పోలీసును పట్టుకొని కుమ్మేసింది | women beats police | Sakshi
Sakshi News home page

పోలీసును పట్టుకొని కుమ్మేసింది

Published Fri, Jun 12 2015 11:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

పోలీసును పట్టుకొని కుమ్మేసింది - Sakshi

పోలీసును పట్టుకొని కుమ్మేసింది

లక్నో: వేధింపులపై ఓ మహిళ తిరగబడింది. పోలీసు అని కూడా చూడకుండా చితకబాదింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సహరాన్‌పూర్‌కు చెందిన మహిళ ఓ పోలీసుపై దాడికి దిగింది. వివరాల్లోకి వెళ్తే సహరాన్‌పూర్‌కు చెందిన ఒక పోలీసు ఆ మహిళను వేధిస్తూ వస్తున్నాడు. కొన్నాళ్లపాటు భరించిన ఆమె ఇక తట్టుకోలేకపోయింది. పది మందిలో ఆ పోలీసు గల్లా పట్టుకొని నిలదీసిన ఆమె..... ఆగ్రహంతో శివమెత్తిపోయింది. చెంపలు చెడామడా వాయించింది. మహిళ దెబ్బలకు బెదిరిన ఆ పోలీసు అక్కడి నుంచి జారుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement