క్రైమ్: తోటలోంచి జాంకాయను దొంగిలించాడనే అనుమానంతో ఓ యువకున్ని ఘోరంగా హింసించి చంపారు. ఈ ఘటనలో బాధితుడు దళితుడు కాగా, స్థానికుల ఆందోళనతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అనుమాష ఘటన యూపీలోని అలీగఢ్ జిల్లాలో శనివారం జరిగింది.
20 ఏళ్ల ఓం ప్రకాశ్ అడవి నుంచి తిరిగొస్తూ.. జాంపళ్ల తోట వద్ద కింద పడున్న ఓ పండును తీసుకుని తినబోయాడు. అయితే అది గమనించిన తోట యజమానులు భీంసేన్, భన్వారీలు దొంగతనం చేశాడేమో అనే అనుమానంతో అతన్ని దారుణంగా హింసించారు. తాను దొంగతనం చేయలేదని, కిందపడితే తీసుకున్నానని బాధితుడు కాళ్ల మీద పడ్డా కూడా ఆ మూర్ఖులు వినిపించుకోలేదు. ఈ క్రమంలో అతని కేకలు విని.. జనం గుమిగూడారు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు.
అయితే ఈ మధ్యలోనే అంతా చూస్తుండగానే.. దుడ్డుకర్రలు.. చేతికి దొరికిన వస్తువులతో స్పృహ తప్పేదాకా ఓం ప్రకాశ్‌ను చితకబాదారు. గాయాలతో పడి ఉన్న అతన్ని.. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. ఘటనపై బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
ఇదీ చదవండి: నేరాలు.. ఘోరాలు.. చూసి ఇంట్లోవాళ్లనే!
Comments
Please login to add a commentAdd a comment