చంద్రబాబు ఆస్కార్‌ కోసమే పవన్‌ రాజకీయ డాన్స్‌  | Dadisetti Raja comments on Pavan Kalyan | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఆస్కార్‌ కోసమే పవన్‌ రాజకీయ డాన్స్‌ 

Published Tue, Mar 14 2023 3:33 AM | Last Updated on Tue, Mar 14 2023 3:33 AM

Dadisetti Raja comments on Pavan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: మూడు నెలల తరువాత బయట­కు వచ్చిన పవన్‌కళ్యాణ్‌ తన యజమాని చంద్రబాబు చెప్పినట్టుగా నటించి మంగళవారం సాయంత్రానికి ప్యాకేజీ తీసుకోడానికి సిద్ధపడుతున్నారని రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) చెప్పారు. చంద్రబాబు ఇచ్చే అవార్డే పవన్‌కు ఆస్కార్‌వంటిదని, దానికోసంనాటునాటు పాటకంటే బాగా రాజకీయ డాన్స్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు.

మంత్రి రాజా సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు రాసిన జనసేన రాజ్యాంగంలోని మాటలనే ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్‌ వల్లిస్తారని ఎద్దేవా చేశారు. బీసీలు, కాపులు కలిపి చంద్రబాబుకు రాజ్యాధికారం కల్పించాలన్నట్టుగా, బాబు పల్లకీ మోయాలని, లేదంటే బానిసలే అన్నట్టుగా దత్తపుత్రుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 18 లోక్‌సభ స్థానాల్లో ఒక్కటి కూడా బీసీలకు ఎందుకివ్వలేదని నిలదీశారు.

వైఎస్సార్‌సీపీ ఓట్లను చీల్చా­లనే 2019లో ప్రతి అసెంబ్లీ, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక అజెండా పెట్టుకున్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబే అని తన పుస్తకంలో రాసిన హరిరామ జోగయ్య... ఇప్పుడు చంద్రబాబు గూటిలో దూరేందుకు సిద్ధంగా ఉన్నాననడం సిగ్గుచేటన్నారు. జోగయ్య పెట్టిన కాపు సేవా సమితి పేరును కమ్మ సేవా సమితి అని మార్చుకుంటే సరిగ్గా సరిపోతుందన్నారు.

చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల­ని డిమాండ్‌ చేస్తూ కాపులు రోడ్డెక్కితే రకరకాల కేసు­లు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అయినా పవన్‌ మ­ళ్లీ కాపులను గంపగుత్తగా చంద్రబాబు కాళ్ల దగ్గర పడేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీ­డీï­³, జనసేన ఎన్ని కుట్రలు చేసినా 2024­లో ప్ర­జ­లు వైఎస్సార్‌సీపీని గెలిపించడం ఖాయమన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement