బాబూ.. కక్ష సాధింపు ఆనందం వీడాలి: జోగి రమేష్‌ | Ex Minister Jogi Ramesh Serious Comments On Chandrababu Naidu, More Details Inside | Sakshi
Sakshi News home page

నేను చంద్రబాబు ఇంటికి వెళ్లింది అందుకే: జోగి రమేష్‌

Published Fri, Aug 16 2024 3:04 PM | Last Updated on Fri, Aug 16 2024 4:05 PM

Ex Minister Jogi Ramesh Serious Comments On Chandrababu

సాక్షి, ‍మంగళగిరి: ఏపీలో కూటమి నేతలకు రాజకీయ విలువలు లేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్‌. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పాటిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

కాగా, మాజీ మంత్రి జోగి రమేష్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పాటిస్తున్నారు. చంద్రబాబు ఇంటికి ఎందుకు వెళ్లానో విచారణలో చెప్పాను. అయ్యన్న పాత్రుడు.. వైఎస్‌ జగన్‌పై చేసిన విమర్శలకు నిరసన చేసేందుకు వెళ్ళాను. అయితే, నాపై దాడి చేసి.. మళ్లీ నా మీదనే కేసు పెట్టారు. అధికారం ఎవరికీ శాశ్వత కాదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. ఏపీలో చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుంది. కక్ష ఉంటే నాపై తీర్చుకోవాలి. నా కొడుకుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు.

కూటమి నేతలకు రాజకీయ విలువలు లేవు. హామీలు అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ అమలు చేస్తే ప్రజలు సంతోషిస్తారు. మంచి పాలన చేయాలని కానీ.. కక్ష సాధించడం సరికాదు. ఇటువంటి ఆనందాన్ని చంద్రబాబు వీడాలి. కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నా కొడుకుని అగ్రిగోల్డ్  భూముల కేసులో ఇరికించారు. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా మేము కొనుగోలు చేయలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సత్య ప్రసాద్  దగ్గరకు నేనే వచ్చి అగ్రిగోల్డ్ గురించి వివరిస్తా.

లోకేష్ రెడ్ బుక్ తీస్తే ఏమి అవుతుంది?. వైఎస్సార్‌సీపీని అడ్డుకోవాలని చూస్తే సాధ్యం కాదు. మళ్ళీ నన్ను విచారణకు రమ్మని పిలవలేదు. 2002 నుంచి ఒకటే ఫోన్ నెంబర్ వాడుతున్నా. నేను మళ్ళీ విచారణకు రమ్మంటే వస్తాను. వారు అడిగే అన్ని ​ప్రశ్నలకు సమాధానం చెబుతాను. ఇప్పుడు మీరు పరుష పదజాలం వాడితే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోండి. నాకు పార్టీ సపోర్ట్ ఉంది. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాను. తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వేధించాలని చూస్తుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement