రంగుల పండుగ హోలీ మరికొద్ది రోజుల్లో రానుంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే హోలీ రాకుండానే కొందరు యువకులు రోడ్డుపై వెళ్తున్న వారిపై వాటర్ బెలూన్లు విసురుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ యువకుల చేష్టలకు బలైనవారితో పాటు ఈ వీడియో చూసిన వారంతా ఆ కుర్రాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటివారిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు నీరు నింపిన కొన్ని బెలూన్లను పట్టుకున్నట్లు కనిపిస్తుంది. కారులో వెళుతున్నవారు సన్‌రూఫ్ నుండి ఆ బెలూన్లను రోడ్డుపై వెళుతున్న వారిపైకి విసరడం వీడియోలో కనిపిస్తుంది.
కాగా అదే రోడ్డుపై ఆ కారును వెంబడిస్తున్న మరో కారులోని వ్యక్తి ఈ ఉదంతాన్ని ఈ వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో @gharkekalesh అనే పేజీలో షేర్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకూ 9 లక్షల 94 వేల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ఇలా చేయడం తప్పు. వీరిపై చర్య తీసుకోవాలి’ అని రాశారు. మరొక యూజర్ ‘ఆ కారు నంబర్‌ను చూసి, పోలీసులకు ట్యాగ్ చేయాలి’ అని కోరాడు.
Water-Balloon Kalesh (On 16.03.24 in vasant kunj New Delhi, these two boys throwing random water balloons on people and ladies too on the street)
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 19, 2024
pic.twitter.com/2rU5jLe4f6
Comments
Please login to add a commentAdd a comment