పోలీసు స్టేషన్ లో భార్యపై మాజీ ఎమ్మెల్యే దాడి | Former BJP MLA's Wife Alleges He Beat Her up in Police Station | Sakshi
Sakshi News home page

పోలీసు స్టేషన్ లో భార్యపై మాజీ ఎమ్మెల్యే దాడి

Published Fri, Jun 24 2016 2:00 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

Former BJP MLA's Wife Alleges He Beat Her up in Police Station

బెంగళూరు: ఓ మాజీ ప్రజా ప్రతినిధి రెచ్చిపోయాడు. తనను నిలదీసిన భార్యపై పోలీసు స్టేషన్ లోనే దాడిచేసిన ఘటన బెంగళూరుతో చోటు చేసుకుంది. ముదిగెరె మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి గత ఆరు నెలలుగా తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆయన భార్య సవిత... తల్లి, సోదరునితో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు పోలీసు స్టేషన్ కు తరలించారు.

అక్కడ తన భర్త పోలీసులు ఎదుటే తనపై దాడికి చేశాడని అనంతరం సవిత విలేకరులకు తెలిపింది. అయినా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయబోనని ఇది తమ కుటుంబ అంతర్గత వ్యవహారమని, ఆయనతో తాను జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. గత ఆరు నెలలుగా భర్త ఇంటికి రావడం లేదని తనను పట్టించు కోవడంలేదని అతను వేరే స్త్రీతో ఉంటున్నాడని సవిత ఆరోపించారు. దీనిపై కుమారస్వామిని  ప్రశ్నించగా సవితనే ఎనిమిదేళ్లుగా తన దగ్గరకు రావడం లేదని ఇది తన కుటుంబ సమస్య అని దీనిని   తాను పరిష్కరించుకుంటానని తెలిపారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement