
యనమల అనే ముసలి నక్క ఆంధ్రజ్యోతిలో తనపై అసత్య కథనాలు రాయిస్తున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు.
సాక్షి, కాకినాడ జిల్లా: యనమల అనే ముసలి నక్క ఆంధ్రజ్యోతిలో తనపై అసత్య కథనాలు రాయిస్తున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తునిలో గృహ సారధులు, వార్డు కన్వీనర్లతో మంత్రి దాడిశెట్టి శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చిన వార్తనే మళ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
రాధాకృష్ణ.. యనమల రామకృష్ణుడికి చెంచానో.. యనమలకు రాధాకృష్ణ చెంచానో అర్థం కావడం లేదన్నారు. ‘‘కోటనందూరులో నాకు, నా కుటుంబసభ్యులకు ఎకరం భూమి ఉన్నా.. అది యనమలకు, రాధాకృష్ణకు రాసిస్తానని’’ మంత్రి సవాల్ విసిరారు. దేశంలో ఉన్న ప్రముఖ నగరాల్లో యనమలకు ఆస్తులు ఉన్నాయని మంత్రి దాడిశెట్టి అన్నారు.
చదవండి: బాబు కొత్త అవతారం.. ఫ్రీగా వరాలిస్తున్న చంద్రం బాబా..