప్ సీఎంగా ప్రమోట్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాకినాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబూ మీరు లూటీ చేసిన రూ.3 లక్షల కోట్లు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు పంచండి. కరోనా సమయంలో పొరుగు రాష్ట్రంలో దాక్కున్న ఆయన తన మాజీ మంత్రులు, తాబేదార్లతో అవ్వాకులు చవాకులు మాట్లాడించడం సరైన పద్దతి కాదు’అని హితవు పలికారు.
(చదవండి: ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి : సీఎం జగన్)
‘కేంద్రం మూడు లక్షల రాపిడ్ టెస్ట్ కిట్లు కొంటే.. మన రాష్ట్రం లక్ష కిట్లు కొనుగోలు చేసింది. దీన్ని బట్టే కరోనా నివారణ కోసం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పని చేస్తుందో ప్రజలకు అర్ధమవుతోంది. కరోనా నివారణ చర్యల కోసం ప్రాణాలకు తెగించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ప్రజల మధ్యలో ఉండి వారి బాగోగులు చూసుకుంటున్నారు. కానీ ఇనాళ్లు రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకుతిన్న టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు ఎక్కడ దాకున్నారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా’అని రాజా పేర్కొన్నారు.
(కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా?)
Comments
Please login to add a commentAdd a comment