సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, బీసీ, కాపులను అణివేసే ధోరణీ జరుగుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటోందని విమర్శించారు. గత వైఎస్ జగన్ హయంలో ధాన్యం ధర రూ.2వేలు ఉంటే.. చంద్రబాబు పాలనలో రూ.1400 లకే రైతులు అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులకు ఫీజు రింబయిర్స్‌మెంట్ చెల్లించాలని, లేదంటే వైఎస్సార్‌సీపీ తీవ్రమైన ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.
ఈ మేరకు శుక్రవారం దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. కాకినాడ సెజ్‌లో తాను ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. మార్కెట్ మీద హెచ్చు రేటు పెట్టి భూములను రైతుల నుంచి కొనుక్కున్నానని చెప్పారు. 1940 నుంచి తమ కుటుంబం బంగారం వ్యాపారంలో ఉందన్నారు. తన దగ్గర డబ్బులు ఉండటం వల్లే రైతులు అమ్మిన భూములు కొన్నుకున్నట్లు పేర్కొన్నారు.
‘చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదేదో తప్పులా అసత్య ప్రచారాలు చేశాయి. ఆ మధ్య చంద్రబాబు భూములు కొనుక్కున్నారు. ఇటీవల పిఠాపురంలో 15 ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఈ పది రోజుల కాలంలో రెండు ఆస్ధులను యనమల రామకృష్ణుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, యనమల కొన్న ఆస్ధులు ప్రజల దగ్గర దోచుకున్నవే అని నేను ఆరోపించగలను.
ఒక్క బకెట్ బురద చల్లేస్తే సరిపోతుందా?. వైఎస్సార్‌సీపీలో ఉన్నాం కాబట్టి మేము ఆస్ధులు కొనుక్కోకూడదా?. యనమల మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో రూ. రెండు లక్షలు లేకపోతే రైతు సంఘాలు ఖర్చులు బరించి గెలిపించాయి. ఇవాళ యనమల దగ్గర వేలాది కోట్ల ఆస్ధులు ఉన్నాయి. ఆ ఆస్ధులన్ని పేదలకు పంచిపెట్టాలి’ అని తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment