సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో నెల్లూరు రూరల్ స్థానం నుంచి టికెట్ పొందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి చేరికతో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోయాయి.
వైఎస్సార్ సీపీలో చేరిన అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నిరోజులు ఎందుకు పార్టీలో చేరలేదా అని అనిపించింది. నన్ను నెల్లూరు నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయమన్నారు. అందుకు సిద్ధంగా ఉన్నాను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే మా లక్ష్యం. ఇక పార్టీ మారడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నింటిని నేను రేపు (ఆదివారం) నెల్లూరులోనే మాట్లాడతా.’ అని అన్నారు.
మరోవైపు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగా గీత కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. నవరత్నాల ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని వంగా గీత ఆకాంక్షించారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన వాళ్లు
1.కర్నూలు ఎంపి బుట్టా రేణుక
2. మాగుంట శ్రీనివాసులు రెడ్డి
3. ఆదాల ప్రభాకర్ రెడ్డి
4. మాజీ మంత్రి గూడూరు నియోజక వర్గం బల్లి దుర్గా ప్రసాద్
5. మాజీ ఎమ్మెల్యే వంగా గీత
6. తాడి శకుంతల విజయవాడ మాజీ మేయర్
7. భూమా అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి
8. దారా సాంబయ్య సంత నూతల పాడు, ఆయన కుమార్తె కూడా వచ్చారు
9. డాక్టర్ రాంచంద్రారెడ్డి
అలాగే కొణతాల రామకృష్ణ కూడా వైఎస్ జగన్‌ను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment