
సాక్షి, కాకినాడ: టీడీపీ హయాంలో చంద్రబాబు, యనమల రామకృష్ణుడు కలిసి ఎన్నో చీకటి జీవోలు తెచ్చి ప్రజల గొంతు నొక్కారని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. యనమలకు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రాణాలు పోతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా?. చంద్రబాబు పబ్లిసిటి పిచ్చికి ఈ రోజుకి 40 మంది ప్రాణాలు పోయాయి. ఇరుకు సందుల్లో మీ వాహనాలు పోనిచ్చి ప్రజలు తొక్కిసలాటకు గురి కావడాన్ని ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.
సీఎం జగన్ పాదయాత్ర ఒక చరిత్ర. ఈ రాష్ట్ర భవిష్యత్‌ను మార్చిన పాదయాత్ర అది. ప్రతి ఆవారా చేస్తే అది పాదయాత్ర అవ్వదు. కొవ్వు కరిగించుకునే యాత్ర అవుతుంది. టిడిపి కార్యక్రమాల పేరు చెప్పి నెలకు రూ.15 లక్షలు పేద ప్రజల సొమ్ము కాజేసిన ఘనత యనమలది. యనమల.. చంద్రబాబు కంటే తుగ్లక్‌లు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఉండరు అంటూ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు.
చదవండి: (చంద్రబాబు కుప్పం పర్యటనలో ఓవరాక్షన్‌పై ఎమ్మెల్సీ భరత్ ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment