Guava garden
-
ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారిస్తున్న రైతులు
-
జామ సాగు... జామతో లాభాలు
-
కనకవర్షం కురిపిస్తున్న జామ సాగు
-
తైవాన్ జామకు పెరుగుతున్న డిమాండ్..
-
ఎకరా భూమి..రూ.3.68 లక్షల ఆదాయం
సాక్షి, నల్లగొండ(నేరేడుచర్ల): ఆలోచన ఉంటే ఆదాయ మార్గాలు అనేకం అంటున్నారు.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధి శాంతినగర్‌కు చెందిన బాణావత్ రాజేశ్వరి. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ వివిధ రకాల పంటలను సాగు చేస్తూ ఆదాయం పొందడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు.. ఈ సాధారణ గృహిణి. మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన రాజేశ్వరి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఈమె భర్త పోలీస్ శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తుండగా కుమారుడు హైదరాబాద్‌లో ఉన్నత విద్య (బీటెక్) అభ్యసిస్తున్నాడు. కాలక్షేపానికి మల్లెపూల సాగు రాజేశ్వరి–శ్రీనివాస్ దంపతులకు శాంతినగర్‌లో ఉన్న ఖాళీ స్థలంలో కొంత ఇంటి నిర్మాణానికి పోగా ఎకరా భూమి ఉంది. కుమారుడు హైదరాబాద్‌లో చదువుతుండడంతో పాటు భర్త ఉద్యోగానికి వెళ్తుండడంతో రాజేశ్వరి ఇంట్లో ఒంటరిగా ఉండేది. కాలక్షేపం కోసం రాజేశ్వరి కొన్నేళ్ల క్రితం తమకున్న ఎకరా భూమిలో మల్లెపూల సాగు చేపట్టింది. తైవాన్ జామతో ఏడాదికి రూ.80వేలు అయితే, రాజేశ్వరి అనుకున్న మేరకు ఆదాయం రాకపొవడంతో నాలుగేళ్ల క్రితం మల్లెతోటను తొలగించింది. వాటి స్థానంలో బెంగుళూరు నుంచి తైవాన్ జామ మొక్కలను తీసుకవచ్చి పెంచారు. జామతోట కాపునకు వచ్చి సంవత్సరానికి రెండు కాపుల్లో 80వేల రూపాయల ఆదాయాన్ని పొందుతోంది. అంతరపంటగా ఖర్జూర కాగా, రాజేశ్వరి ఒక్క జామతోటపైనే ఆధారపడకుండా అంతర పంటగా వివిధ రకాలకు చెందిన 100 వరకు ఖర్జూరా మొక్కలు పెంచుతోంది. వీటిలో బరిహి, ఖనిజా, మెట్జోల్, సీసీ, సగాయి. ఆజ్యా, ఆమ్రా వంటి రకాలైన ఖర్జూర మొక్కలను నాలుగేళ్లుగా పెంచుతున్నారు. పంట మరో ఏడాదిలో చేతికి వస్తుంది. మరి కొంతకాలం గడిస్తే వివిధ రకాల ఖర్జూరాలతో ఏడాదికి రూ.5 నుంచి 10లక్షల ఆదాయం వస్తుందని రాజేశ్వరి అంచనా వేస్తున్నారు. తేనెటీగల పెంపకంతో.. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కేవీకేలో తెనే టీగల పెంపకంపై రాజేశ్వరి గత ఏడాది శిక్షణ తీసుకున్నారు. అనంతరం జామ, ఖర్జూర తోటలో అంతర పంటగా తేనే టీగల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాజేశ్వరీ తన ఆలోచనను భర్త శ్రీనివాస్‌కు తెలియజేసింది. ఆయన రాజేశ్వరీ సహాయ సహకారాలతో పాటు ప్రోత్సాహాన్ని అందించారు. తేనెటీగల పెంపకానికి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఒక్కోదానికి 15వేల రూపాయలను వెచ్చించి 14 పెట్టెలను తీసుకవచ్చి పెంచుతున్నారు. తేనె టీగలు బయటకు వెళ్లి పూలలోని మకరందాన్ని ఆస్వాధించేందుకు పెట్టెలు కింది భాగంలో కొంత ఖాళీ స్థలాన్ని వదిలారు. పెట్టెలలోని తేనె టీగలను నియంత్రించేందుకు రాణీ ఈగ ఉంటుంది. తేనె టీగలు ఒక్కసారి పెంపకం మొదలు పెడితే ఒక్కో తేనె టీగ రెండు వేల వరకు గుడ్లు పెడతాయని రాజేశ్వరీ వివరించింది. ఆ గుడ్లు పిల్లలుగా మారి ఎటు వంటి పెట్టుబడి లేకుండా ఫలితాలు ఇస్తాయంటోంది. తేనె టీగల పెంపకం ద్వారా నెలకు 40 కేజీల తేనే ఉత్పత్తి అవుతుందని, కిలో రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు.ప్రస్తుతం జామపై ఏడాదికి రూ.80 వేల ఆదాయంతో పాటు తేనెపై రూ.24 వేల ఆదాయం వస్తుంది.ఖర్జూర పంట చేతికి వస్తే ఆదాయం మూడింతలకు పైగా పెగుతుందని రాజేశ్వరి పేర్కొంటోంది. మంచి లాభాలు గడిస్తున్నా కాలక్షేపానికి తొలుత మల్లెపూల సాగు చేపట్టా. ఆ తర్వాత జామ, ఖర్జూర, తేనెటీగల పెంపకంతో మంచి లాభాలు గడిస్తున్నా. తాము పెంచుతున్న తేనె టీగల ద్వారా ఉత్పత్తి అవుతున్న తేనెను పరిసర ప్రాంతాల ప్రజలు తోట దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తుండటంతో మార్కెంటింగ్ చేయడం కూడా సులువుగా ఉంది. ఖర్జూరా పంట చేతికొస్తే ఆదాయం మూడింతలు పెరగనుంది. – బాణావత్ రాజేశ్వరి, నేరేడుచర్ల -
నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..
తాంసి (ఆదిలాబాద్ జిల్లా): నెలకు రూ.లక్ష జీతం తీసుకుంటున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం మానేశాడు. తన భూమిలో విభిన్న పంటలను సాగుచేస్తూ నలుగురు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాడు. జిల్లా కేంద్రానికి చెందిన కోదే అన్వేశ్ ఎంటెక్ వరకు చదివాడు. 2016 నుంచి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. వెబ్ డెవలప్మెంట్లో భాగంగా 2016 నుంచి 2019 వరకు పని చేశాడు. నెలకు రూ.లక్ష జీతం వస్తున్నా సంతృప్తి చెందలేదు. ఉద్యోగం వదులుకొని తనకు నచ్చిన వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. నాలుగేళ్లుగా తాంసి మండలం సావర్గాం గ్రామశివారులోని ఎనిమిదెకరాల సొంత భూమిలో వివిధ పంటలను సాగు చేస్తూ లాభాలను గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మొదటగా నష్టాలు చవిచూసి.. హైదరాబాద్ నుంచి వచ్చిన అన్వేశ్ మొదటి సంవత్సరం పత్తి, జొన్న సాగు చేశాడు. పత్తి, జొన్న సాగుతో కూలీల కొరత, కష్టం ఎక్కువగా ఉండడంతో నష్టాలను చవిచూశాడు. ఏ మాత్రం కుంగిపోకుండా ఇతర పంటలను సాగుచేసి లాభాలను పొందాలని నిర్ణయించుకున్నాడు. ఏ పంటలను సాగుచేస్తే మేలని వ్యవసాయశాఖ అధికారుల సూచనలు తీసుకున్నాడు. స్నేహితుల సలహాలు తీసుకొని పంటలను సాగుచేస్తున్నాడు. అధికారుల సూచనలు పాటించి.. 2019లో హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సలహాతో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి నుంచి థైవాన్ జామ మొక్కలను తెప్పించాడు. రూ.2.50 లక్షల వరకు ఖర్చుచేసి నాలుగెకరాల్లో ఎకరాకు వెయ్యి చొప్పున నాటించాడు. మొక్కలను హైడెన్సిటీ విధానంతో ఆరు అడుగులకు ఒక్కటి చొ ప్పున ఉండేలా చూశాడు. రసాయన మందులు లే కుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేశాడు. దీంతో మొక్కలను నాటిన 18 నెలలకే కాత ప్రారంభమైంది. సేంద్రియంగా పెంచిన జామపండ్లను పంటచేను పక్కనే ఉన్న రోడ్డు పక్కన షెడ్డు వేసి రూ.50కి కిలో చొప్పున విక్రయిస్తున్నాడు. పెద్దఎత్తున దిగుబడి వచ్చినప్పుడు బయటి మార్కెట్‌కు కూడా తరలిస్తున్నాడు. జామ ద్వారా మొదటి సంవత్సరం రూ.రూ.2.50 లక్షల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం కాత ఎక్కువగా ఉండగా రూ.3 లక్షల వరకు వస్తుందని అన్వేశ్ చెబుతున్నాడు. షెడ్లు వేసి కోళ్లు పెంచుతూ.. జామతోటతో అంతరసాగు విధానంలో వివిధ పంటలు వేశాడు. దీనికి తోడు పంటచేనులో ప్రత్యేక షెడ్లు వేసి రెండేళ్లుగా నాటు, కడక్‌నాథ్, గిరిరాజా కోళ్లు, బాతులను పెంచుతున్నాడు. వాటిని విక్రయిస్తూ అదనపు లాభాలను గడిస్తున్నాడు. వచ్చే సంవత్సరం నుంచి బ్రాయిలర్ కోళ్ల పెంపకం చేపట్టనున్నట్లు అన్వేశ్ తెలిపాడు. ఇప్పటినుంచే షెడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ఇక్కడే తృప్తిగా, ప్రశాంతంగా ఉన్నట్లు చెబుతున్నాడు. వ్యవసాయంలోనే సంతృప్తి నేను ఎంటెక్ పూర్తిచేశా ను. మూడేళ్లపాటు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యో గం చేశాను. జీతం సరిప డా వచ్చినా ఉద్యోగంపై ఆసక్తి లేక మానేశాను. మాకున్న భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్న. నాన్న శ్రీనివాస్ సాయంతో మూడేళ్ల క్రితం వ్యవసాయం ప్రారంభించాను. ప్రస్తుతం వి విధ పంటలతోపాటు జామ సాగు చేపట్టా ను. అలాగే వివిధ రకాల కోళ్ల పెంపకం చేప ట్టి అదనపు ఆదాయాన్ని పొందుతున్న. రోజూ పంటచేనులో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నాతోపాటు నిత్యం నలుగురు కూలీలకు పని కల్పించడం సంతృప్తినిస్తోంది. – కోదే అన్వేశ్, యువరైతు -
అయ్యా.. మీ కాళ్లు మొక్కుతా.. దొంగతనం చెయ్యలే!
క్రైమ్: తోటలోంచి జాంకాయను దొంగిలించాడనే అనుమానంతో ఓ యువకున్ని ఘోరంగా హింసించి చంపారు. ఈ ఘటనలో బాధితుడు దళితుడు కాగా, స్థానికుల ఆందోళనతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అనుమాష ఘటన యూపీలోని అలీగఢ్ జిల్లాలో శనివారం జరిగింది. 20 ఏళ్ల ఓం ప్రకాశ్ అడవి నుంచి తిరిగొస్తూ.. జాంపళ్ల తోట వద్ద కింద పడున్న ఓ పండును తీసుకుని తినబోయాడు. అయితే అది గమనించిన తోట యజమానులు భీంసేన్, భన్వారీలు దొంగతనం చేశాడేమో అనే అనుమానంతో అతన్ని దారుణంగా హింసించారు. తాను దొంగతనం చేయలేదని, కిందపడితే తీసుకున్నానని బాధితుడు కాళ్ల మీద పడ్డా కూడా ఆ మూర్ఖులు వినిపించుకోలేదు. ఈ క్రమంలో అతని కేకలు విని.. జనం గుమిగూడారు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ మధ్యలోనే అంతా చూస్తుండగానే.. దుడ్డుకర్రలు.. చేతికి దొరికిన వస్తువులతో స్పృహ తప్పేదాకా ఓం ప్రకాశ్‌ను చితకబాదారు. గాయాలతో పడి ఉన్న అతన్ని.. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. ఘటనపై బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఇదీ చదవండి: నేరాలు.. ఘోరాలు.. చూసి ఇంట్లోవాళ్లనే! -
జామ్ జా‘మనీ’.. ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం.. ఈ పంటకు భలే గిరాకీ!
నిరంతరం కష్టాలు, నష్టాలు చవిచూసే రైతుకు జామ పంట ధీమానిస్తోంది. ఏడాదిలో మూడుసార్లు ఫలసాయాన్నిస్తోంది. జిల్లాలో అధికంగా మామిడి సాగవుతుంటే, పెనుమూరులో మాత్రం జామ పంట భరోసా కల్పిస్తోంది. తెగుళ్ల బెడదను తట్టుకుని నిలబడుతోంది. తరతరాలుగా సాగవుతూ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. మంచి రంగునూ, రుచినీ సొంతం చేసుకుంది. అత్యుత్తమ దిగుబడులతో.. రాష్ట్ర సరిహద్దులను కూడా దాటుతూ రైతుల ‘పంట’ పండిస్తోంది. పెనుమూరు (చిత్తూరు): ప్రజలకు ఆరోగ్యకరమైన జామ పండ్ల సాగుకు పెనుమూరు ప్రసిద్ధి చెందుతోంది. రైతులు ఏడాదిలో మూడు సార్లు దిగుబడులు సాధిస్తున్నారు. అత్యధిక ఫలసాయం, ఆదాయం ఇచ్చే పంట జామ. ఇతర రాష్ట్రాలు, పట్టణాలకు పెనుమూరు నుంచి జామను రవాణా చేస్తున్నారు. రెండు శతాబ్దాల క్రితం దాసరాపల్లెకు చెందిన నాగిరెడ్డి తొలిసారిగా జామ పంట సాగు చేశాడు. ఆయన జామ సాగులో మంచి లాభాలు పొందడం చూసి దాసరాపల్లెలో ఉన్న 50 కుటుంబాలు జామ పంట సాగు చేస్తున్నారు. దాసరాపల్లెను ఆదర్శంగా తీసుకొని కారకాంపల్లె, పెద్దరాజుపల్లె, ఉగ్రాణంపల్లె, చెళంపాళ్యం, రామాపురం, పెనుమూరు గ్రామాల్లో 150 ఎకరాల్లో వివిధ రకాల జామ సాగవుతోంది. జామ సాగుపై ఉన్న మక్కువతో వారసత్వంగా కూడా రైతులు సాగు చేస్తున్నారు. తొలుత రసాయన ఎరువుల వినియోగంతో జామ సాగు చేశారు. పెట్టుబడి పెరగడంతో కష్టాలు, నష్టాలు చవి చూశారు. మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం ద్వారా జామ సాగు చేస్తున్నారు. ఏడాదిలో మూడు పంటలు సాధారణంగా జామలో ఏడాదికి రెండు పంటలు మాత్రమే దిగుబడి సాధించవచ్చు. అయితే శాస్త్రీయ పద్ధతులతో ‘‘చందన మాధురి’’ రకంతో మూడు పంటలు అందుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఘన జీవామృతం, ధ్రవ జీవామృతం, పంచగవ్య భీజామృతం, పళ్ల ద్రావణం, వేప కషాయం, వానపాముల ఎరువుల వినియోగంతో జామ సాగు చేస్తున్నారు. రైతులు జామ తోటల్లో కోళ్లు, పొట్టేళ్లు పెంచుతూ భూమిని సారవంతం చేస్తున్నారు. వీటితో పాటూ మూడు పర్యాయాలు పచ్చిరొట్ట పైర్లు సాగు చేస్తూ సేంద్రియ ఎరువులు సహజంగా అందిస్తున్నారు. ఏటా భూసార పరీక్షలు చేస్తూ సూక్ష్మపోషకాలు అందిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు మార్కెటింగ్ మెలకువలు స్థానికంగా జామ కాయలు విక్రయించడం వల్ల ఆదాయం ఆశాజనకంగా లేదు. దీంతో మార్కెట్ మెలకువలపై రైతులు దృష్టి సారించారు. పల్లెల్లో కన్నా పట్టణాల్లో జామ కాయల ధర, డిమాండ్ ఉండడాన్ని గుర్తించారు. సేంద్రియ ఉత్పత్తులు కొనే సంస్థలను, వ్యాపారులను సంప్రదించి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు రవాణా చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. స్థానికంగా ఒక కిలో జామ కాయలు రూ.20 ఉండగా పట్టణాల్లో రూ.80 నుంచి 100 వరకు పలుకుతోంది. వీటితో పాటూ డయాబెటిక్ సెంటర్లకు ప్రత్యేక ప్యాకింగ్‌తో సరఫరా చేస్తున్నారు. అంతే కాకుండా వివిధ పట్టణాల్లో నిర్వహించే ఆర్గానిక్, కిసాన్ మేళాల్లో ఈ దిగుబడులు విక్రయిస్తున్నారు. ఎకరాకు రూ.3 లక్షలు ఉద్యానవన పంటల్లో ప్రస్తుతం జామ సాగు మంచి ఆదాయాన్నిస్తోంది. పైగా ఈ పంటకు తెగుళ్ల బెడద పెద్దగా ఉండదు. పెట్టుబడులు కూడా తక్కువే. మార్కెట్లో విక్రయించుకోవడం సులభంగా ఉంది. అదీకాక ఏడాదికి మూడు పంటలు ఇవ్వడంతో మంచి ఆదాయం పెరుగుతోంది. జామను సేంద్రియ పద్ధతులతో సాగుచేయడం, మార్కెట్ మెలకువలతో అమ్ముకోవడం ద్వారా ఎకరా పంటకు ఏడాదిలో రూ.3లక్షల వరకు నికర ఆదాయం వస్తోంది. కాయలతో పాటూ మొక్కలు అంటుకట్టి కొందరు రైతులు మరింత ఆదాయం పొందుతున్నారు. మూడు తరాలుగా ఇదే పంట మా గ్రామంలో సుమారు రెండు శతాబ్దాలకుపైగా జామ తోటలు సాగవుతున్నాయి. మా కుటుంబానికి మూడు తరాలుగా జామ తోటలు సాగు చేయడం వారసత్వంగా వస్తోంది. ప్రస్తుతం మూడు ఎకరాలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన జామ పండ్లు పండిస్తున్నాం. ఏడాదిలో మూడు పర్యాయాలు దిగుబడులు సాధిస్తున్నాం. – పి.హేమావతి, జామరైతు, దాసరాపల్లె జామతోనే బతుకుతున్నాం పండ్ల తోటల పెంపకంలో ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే పంట జామ. దీనికి చీడపీడలు కూడా అంతగా ఉండవు. జామ పండ్లను ఎక్కడైనా, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. పేదవాడి ఆపిల్‌గా పేరు పొందిన జామ పంట సాగు చేసి సంతోషంగా బతుకుతున్నాం. ఐదు ఎకరాల్లో జామ సాగు చేసి ఇద్దరు పిల్లలను విద్యా వంతులను చేశాం. రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఆదాయం పొందుతున్నాం. – కె.జ్యోతి, పెనుమూరు మండలం సంతల్లోనూ అమ్మకం పెనుమూరు జామకు ప్రసిద్ధి చెందింది. అందుకే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల నుంచి జామ పండ్ల కొనుగోలుకు వ్యాపారులు వస్తున్నారు. కొందరు రైతులు స్వయంగా తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పుత్తూరు పట్టణాల్లో వ్యాపారులకు హోల్ సేల్‌గా జామ కాయలు విక్రయిస్తున్నాం. చాలామంది రైతులు స్వయంగా వారపు సంతల్లో కాయలు విక్రయిస్తున్నారు. ఆదాయం కూడా బాగానే ఉంది. – ధరణి వేణి, దాసరాపల్లె, పెనుమూరు మండలం -
జామరైతు ఆలోచన అదుర్స్
సాక్షి, యడ్లపాడు: జామతోట సాగు చేసే రైతులకు పండుఈగతో బాధలెన్నో.. అందులోనూ థైవాన్రకం జామతోటలకు ఈ పండుఈగ ఉధృతి అధికంగా ఉంటుంది. మొక్కకు ఉన్న కాయలు బాగా సైజు పెరిగి పండుదశకు చేరుకునే సమయంలో ఈగలు కాయ ల్లోకి జొరబడి పూర్తిగా పాడు చేస్తాయి. దీంతో థైవాన్ రకాన్ని సాగు చేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. మూడేళ్లగా పండుఈగతో ఇబ్బందులు.. మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేటకు చెందిన కౌలు రైతు గడ్డం రామసుబ్బారావు 8 ఎకరాల్లో మూడేళ్ల నుంచి థైవాన్లోని రెడ్, వైట్ జామ రకాలను సాగు చేస్తున్నాడు. అయితే కాయ పక్వానికి వచ్చే సమయంలో ఆశిస్తున్న పండుఈగ నివారణకు తొలుత మలాథిన్ ద్రావణాన్ని వినియోగించాడు. అది కేవలం 24 గంటలు మాత్రమే పనిచేయడంతో రోజు మార్చి రోజు వీటిని చల్లడం పెట్టుబడి పెరిగిపోతుందని గ్రహించాడు. లింగాకర్షణ బుట్టల్ని తెచ్చి ఏర్పాటు చేశాడు. వీటి వల్ల 75శాతం పంటను కాపాడు కోగలిగానని తెలిపాడు. ఇవి 40 రోజులు మాత్రమే పని చేయడం, వర్షం కురిస్తే పనిచేయక ఒక్కసారిగా ఈగ ధాటి అధికమవ్వడంతో విసుగెత్తిపోయింది. ఆలోచన బాగుంది ఖర్చు తగ్గింది! ఆ అనుభవంలోంచి ఓ ఆలోచన పుట్టుకొచ్చింది. ప్లాస్టిక్ పాలిథిన్ పలుచటి కవర్లను తీసుకువచ్చి పిందెలను అందులో ఉంచి పిన్నులు కొట్టాడు. అంతే ఇప్పుడు జామకాయలకు పండుఈగ నుంచి పూర్తిగా రక్షణ కల్పించగలిగినట్లు వెల్లడించాడు. ఇలా కవర్లు తొడిగినపుడు కాయపై అధికంగా అంటుకున్న కవర్లలోని కొన్ని కాయలు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఏదేమైనా పెద్దగా పెట్టుబడి లేని ఈ నివారణ వల్ల మనశ్శాంతిగా ఉంటున్నట్టు చెబుతున్నారు. -
సాక్షి కథనంపై స్పందించిన మంత్రి సబితా
సాక్షి, మర్పల్లి : సాక్షి దినపత్రికలో ప్రచురితమైన పశువులు కాస్తున్న విద్యార్థి కథనంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. జామకాయలు దొంగతనం చేశాడన్న కారణంగా పాఠశాల హెడ్ మాస్టర్ ఒక విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించగా, సదరు విద్యార్థి పశువులను కాస్తున్నాడంటూ సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి వెంటనే సదరు విద్యార్థిని తిరిగి పాఠశాలలో చేర్చుకోవాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ వ్యవహారం మొత్తంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఉన్నతాధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. ఆ బాలుడి పేరు కిషన్. వికారాబాద్ జిల్లా మర్పల్లి ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి చదువుతున్నాడు. ఈ నెల 11న తోటి విద్యార్థులతో కలసి పాఠశాల పక్కనున్న తోటలో జామకాయలు తెంపాడు. దాంతో జామకాయలు దొంగతనంగా కోయడాన్ని తెలుసుకున్న హెడ్ మాస్టర్ నర్సింగ్‌రావు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆంగోత్ శంకర్, చాందీబాయిని పిలిచి.. ‘మీ అబ్బాయి దొంగతనాలు చేస్తున్నాడు. గతంలో కూడా అతను తండాలో దొంగతనాలు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. తీసుకెళ్లండి’ అంటూ టీసీ చేతిలో పెట్టి పంపించారు. టీసీ ఇస్తే ఎలా అని, చదువు ఆగిపోతుందంటూ ఈ ఏడాది పాఠశాలలోనే ఉంచాలని తల్లిదండ్రులు వేడుకున్నా హెచ్ఎం వినిపించుకోలేదు. దాంతో చేసేది లేక కిషన్ పశువుల కాపరిగా మారాడు. -
తాండవ జామ..భలే టేస్ట్ గురూ!
విశాఖపట్నం ,నాతవరం (నర్సీపట్నం): జామ తోటల పెంపకంపై ఆదాయం బాగుండటంతో రైతులు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు తాండవ జంక్షన్ జామకాయలకు ప్రసిద్ధి. అప్పటిలో విస్తారంగా సాగు జరిగేది. రానురాను తెగుళ్ల బారిన పడటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. మళ్లీ ఇప్పుడు రైతులు జామతోటల పెంపకంపై దృష్టి సారించారు. మండలంలోబాపన్నపేట, మర్రిపాలెం, వెన్నలపాలెం, డి,యర్రవరం ,ములగపూడి, నాతవరం, మాదంపూడి ప్రాంతాలల్లో సుమారు 80 ఎకరాలు వేశారు. దేశవాళీ రకాలు కాకుండా లక్నో 49, భువనగిరి బత్తాయి తదితర రకాల సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎకరాకు రూ.80 వేల ఆదాయం మండలంలోని బాపన్నపేట గ్రామానికి చెందిన చోడే మోహన్‌రావు చౌదిరి సుమారు 10 ఎకరాల్లో తైవాన్, హైబ్రిడ్ రకాలు వేశారు. నాటిన తరువాత మూడేళ్ల నుంచి దిగుబడి వస్తోందని ఆయన వివరించారు. ఏడాదికి రూ.60 నుంచి రూ.70 వేల మధ్య ఆదాయం వస్తోందని చెప్పారు. యాపిల్‌ను పోలివుండే తైవాన్ జామకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందన్నారు. జామ కాయల వ్యాపారమే ఆధారం మర్రిపాలెం శివారు రెల్లి కాలనీకి చెందిన వంద కుటుంబాలు జామ కాయల అమ్మకాలపై ఆధారపడ్డారు. వీరంతా రైతుల నుంచి సేకరించిన జామకాయలను తాండవ జంక్షన్లో విక్రయించి ఉపాధి పొందుతున్నారు. తాండవ వల్లే రుచి : తాండవ జలాశయం వల్లే ఈ ప్రాంతంలో జామకాయలు రుచికరంగా ఉంటాయి. తాండవ నీరు తియ్యదనం వల్ల ఈ ప్రాంతంలో పండించే జామ కాయల రుచికూడా అదేవిధంగా ఉంటుంది. నర్సీపట్నం– తుని మార్గంలో వెళ్లే ప్రతిఒక్కరూ జామకాయలను కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. ప్రోత్సాహం కరువు తాండవ జంక్షన్లో జామకాయల వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ముద్ర పథకంలో రుణాలు ఇప్పిస్తే అధిక వడ్డీలనుంచి బయటపడతాం. – బంగారి అబ్బు, రెల్లి సంఘం అధ్యక్షుడు జామ ఆరోగ్యకరం జామకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. జామి కాయలో ‘సి’ విటమిన్ అధికంగా ఉంటుంది, తక్కువ మోతాదులో ‘ఏ’ విటమిను కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యానర్స్ రాకుండా ఉపయోగపడుతుంది.– అనుషరావు, నాతవరం పీహెచ్సీ వైద్యాధికారి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం జామ సాగు చేయడానికి ముందుకు వచ్చె రైతులకు రాయితీపై మొక్కలు అందజేస్తున్నాం. అలాగే ఉపాధి హమీ పథకంలో తోటల పెంపకానికి నిధులు కేటాయిస్తున్నాం. రైతులకు జామసాగు ప్రయోజనాలపై సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. – చెట్టి బిందు, ఉద్యవనశాఖాదికారిణీ -
రేలంగి జామ.. భలే మామ!
పశ్చిమగోదావరి ,ఇరగవరం: ఆంధ్ర ఆపిల్‌గా పేరుగాంచిన జామ కాయలకు పెట్టింది పేరు ఇరగవరం మండలం రేలంగి గ్రామం. ఇక్కడ పండించే జామ కాయలకు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలలోనూ విపరీతమైన గిరాకీ ఉంది. పూర్వం నుంచి ఈ గ్రామంలో 200 కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జామ పంట ఉపాధి కల్పిస్తోంది. గ్రామంలోనే జామ తోటలు పెంచి వాటి నుంచి పండిన కాయలను రేలంగి చుట్టు పక్కల గ్రామాల్లో విక్రయించడమే కాకుండా ఏలూరులోని జ్యూస్ ఫ్యాక్టరీకి సరఫరా చేస్తారు. దూర ప్రాంతాలకూ ఎగుమతి చేసే వ్యాపారులున్నారు. దీంతో సీజన్లో గ్రామం నుంచి బెంగళూరు, తిరుపతి, విశాఖపట్టణం తదితర ప్రాంతాలకు లారీల్లో జామ కాయలను తరలిస్తుంటారు. దూర ప్రాంతాల నుంచే కాకుండా జిల్లాలోని భీమవరం, ఆకివీడు, నిడదవోలు, అమలాపురం తదితర ప్రాంతాలకు రైళ్లలో రవాణా చేస్తుంటారు. పూర్వం రేలంగిలో జామ కాయల ఎగుమతి కోసం ప్రత్యేకంగా రైళ్లుల్లో కూడా రవాణా చేసేవారని ప్రచారం ఉంది. 150 ఎకరాల్లో సాగు ప్రస్తుతం రేలంగి గ్రామంలో 150 ఎకరాల వరకూ జామ తోటలు విస్తరించి ఉన్నాయి. ఎకరానికి కౌలుగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ చెల్లిస్తున్నారు. పెంచిన జామ తోటలకు ఐతే సంవత్సరానికి రూ. 60 వేలను కౌలుగా చెల్లిస్తున్నట్టు రైతులు పేర్కొంటున్నారు. ఒక ఎకరానికి సంవత్సరంలో పది నుంచి 14 టన్నుల వరకూ దిగుబడి వస్తోందని, టన్నుకు సుమారు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ ధర పలుకుతోందని చెప్పారు. ఇటీవల అలహాబాద్ సఫేదా, థాయ్‌లాండ్, కేజీ 48 రకాలను కూడా గ్రామంలో పండిస్తున్నారు. ఈ వంగడాలను కడియద్ద, అశ్వారావుపేట, తదితర చోట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 8 సంవత్సరాల తర్వాత పూర్తిగా ఈ చెట్లను తొలగించి మళ్లీ కొత్త మొక్కలు నాటుతారు. ఇక్కడ కాయలను రేలంగి గ్రామం మీదుగా ప్రయాణించేవారు తప్పక రుచి చూడటం రివాజు. లాభసాటి పంట పూర్వం నుంచి జామ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నాం. నాలుగు ఎకరాల పొలంలో జామ తోట పంటతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. సంవత్సరానికి ఎకరానికి దాదాపు రూ.లక్ష వరకూ ఆదాయం వస్తోంది. –శిరిగినీడి వెంకటేశ్వరరావు, జామ రైతు, రేలంగి వారసత్వంగా సాగుతున్నాం మా తాత, తండ్రుల కాలం నుంచి జామ పంట పండిస్తున్నాం. పూర్వంతో పోలిస్తే ప్రస్తుతం జామ పంటకు లభిస్తోన్న రేటు చాలా బాగుంది. వరితో పోలిస్తే జామ పంట లాభదాయకంగానే ఉంది. సంవత్సరానికి ఎకరానికి రూ.25 వేలు ఖర్చు చేస్తే రూ.లక్ష వరకూ ఆదాయం వస్తోంది. –పరుచూరి వెంకట్రావు, జామరైతు, రేలంగి -
పండంటి లాభాలు!
జామతో అధిక ఆదాయం.. జిల్లాలో విస్తరిస్తున్న తోటల సాగు యాజమాన్య పద్ధతులు పాటిస్తే మేలు అందుబాటులో ఎన్నెన్నో రకాలు జిల్లాలో సాగుకు అనువైన పరిస్థితులు సాగు పద్ధతులపై గజ్వేల్ ఉద్యానవన అధికారి చక్రపాణి సలహా సూచనలు గజ్వేల్:జిల్లాలో జామ తోటల సాగు విస్తరిస్తోంది. రైతులు మంచి ఆదాయానికి ఈ తోటల సాగును మార్గంగా ఎంచుకుంటున్నారు. తోటల సాగు, యాజమాన్య పద్ధతులపై గజ్వేల్ ఉద్యానవన అధికారి చక్రపాణి (సెల్: 8374449345) సలహాలు, సూచనలు అందించారు. వాతావరణం: వేడితో కూడిన పొడి వాతావరణంలో పెరిగిన తోటల్లో పండ్ల నాణ్యత ఎక్కువ. 100 సెంటీమీటర్ల వర్షపాతం కలిగిన ప్రాంతాలు తోటల సాగుకు అనుకూలం. నేలలు: ఉదజని సూచిక 4.8 నుంచి 8.2 ఉండి, నీరు నిలవని, లోతైన మురుగునీటి పారుదల గల నేలలు అనుకూలం. తేలికపాటి ఇసుక నేలలు అంతగా పనికిరావు. రకాలు: జామలో తెల్ల, ఎర్ర కండ రకాలు ఉన్నాయి. తెల్లకండ రకాలు: లక్నో-49: పండ్లు కోలగా, పెద్ద పరిమాణంలో గరుకు చర్మంతో ఉంటాయి. విత్తనాలు పెద్దవిగా గట్టిగా ఉంటాయి. ఎకరాకు ఏడాదికి 60-80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సఫేద్ జామ: పండ్లు మధ్యస్తంగా, గుండ్రంగా, పలుచటి తోలుతో మంచి రుచిగా ఉంటాయి. ఎకరాకు ఏడాదికి 80-100 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కోహీర్ సఫేఽద్: అత్యధిక దిగుబడిని ఇస్తుంది. పండ్లు పెద్దవిగా, గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి. అర్కమృదుల: అలహాబాద్ సఫేద్ రకం నుంచి ఎంపిక చేసిన రకం ఇది. పండ్లు గుండ్రంగా, పెద్దవిగా, గింజలు మెత్తగా ఉండి, కండ తెలుపు రంగులో తియ్యగా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అర్క అమూల్య: కాయలు మధ్యస్తంగా, తెల్లటి కండతో తియ్యగా ఉంటాయి. విత్తనాలు మెత్తగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. శ్వేత: అధిక దిగుబడిని ఇచ్చే తెలుపు కండ రకం. పండు సుమారు 225 గ్రాముల బరువుతో తెలుపు రంగుతో ఎరుపు మచ్చలు కలిగి వుంటాయి. ఎర్రకండ రకాలు రెడ్ప్లష్: కాయ ముదురు ఆకుపచ్చ రంగుతో గరుకుగా ఉండి, గింజలు గట్టిగా ఉండి కండ ఎరుపు రంగులో ఉంటుంది. ఎకరాకు ఏడాదిలో 70-80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. లలిత్: అలహాబాద్ సఫేద్తో పోలిస్తే 24 శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. పండు బరువు 185 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఉండి నిల్వ పదార్థాల తయారీకి అనువుగా ఉంటుంది. కిరణ్: ఐఐహెచ్ఆర్, బెంగళూర్ నుంచి ఈ మధ్యనే విడుదలైన ఈ రకం పండు ఎరుపు కండతో మృదువైన గింజలను కలిగివుంటుంది. జామ పల్ఫ్ తయారీకి ఈ రకం అనువైనది. నాటే సమయం: మొక్కలను జూన్-జూలై నెలల్లో గానీ అక్టోబర్-నవంబర్ నెలల్లో గానీ నాటుకోవాలి. నీటి యాజమాన్యం: లేత మొక్కలకు 2-3 రోజులకు ఒకసారి, పెరిగిన చెట్లకు 7-10 రోజులకు ఒకసారి నీరు పారించాలి. నీటి పళ్లాల పరిధి చెట్టు పెరుగుతున్న కొద్దీ ఏడాదికి అర్థ అడుగు చొప్పున పెంచాలి. మొక్కల నాటడం: జామను సాధాణంగా నేల అంటు పద్ధతి లేదా చెర్పంటూ పద్ధతిలో నాటుతారు. మొక్కల మధ్య దూరాన్ని నేల లోతూ, భూసారం, సాగునీటి సౌకర్యం మొదలైన అంశాలను బట్టి నిర్ణయించాలి. ఎకరాకు 160 మొక్కలు (5 ఇంటూ 5 మీటర్లు), లేదా 112 మొక్కలు (6 ఇంటూ 6 మీటర్లు) చొప్పున గుంతలను తవ్వి ప్రతి గుంతకు 10-15 కిలోల పశువుల ఎరువు, 500 గ్రాముల సింగిల్ ఫాస్పేట్ కలిపి నింపాలి. కొమ్మల కత్తిరింపు: ప్రధాన కండపై 2-3 అడుగుల ఎత్తు వరకు వచ్చ పక్క కొమ్మలను కత్తిరించి వేయలి. 60 సెంటీమీటర్లు లేదా 90 సెంటీమీటర్లు పైన రెండు, మూడు కొమ్మలు మాత్రమే పెరిగేలా చూడాలి. ప్రతి ఏడాది ఎండిన కొమ్మలను, అడ్డంగా పెరిగే కొమ్మలను తీసేయాలి. ఎరువుల మోతాదు: మొక్క వయసు ఏడాది ఉన్న సమయంలో 217 గ్రాముల యూరియా, 40 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాష్, 15 కిలోల పశువుల ఎరువు వేయాలి. రెండేళ్ల వయసులో 434 గ్రాముల యూరియా, 80 గ్రాముల భాస్వరం, 200 గ్రాముల పొటాష్, 30 కిలోల పశువుల ఎరువు, మూడేళ్ల వయసులో 651 గ్రాముల యూరియా, 120 గ్రాముల భాస్వరం, 300 గ్రాముల పొటాష్, 45 కిలోల పశువుల ఎరువు, నాలుగేళ్ల వయసులో 868 గ్రాముల యూరియా, 160 గ్రాముల భాస్వరం, 400 గ్రాముల పొటాష్, 60 కిలోల పశువుల ఎరువు వేయాల్సి ఉంటుంది. ఇలా ఏడాది పెరిగిన కొద్దీ మోతాదు పెంచాల్సి ఉంటుంది. పోషక లోపాలు: ఆకులు ఎరుపు రంగులోకి మారినపుడు భాస్వరం, పొటాష్, జింక్, సేంద్రియ పదార్థాల మిశ్రమ లోపాలుగా గుర్తించవచ్చు. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేసి ఈ లోపాలను నివారించవచ్చు. 4 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 2 గ్రాముల బోరిక్‌యాసిడ్ 1 లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. కాపు నియంత్రణ: ఫిబ్రవరి నుండి మే నెల వరకు నీటిని ఇవ్వడం ఆపివేయాలి. ఇలా చేయడం వల్ల ఏప్రిల్, మే నెలల్లో చెట్లు ఆకులను రాలుస్తాయి. జూన్ నెలలో పాదులు తీసి ఎరువులు వేసి నీళ్లు కట్టాలి. నీరు కట్టిన 20-25 రోజుల్లో కొత్త చిగుళ్లు వేస్తుంది. చలికాలంలో వచ్చే పంట మంచి నాణ్యతతో ఉంటుంది. వర్షాకాలంలో వచ్చే పంటను నియంత్రించి చలికాలంలో వచ్చేటట్లు చేసుకోవచ్చు. కాయకోత తర్వాత కాపునిచ్చిన కొమ్మలను నాలుగింట మూడు వంతులు కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల దిగుబడి పెరుగుతుంది. కాయలు కోసేటప్పుడు చిన్న రెమ్మలతో కోయటం మంచిది. ఇలా చేయడం వల్ల కొత్త రెమ్మలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడి వస్తుంది