![10 Month Old Baby Brutally Beaten up By Nanny in West Bengal Act caught on Camera - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/2/wb.jpg.webp?itok=wKiok7da)
కోల్‌కతా: ప్రస్తుతం భార్యభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తేనే.. జీవితం సాఫిగా సాగిపోతుంది. పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, పిల్లల చదువు, వైద్యం వంటి ఖర్చులను దృష్టి పెట్టుకుని.. చాలా మంది ఆడవారు ఉద్యోగాలు చేస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో చిన్నారుల ఆలనాపాలన విషయం ఉద్యోగం చేసే దంపతులను తీవ్రంగా కలిచి వేస్తుంది. ఇంట్లో పెద్దవారు ఉంటే పర్లేదు. కానీ బయట వ్యక్తుల మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడే సమస్య ఎదురవుతుంది. ఈ ఆయాల్లో కొందరు చిన్నారులనే కనికరం కూడా లేకుండా పిల్లలను హింసిస్తారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్‌కు చెందిన దంపతులు ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. వారికి పది నెలల పాప ఉంది. ఇద్దరు జాబ్ చేస్తుండటంతో చిన్నారి ఆలనపాలన చూడటానికి ఓ ఆయాను నియమించుకున్నారు. మొదట్లో బాగానే ఉంది. కానీ రాను రాను చిన్నారి ప్రవర్తనలో మార్పు రాసాగింది. తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చాక చిన్నారి ఆయా దగ్గరకు వెళ్లడానికి నిరాకరించేది. ఆమెనే చూస్తేనే పాప బాగా ఏడ్చేది.
(చదవండి: Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి..)
తల్లిదండ్రులకు ఆయా ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. ఈ క్రమంలో వారు ఇంట్లో సీసీటీవీ పెట్టారు. ఆఫీస్‌కు వెళ్లాక.. అక్కడ నుంచి మానిటర్ చేసేవారు. ఇక సీసీటీవీలో కనిపించిన దృశ్యాలు వారిని భయభ్రాంతులకు గురి చేశాయి. ప్రాణం పోయినట్లు విలవిల్లాడారు. కారణం ఏంటంటే సదరు ఆయా ఏమాత్రం కనికరం లేకుండా పది నెలల చిన్నారిని.. దారుణంగా చితకబాదింది. పాప గుక్కపట్టి ఏడుస్తున్న ఆ రాక్షసి కనికరించలేదు.
(చదవండి: Fact Check: డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ ఇలా ఉన్నాడేంటీ?)
ఈ దృశ్యం చూసిన వెంటనే చిన్నారి తల్లిదండ్రులు వెంటనే ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో పోలీసులుకు ఫిర్యాదు చేసి.. వారిని వెంటపెట్టకుని ఇంటికి వచ్చారు. ఆయాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిన్నారిని మెడినిపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
చదవండి: అర్పిత.. స్ఫూర్తి ప్రదాత
Comments
Please login to add a commentAdd a comment