సాక్షి, కాకినాడ: దేశంలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం వైఎస్ జగన్ కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల వల్లే మనం క్షేమంగా ఉంటున్నామని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. కరోనా వ్యాధి ఫేజ్-5 ఫీవర్ సర్వేలెన్స్ పోస్టర్ ఆవిష్కరణలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డితో కలిసి ఎంపీ గీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన దానికంటే చాలా ఎక్కువ ఏర్పాట్లు చేసింది. క్వారంటైన్ సెంటర్ ఏర్పాట్ల నుంచి కరోనా నిర్ధారణ పరీక్షల వరకు దేశంలో ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా ఉండేలా సీఎం జగన్ పనిచేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అనుమానాలు ఉంటే స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చదవండి: ప్రభుత్వం మా పల్లెకొచ్చింది
కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా నియంత్రణ కోసం అధికారులు శ్రమ, ప్రజల సహకారం ప్రశంసనీయం. కరోనా నియంత్రణ కోసం సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను కొందరు హేళన చేశారు. అయితే ఇప్పుడు సీఎంజగన్ చేసిన సూచనలను దేశం మొత్తం అనుసరిస్తోంది. సీఎం జగన్ మంచి విజన్ ఉన్న నాయకుడు అంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రజలకు సూచించారు. పాజిటివ్ వస్తే కారంటైన్, ఐసోలేషన్‌లో ఉండాలి అనే అపోహలను విడనాడాలి. సదుపాయాలు ఉంటే ఇంట్లోనే ఉండి కరోనా చికిత్సను పొందవచ్చు. జి. మామిడాడలో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి చేసిన నిర్లక్ష్యం వల్ల అక్కడ 50కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదోసారి ఇంటింటికీ సర్వే కోసం వస్తున్న వాలంటీర్లకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. చదవండి: ఏపీలో మరో 48 కరోనా కేసులు..
Comments
Please login to add a commentAdd a comment