![YSRCP Ministers Serious Comments On TDP Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/20/Jogi-ramesh12.jpg.webp?itok=fW9Wxt_I)
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రులు సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు పదవీ వ్యామోహంతో పిచ్చి పట్టిందన్నారు. చంద్రబాబుది అంతా కబ్జాలు, అబద్దాల బాగోతమే అంటూ విమర్శలు చేశారు.
కాగా, మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. సెప్టెంబర్ నుంచి విశాఖ నుండే పరిపాలన కొనసాగుతుందన్నారు. చంద్రబాబు మళ్లీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. చంద్రబాబుది అంతా కబ్జాలు, అబద్దాల బాగోతమే. హామీలు నెరవేర్చలేదు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపించారు. సంస్కారం లేకుండా చంద్రబాబు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడు. రామ్మోహన్‌నాయుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు పదవీ వ్యామోహంతో పిచ్చి పట్టింది. చంద్రబాబు 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేని దద్దమ్మ. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయాలి. 2024 ఎన్నికల్లో మళ్లీ విజయం వైఎస్‌ఆర్‌సీపీదే అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment