సాక్షి, తూర్పుగోదావరి: అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించినట్లే బోస్టన్ కమిటీ నివేదిక వచ్చిందని ఎంపీ వంగా గీత అన్నారు. కాకినాడ మీడియా సమావేశంలో శనివారం ఆమె మాట్లాడుతూ.. మూడు రాజధానులు- రెండు జోన్లు అనే కాన్సెప్ట్‌ను బోస్టన్ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. కమిటీలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నారని తెలిపారు. నేల స్వభావం రీత్యా అమరావతి ప్రమాదకరంగా ఉందని, ఈ విషయం సాధారణ రైతును అడిగినా చెబుతాడని అన్నారు. వ్యయభారం లేకుండా రాజధానిని నిర్మించుకోవాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు.
బాధ తక్కువ.. బాగు ఎక్కువతో రాజధానుల నిర్మాణం జరుగుతుందని వంగా గీత చెప్పారు. సీఎం జగన్ ఎవరి మీద కోపంతోనో, కక్షతోనో ఈ అధికార వికేంద్రీకరణ చేయలేదని, ప్రజల మీద మక్కువతో ఏపీ అభివృద్ధి కోసమే చేస్తున్నారని పేర్కొన్నారు. తప్పకుండా ఇది విజయం సాధిస్తుందని, సీఎం జగన్‌కు ప్రజలంతా నీరాజనాలు పలికి అభినందించే రోజులు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి అనేది ఇప్పుడే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. (చదవండి: మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!)
Comments
Please login to add a commentAdd a comment