
సాక్షి, కాకినాడ: చంద్రబాబుకు కష్టం వచ్చినపుడు కొమ్ము కాసేందుకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడని రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. జనాన్ని జనసేన వైపు చూడమంటాడు.. ఈయనేమో టీడీపీ వైపు చూస్తాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు కాకినాడలో మంత్రి రాజా మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న ఏపీలో అలజడులు సృష్టించేందుకే పవన్, చంద్రబాబు, లోకేష్‌లు ఏపీకి వస్తున్నారు. ఎమ్మెల్యే కూడా కాలేని పవన్ సీఎం జగన్‌పై చాలా ఛాలెంజ్‌లు చేశారు.
కాపులు ఎవరూ కూడా పవన్‌ని నమ్మే స్థితిలో లేరు. పవన్‌కి ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లే అని కాపులకు తెలుసు. తుని ఘటనలో కాపులను అనేక చిత్ర హింసలను గురిచేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి మళ్లీ కాపులను తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లా సీఎం జగన్‌కు కుల మతాలతో రాజకీయాలు చేసే అలవాటు లేదు. జనసేన పార్టీని ఎందుకు నమ్మాలో చెప్పలేని దిక్కుమాలిన స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారంటూ మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: (వామ్మో 'బాబు' ఆణిముత్యాలు వింటే షాక్ అవ్వాల్సిందే..)