సాక్షి, తూర్పుగోదావరి : నాలుగేళ్లలో తుని పట్టణానికి ప్రభుత్వం చేసిందేమి లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుని అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కనీసం రూ. 5కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ కోట నందురు మండలం జూనియర్ కాలేజీ లేదన్నారు. నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని చూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. చినుకు పడితే తుని పట్టణం వరదలో మునిగిపోయేలా ఉందన్నారు. టీడీపీ నాయకులు అభివృద్దిని పక్కకు పెట్టి అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment