షర్మిల తాజా ట్వీట్‌కు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వంగా గీత కౌంటర్
సాక్షి, అమరావతి: ‘తల్లికి వందనం’ కార్యక్రమంపై రెండ్రోజుల క్రితం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గత వైఎస్సార్‌సీపీ సర్కారును విమర్శించగా.. అదే రోజు వైఎస్సార్‌సీపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. దీనికి కొనసాగింపుగా ఆమె మళ్లీ శనివారం ‘ఎక్స్’లో పెట్టిన పోస్టుకు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వంగా గీత గట్టిగా బదులిచ్చారు. ‘టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15వేలు చొప్పున ఇస్తుందా.. లేక ప్రతి తల్లికి మాత్రమే అంటూ జారీచేసిన జీఓ–29ని సరిదిద్దుతుందా? అసలు ఎప్పటినుంచి ఈ పథకాన్ని అమలుచేస్తారు?’ అంటూ షర్మిల పోస్టుకు జతచేస్తూ ప్రశ్నించారు.
అంతకుముందు.. షర్మిల తన శనివారం నాటి పోస్టులో.. ‘బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడిపెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లు ఎలా అవుతుంది?’ అని ఆమె తన తీరును సమర్ధించుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికలకు ముందు జగన్ హామీలపై చర్చకు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. ఈ పోస్టుకు గీత కౌంటర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment