ఫైల్ ఫోటో
సాక్షి, రాజమహేంద్రవరం: కరోనా లక్షణాలున్నా భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదు. పాజిటివ్ వచ్చినా ఆస్పత్రి ఐసోలేషన్‌లోనే ఉండాలనే నిబంధన ఏమీ లేదు. పాజిటివ్ వచ్చిన రోగులను ప్రస్తుతం యునైటెడ్ కింగ్ డమ్ వంటి దేశాల్లో హోం క్వారంటైన్‌కు అనుమతిస్తున్నారు. ఇంత వరకూ అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే పాజిటివ్ కేసులను హోం క్వారంటైన్‌కు అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఆయా దేశాలలో అన్ని వసతులతో కూడిన ఏర్పాట్లు, వైద్య సదుపాయాలకు అనువైన పరిస్థితులు ఉండటంతో పాజిటివ్ కేసులను కూడా హోం క్వారంటైన్‌కు పచ్చ జెండా ఊపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలి సారి కోవిడ్–19 ప్రోటోకాల్ పాటించే రీతిలో అన్ని వసతులు ఉన్నట్టయితే పాజిటివ్ వచ్చినప్పటికీ విదేశాల్లో మాదిరిగా హోం క్వారంటైన్‌కు అనుమతించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. (లాక్‌డౌన్ ఉల్లంఘనులపై కేసులు)
రాష్ట్రంలో తొలి సారి మన జిల్లాలోని రాజమహేంద్రవరంలో ఈ ప్రక్రియకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. చెన్నై నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఒక మహిళకు పాజిటివ్ రావడం, ఆమెతో పాటు మరో ఇద్దరు కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని తేలింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ డి మురళీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ«ధికారులు రాజమహేంద్రవరంలోని వారిని హోం క్వారంటైన్‌కు అనుమతిచారు. వారి ఇంట్లో ఎవరికి వారికి ప్రత్యేకంగా అటాచడ్ వాష్ రూమ్‌లు, ప్రత్యేక గదులు ఉన్నాయంటేనే పాజిటివ్ వచ్చినా హోం క్వారంటైన్‌కు అనుమతించనున్నారు. సౌకర్యాలను వైద్యుల బృందం పరిశీలించి సంతృప్తి చెందాకనే హోం క్వారంటైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. (సుస్తీ లేని బస్తీలు)
కరోనా లక్షణాలున్న వారు కనీసం పరీక్షలు చేయించుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. పరీక్షలు చేయించుకుని పాజిటివ్ అని నిర్థారణ అయితే తొలి దశలో కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ సెంటర్‌లో ఉంచుతారు. ఈ భయంతోనే పలువురు కోవిడ్ పరీక్షలకే వెనుకడుగు వేçస్తున్నారు. ఈ రకంగా గతంలో కత్తిపూడిలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తాజాగా పెదపూడి మండలం గొల్లలమామిడాడలో నమోదైన తొలి మృతి కేసు కూడా పరీక్షలకు వెనుకడుగు వేయడంతోనే కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నాయనే నిర్థారణకు వచ్చారు. గొల్లలమామిడాడలో 53 సంవత్సరాల వ్యక్తి మృతి చెందాకనే పాజిటివ్ అని తేలింది. భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా బయటకు చెప్పకుండా దాచి పెట్టాల్సిన పని లేదనే విషయాన్ని ప్రజలకు అవగాహన కలి్పంచాలనుకుంటున్నారు.
దీనిలో భాగంగా పాజిటివ్ వచ్చినా వారు క్వారంటైన్ సెంటర్, ఐసోలేషన్ వార్డులో ఉంచకుండా ఇంట్లోనే ఉంటూ వైద్యం చేయించుకునే వెసలుబాటు కూడా కల్పిస్తామనే సంకేతాలు ఇవ్వడం ద్వారా అనుమానితులు పరీక్షలకు ముందుకు వస్తారని అధికారులు భావిస్తున్నారు. పాజిటివ్ కేసులకు హోం క్వారంటైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా ఉంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ‘సాక్షిప్రతినిధి’కి ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరంలో పాజిటివ్ కేసులకు తొలిసారి హోం క్వారంటైన్‌కు అనుమతించారు. ఇలా పాజిటివ్ కేసులకు హోం క్వారంటైన్‌కు అనుమతించిన పక్షంలో వారికి 24/7 వైద్య పరీక్షలకు కూడా ఏర్పాట్లు చేస్తారు. ఇందుకు కాకినాడ కలెక్టరేట్‌లో ఉన్న టెలీమెడిషన్ ద్వారా హోం క్వారంటైన్‌లో ఉన్న పాజిటివ్ రోగులకు వైద్య సేవలు పర్యవేక్షిస్తుంటారు. ఇన్ని ఏర్పాట్లు చేస్తోన్న క్రమంలో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment