
సాక్షి, అమరావతి: వ్యాక్సిన్, కరోనా కట్టడి చర్యలపై దుష్ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చంద్రబాబు, ఒక వర్గం మీడియా ప్రచారాలపై ఫిర్యాదుల నేపథ్యంలో చట్టప్రకారం చర్యలకు ఉపక్రమించింది. దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోనుంది. విపత్తు సమయంలో దురుద్దేశ పూర్వక ప్రచారాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
వాస్తవాలను మరుగునపరిచి, ప్రజలను తప్పుదోవపట్టించేలా వ్యాక్సినేషన్‌పై కథనాలు, ప్రచారాలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా తప్పుడు ప్రచారాలు , విపత్తు సమయంలో సేవలందిస్తున్న సిబ్బంది నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేస్తోన్న దుష్ప్రచారాలపై ఏపీ ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకోనుంది.
చదవండి: వ్యాక్సినేషన్‌లో అందరికీ ఆదర్శంగా ఏపీ
ధైర్యం చెప్పకుండా దుష్ప్రచారమా?